రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు | two persons injured in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

Published Sat, Oct 8 2016 10:54 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు - Sakshi

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

ముకుందాపురం (మునగాల) : ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్రంగా, మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మండలంలోని ముకుందాపురం బస్టాండ్‌ సమీపంలో జాతీయ రహాదారిపై శనివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు స్థానికుల కథనం ప్రకారం.. శుక్రవారం రాత్రి విజయవాడ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్లే ఓ లోడు లారీ ముకుందాపురం వద్ద మరమ్మతుకు గురికావడంతో రోడ్డు మధ్యలో నిలిపివేశారు. అదే సమయంలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్లే ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ శనివారం తెల్లవారుజామున వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు క్యాబిన్‌లో ఉన్న రెండో డ్రైవర్‌ కరీముల్లా (తాడేపల్లిగూడెం)తో పాటు తనుకుకు చెందిన అబ్దుల్‌రహీంకు తీవ్రంగా, మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని జాతీయ రహదారి వాహనం 1033లో చికిత్స నిమిత్తం కోదాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో దాదాపు రెండు గంటల పాటు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా, ఈ ప్రమాద విషయమై ఇంతవరకు తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని మునగాల పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement