మునగాల వద్ద బస్సు బోల్తా | Sri Krishna Travels Bus Met An Accident At Munagala | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 19 2018 7:22 AM | Last Updated on Wed, Sep 19 2018 1:17 PM

Sri Krishna Travels Bus Met An Accident At Munagala - Sakshi

సాక్షి, సూర్యాపేట : జిల్లాలోని మునగాల వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు అదుపు తప్పి పల్టీ కొట్టి.. రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఈ బస్సు శ్రీకృష్ణ ట్రావెల్స్‌కు చెందినదిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 30 మందికి తీవ్ర గాయాలయినట్టు సమాచారం. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. బస్సు పల్టీ కొట్టడంతో అందులో ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అతి వేగం, డ్రైవర్‌ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement