
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో మద్యం అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌శాఖ మంత్రి నారాయణస్వామి హెచ్చరించారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించి.. మద్యం అమ్మకాలను నిషేధించింది. అయితే అనధికారికంగా మత్తు పదార్ధాల విక్రయాలు జరిపినా, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరించినా చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌శాఖా మంత్రి నారాయణస్వామి తెలిపారు. (కరోనా పరీక్షలు: వైద్య సిబ్బందిపై స్థానికుల రాళ్ల దాడి)
లాక్‌డౌన్‌ను సక్రమంగా అమలు చేయకుంటే ఎక్సైజ్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని బార్లు, మద్యం షాపుల్లో స్టాక్‌ను తనిఖీ చేయాలని ఎక్సైజ్ సిబ్బందిని ఆదేశించారు. మళ్ళీ అమ్మకాలు ప్రారంభించిన తర్వాత ఓపెనింగ్ స్టాక్‌కు ఇప్పటి క్లోజింగ్ స్టాక్ సరిగా ఉందో లేదో వెరిఫై చేయాలని ఎక్సైజ్ సిబ్బందిని ఆదేశించారు. ఎక్సైజ్ అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని, సక్రమంగా పని చేయని వారిపై శాఖపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. (‘నిజమే చెబుతున్నారా.. చైనాను నమ్మలేం’)
ఎవరైనా మద్యం విక్రయిస్తే టోల్‌ఫ్రీ నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వినీత్ బ్రిజ్‌లాల్ సూచించారు. టోల్ ఫ్రీ నెంబర్లు 18004254868, 94910 30853, 0866 2843131. మత్తుకు బానిసలైన కొంతమంది సహనం కోల్పోయి హానికర ద్రవాలు సేవించి ప్రాణాలపైకి తెచ్చుకోవద్దని ఆయన కోరారు. వారి విషయంలో కుటుంబ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. (‘ఇలా చేస్తే కరోనా నుంచి కోలుకోవచ్చు’)
Comments
Please login to add a commentAdd a comment