Mukundapuram
-
ఏమైందో..ఏమో..!
వేపాడ: కన్నపేగు తెంచుకుని పుట్టిన కొడుకు వృద్ధాప్యంలో పోషిస్తాడని ఊహించుకున్న ఆ తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగులుస్తూ ఆ బిడ్డ కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఉన్న ఇద్దరిలో ఒకరినైనా చదివించి ప్రయోజకుడ్ని చేద్దామని కష్టపడి పనిచేస్తున్న ఆ తల్లిదండ్రుల ఆశల్ని విధి ఎత్తుకుపోయింది. ఎంతో భవిష్యత్ ఉన్న కొడుకు కళ్ల ముందే విగత జీవిగా పడి ఉండడాన్ని చూసిన ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా ఎడుస్తుంటే వారిని ఆపడం ఎవరి తరమూ కాలేదు. క్షణికావేశంలో ఆ బాలుడు తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని దహించేస్తుంటే, ఊరిని శోకసంద్రంలో ముంచేసింది. ఈ మృతిపై వల్లంపూడిగ ఎస్ఐ స్వర్ణలత అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. వేపాడ మండలం ముకుందపురం గ్రామానికి చెందిన ఏడువాక గణేష్ (13) సోమవారం తన ఇంటిలో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయాన్నే తండ్రి రామకృష్ణ, అన్నయ్య హరికృష్ణతో కల్లానికి వెళ్లి పాలు తీసుకువచ్చి, గ్రామంలోని క్యాన్‌కు పాలు పోసిన తర్వాత గణేష్ ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో తల్లి దేముడమ్మ గణేష్‌ను బడికి టైము అవుతుంది వెళ్లవా అని అడిగింది. మక్క నొప్పి పెడుతుందని వెళ్లనని సమాధానం ఇచ్చాడు. తల్లి పనుల్లో మునిగిపోయింది. అనంతరం గణేష్ అన్న హరికృష్ణ వచ్చి తమ్ముడు స్కూల్‌కు వెళ్లలేదా అని తల్లిని అడిగాడు. వెళ్లలేదని ఆమె చెప్పింది. వెంటనే హరికృష్ణ, గణేష్ ఉండే రూములోకి వెళ్లి చూడగా తమ్ముడు హుక్కుకు ఉరివేసుకుని ఉండడాన్ని చూసి హతాశుడయ్యాడు. వెంటనే హరికృష్ణ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి గణేష్‌ను కిందకి దింపాడు. అప్పటికే గణేష్ మృతి చెందడంతో వారు శోక సంద్రంలో మునిగిపోయారు. మృతుడి తండ్రి రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
ముకుందాపురంలో దారుణం
మద్దిరాల(నల్గొండ జిల్లా): మద్దిరాల మండలం ముకుందాపురంలో బుధవారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకన్న(43) తన భార్యను తాగిన మైకంలో గొడ్డలితో నరికి అనంతరం కుమారుడ్ని నేలకేసి కొట్టి దారుణంగా హతమార్చాడు. అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో కుమారుడు ప్రదీప్(5 నెలలు) అక్కడికక్కడే మృతిచెందగా..భార్య స్వప్నకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
ముకుందాపురం (మునగాల) : ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్రంగా, మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మండలంలోని ముకుందాపురం బస్టాండ్ సమీపంలో జాతీయ రహాదారిపై శనివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు స్థానికుల కథనం ప్రకారం.. శుక్రవారం రాత్రి విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే ఓ లోడు లారీ ముకుందాపురం వద్ద మరమ్మతుకు గురికావడంతో రోడ్డు మధ్యలో నిలిపివేశారు. అదే సమయంలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ శనివారం తెల్లవారుజామున వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు క్యాబిన్లో ఉన్న రెండో డ్రైవర్ కరీముల్లా (తాడేపల్లిగూడెం)తో పాటు తనుకుకు చెందిన అబ్దుల్‌రహీంకు తీవ్రంగా, మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని జాతీయ రహదారి వాహనం 1033లో చికిత్స నిమిత్తం కోదాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో దాదాపు రెండు గంటల పాటు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా, ఈ ప్రమాద విషయమై ఇంతవరకు తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని మునగాల పోలీసులు తెలిపారు. -
ముగిసిన జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు
నిడమనూరు : మండలంలోని ముకుందాపురంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న అండర్–14, 17 బాలబాలికల వాలీబాల్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. అండర్ – 14, అండర్ – 17 బాల బాలికల విభాగాల్లో జరిగిన వాలీబాల్ పోటీల్లో మిర్యాలగూడ జట్లు మెుదటి స్థానం సాధించగా, సూర్యాపేట జట్లు ద్వితీయ స్థానం సాధించాయి. ఈ సందర్భంగా విజేతలకు డీఈఓ చంద్రమోహన్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి నోముల నర్సింహయ్య షీల్డు, వ్యక్తిగత బహుమతులు అందజేశారు. అనంతరం డీఈఓ చంద్రమోహన్ మాట్లాడుతూ ముకుందాపురం ప్రభుత్వ పాఠశాల బాలికలు రాష్ట్రానికే గర్వకారణంగా నిలుస్తున్నారని అన్నారు. ఈ పాఠశాల బాలికలు ఎన్నో టోర్నమెంట్లలో మెదటి స్థానం సాధించాలని కొనియాడారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి జట్టుకు విద్యార్థులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ బాలునాయక్, సర్పంచ్ శివరామకృష్ణ, వైఎస్ ఎంపీపీ సీతారాములు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నూకల వెంకటరెడ్డి, అబ్బాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ అబ్బాస్, మాజీ సర్పంచ్ రామాంజయ్య యాదవ్, నిడమనూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంసీ కోటిరెడ్డి, వంశీరెడ్డి, పీఈటీలు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ముకుందాపురం (మునగాల): జాతీయ రహదారిపై మండలంలోని ముకుందాపురం గ్రామశివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా మరొకరికి తీవ్ర, ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మునగాల పోలీస్‌స్టేషన్ ఇన్చార్జి అహ్మద్‌జానీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శ్రీకాకుళం జిల్లా మిలయపుట్టి మండలం వసుంధర గ్రామానికి చెందిన కిల్లీ జగదీశ్(30) కాంట్రాక్టర్‌గా పనిచేస్తూ రంగారెడ్డి జిల్లా బాలానగర్‌లో స్థిరపడ్డాడు. కాగా బుధవారం రాత్రి తన సొంతకారులో కుటుంబసభ్యులతో కలిసి పుష్కరాల్లో పాల్గొనేందుకు బాలానగర్ నుంచి విజయవాడకు బయలు దేరారు. బాలానగర్ నుంచి సూర్యాపేట వరకు ౖడ్రైవర్ సమీర్ కారును నడుపగా సూర్యాపేట నుంచి జగదీశ్ నడుపుతూ ముకుందాపురం శివారులోకి వచ్చారు. ఈ క్రమంలో జగదీశ్ నిద్రమత్తులో అతివేగంగా కారును నడుపుతూ రహదారి పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టాడు. దీంతో జగదీశ్ తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ముందు సీటులో కూర్చున్న డ్రైవర్ సమీర్‌కు తీవ్రగాయాలు కాగా మృతుడి భార్య స్వాతి, కూమారుడు చరణ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం కోదాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. జగదీశ్ మృతదేహానికి కోదాడ ప్రభుత్వాసుపత్రిలో శవపరీక్ష నిర్వహించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ముకుందాపురం (మునగాల): జాతీయ రహదారిపై మండలంలోని ముకుందాపురం గ్రామశివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా మరొకరికి తీవ్ర, ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మునగాల పోలీస్‌స్టేషన్ ఇన్చార్జి అహ్మద్‌జానీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శ్రీకాకుళం జిల్లా మిలయపుట్టి మండలం వసుంధర గ్రామానికి చెందిన కిల్లీ జగదీశ్(30) కాంట్రాక్టర్‌గా పనిచేస్తూ రంగారెడ్డి జిల్లా బాలానగర్‌లో స్థిరపడ్డాడు. కాగా బుధవారం రాత్రి తన సొంతకారులో కుటుంబసభ్యులతో కలిసి పుష్కరాల్లో పాల్గొనేందుకు బాలానగర్ నుంచి విజయవాడకు బయలు దేరారు. బాలానగర్ నుంచి సూర్యాపేట వరకు ౖడ్రైవర్ సమీర్ కారును నడుపగా సూర్యాపేట నుంచి జగదీశ్ నడుపుతూ ముకుందాపురం శివారులోకి వచ్చారు. ఈ క్రమంలో జగదీశ్ నిద్రమత్తులో అతివేగంగా కారును నడుపుతూ రహదారి పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టాడు. దీంతో జగదీశ్ తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ముందు సీటులో కూర్చున్న డ్రైవర్ సమీర్‌కు తీవ్రగాయాలు కాగా మృతుడి భార్య స్వాతి, కూమారుడు చరణ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం కోదాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. జగదీశ్ మృతదేహానికి కోదాడ ప్రభుత్వాసుపత్రిలో శవపరీక్ష నిర్వహించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. -
కానిస్టేబుళ్ల సెలక్షన్లలో అపశ్రుతి
-
కానిస్టేబుళ్ల సెలక్షన్లలో అపశ్రుతి
నల్గొండ: పోలీస్ కానిస్టేబుళ్ల దేహదారుడ్య పరీక్షల్లో మంగళవారం అపశ్రుతి చోటు చేసుకుంది. కానిస్టేబుళ్ల సెలక్షన్స్‌లో భాగంగా నిర్వహించిన పరుగు పందెంలో రాజశేఖర్ అనే యువకుడు కళ్లు తిరిగి కింద పడ్డాడు. సహాచరులు వెంటనే స్పందించి... అతడి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... మరణించాడు. రాజశేఖర్ పెన్పహడ్ మండలం ముకుందాపురానికి చెందిన వాడని పోలీసులు తెలిపారు. రాజశేఖర్ మరణవార్త విని అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. -
పొట్టకూటి కోసం వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు..
ముకుందాపురం,(మునగాల) :రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు వారివి. పొట్టకూటి కోసం నాలుగు రాళ్లు సంపాదించుకుందామనే ఉద్దేశంతో వెళుతున్న వారిని మార్గమధ్యలో లారీరూపంలో మృత్యువు కబళించింది.పెద్దదిక్కు కోల్పోయి మూడు కుటుంబాలు వీధినపడ్డాయి. అతివేగమే ప్రమాదానికి కారణం 65వ నంబరు జాతీయ రహదారిపై మునగాల మం డలం ముకుందాపురం శివారులో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి అతివేగం,నిద్రమత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మం డ లం రాయిగూడెం నుంచి మెదక్ జిల్లా సిద్దిపేటకు పా తపెంకుల లోడుతో లారీ వెళ్ల వలిసి ఉంది. అయితే రంజాన్ పర్వదినం కావడంతో డ్రైవర్ షేక్‌వలీ గ్రా మంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నాడు. రాత్రి పదిం టికి ఇంటి నుంచి బయలుదేరిన రెండు గం టలలోపే ప్రమాదం జరిగి ముగ్గురు మృత్యువాత పడ్డారు. మృతులంతా దినసరి కూలీలే రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన దొప్పా కుమారి(48),తోట కొండలు(47), ఏ.శ్రీను(28), గాయపడిన లింగం అప్పారావు, లింగయ్య దినసరి కూలీలే. వీరంతా ఖమ్మం జి ల్లా నేలకొండపల్లి మండలం రాయిగూడేనికి చెందిన వారు. వీరు గ్రామాల్లో బెంగళూరు పెంకను సేకరించే కూలీలుగా పనిచేస్తున్నారు. మిన్నంటిన ఆర్తనాదాలు అతివేగంతో వస్తున్న లారీ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తాకొట్టింది.పెంకులపై భాగంలో ఉన్న తోట ఏడుకొండలు,ఆకం శ్రీనుపై పెంకలు పడడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. క్యాబిన్లో కూర్చున్న దొప్పా కుమారి, లింగం అప్పారావు, లింగయ్య అం దులోనే ఇరుక్కుపోయారు. తమను రక్షించాలని చేసిన ఆర్తనాదాలు మిన్నంటాయి. అప్రమత్తమైన పోలీసులు హైవేపై ప్రమాదం విషయం తెలుసుకుని మునగాల స్టేషన్ ఇన్చార్జ్ ఎస్ఐ డి.రామకృష్ణారెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన ముగ్గురిని చాకచక్యంగా బయటకు తీశారు. అనంతరం జేసీబీ సాయంతో పెంకుల లోడు కింద ఉన్న మరో ఇద్దరిని వెలికి తీశారు. అప్పటికే వారు మృతి చెందారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం 108వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా దోప్పా కుమారి మృతిచెందగా, అప్పారావు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో లారీక్లీనర్ యూసఫ్‌కు స్వల్ప గాయాలు కాగా, డ్రైవర్ షేక్‌వలీ క్షేమంగా బయట పడ్డాడు. పెద్దదిక్కు కోల్పోయిన బాధిత కుటుంబాలు రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడడంతో ఆయా కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి వీధిన పడే పరిస్థితి ఏర్పడింది. మృతురాలు దొప్పా కుమారి స్వగ్రామంలో చిన్న కిరాణ దుకాణం ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తోంది. భర్త ఇంతకు ముందే మృతిచెందగా కుమారుడు రెండేళ్ల క్రితం మరణించాడు. ఈమెకు ఒక కుమార్తె. ఇదే గ్రామానికి చెందిన తోట కొండలు(47) వ్యవసాయ కూలీ. ఇతడికి భార్య నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. మరో మృతుడు ఆకం శ్రీను(28)కు భార్య, పదేళ్లలోపు కూతురు, కుమారుడు ఉన్నారు. ఈయనది రెక్కాడితే డొక్కాడని కుటుంబమే.