పట్టుబడిన మద్యంతో పోలీసులు
కోదాడ: మునగాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న వారిని కోదాడ పోలీసులు మంగళవారం రాత్రి ఆకస్మికదాడి చేసి పట్టుకున్నారు. ఈ మద్యం విలువ దాదాపు రూ.1.34లక్షలు ఉంటుందని సీఐ శ్రీనివాసులరెడ్డి, ఎస్‌ఐ క్రాంతికుమార్ తెలిపారు. వివరాలు.. పట్టణ పరిధిలోని సాలార్‌జంగ్‌పేటకు చెందిన డ్రైవర్ నారగాని వెంకన్న, క్లీనర్ గుండు సతీష్ తమ యజమాని ఇష్టం చెట్ల శ్రీనివాసరావు సాయంతో మునగాలలోని వైన్స్‌లో మద్యం కొనుగోలు చేశారు. ఆ మద్యాన్ని డీసీఎం వ్యాన్‌లో తవుడు బస్తాల మధ్యలో ఉంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నారు. అక్కడ ఎక్కువ ధర ఉండడంతో ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. పోలీసులకు పక్కా సమాచారం రావడం దాడి చేసి పట్టుకున్నారు. మద్యంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఒప్పందం కుదరక ..?
మద్యం అక్రమంగా తరలిస్తున్న మాఫియా వెనుక కొందరు పెద్దల హస్తం ఉన్నట్లు ఆరోపణలు న్నాయి. మంగళవారం రాత్రి మద్యం అక్రమ రవా ణా చేస్తున్న విషయాన్ని కొందరు పసిగట్టి కొమరబండ వద్ద అడ్డగించి బొబ్బలమ్మగుట్ట వద్ద బేరసారాలకు దిగినట్లు సమాచారం. ఒప్పందం కుదరకపోలీసులకు సమాచారం ఇవ్వగా ఈ విషయం వెలుగుచూసినట్లు తెలుస్తోంది. పట్టణానికి చెందిన కొందరు రాత్రి సమయంలో అక్రమంగా మద్యం, గుట్కాలను తరలిస్తున్న వారిని టార్గెట్ చేసి కార్లలో వెంబడించడం, వారితో బేరసారాలకు దిగడం కుదరకపోతే పోలీసులకు సమాచారం ఇవ్వడం పనిగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment