తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేంద్రం కుట్రపూరితమైన చర్యలకు పాల్పడుతుందని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ ఆరోపించారు.
నల్గొండ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేంద్రం కుట్రపూరితమైన చర్యలకు పాల్పడుతుందని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ ఆరోపించారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ డిసెంబర్ 1న ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీలను కలుస్తామన్నారు. భద్రాచలం, మునగాల.... తెలంగాణలో అంతర్బాగమేనని దేవీప్రసాద్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.