Published
Thu, Aug 18 2016 11:38 PM
| Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ముకుందాపురం (మునగాల): జాతీయ రహదారిపై మండలంలోని ముకుందాపురం గ్రామశివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా మరొకరికి తీవ్ర, ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మునగాల పోలీస్‌స్టేషన్ ఇన్‌చార్జి అహ్మద్‌జానీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శ్రీకాకుళం జిల్లా మిలయపుట్టి మండలం వసుంధర గ్రామానికి చెందిన కిల్లీ జగదీశ్(30) కాంట్రాక్టర్‌గా పనిచేస్తూ రంగారెడ్డి జిల్లా బాలానగర్‌లో స్థిరపడ్డాడు. కాగా బుధవారం రాత్రి తన సొంతకారులో కుటుంబసభ్యులతో కలిసి పుష్కరాల్లో పాల్గొనేందుకు బాలానగర్ నుంచి విజయవాడకు బయలు దేరారు. బాలానగర్ నుంచి సూర్యాపేట వరకు ౖడ్రైవర్ సమీర్ కారును నడుపగా సూర్యాపేట నుంచి జగదీశ్ నడుపుతూ ముకుందాపురం శివారులోకి వచ్చారు. ఈ క్రమంలో జగదీశ్ నిద్రమత్తులో అతివేగంగా కారును నడుపుతూ రహదారి పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టాడు. దీంతో జగదీశ్ తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ముందు సీటులో కూర్చున్న డ్రైవర్ సమీర్‌కు తీవ్రగాయాలు కాగా మృతుడి భార్య స్వాతి, కూమారుడు చరణ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం కోదాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. జగదీశ్ మృతదేహానికి కోదాడ ప్రభుత్వాసుపత్రిలో శవపరీక్ష నిర్వహించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.