శుభకార్యానికి వస్తూ.. పరలోకాలకు..
► తెల్లారిన కూలీల బతుకులు
► మునగాల మండల పరిధిలో లారీబోల్తా
► ముగ్గురి దుర్మరణం.. మరో ఇద్దరికి గాయాలు
► డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణం
వారంతా 35ఏళ్ల లోపు యువకులే.. కరువు పరిస్థితుల దృష్ట్యా జీవనోపాధి కోసం మెదక్ జిల్లాకు ఇటీవల వలసెల్లారు..రోజు వారీ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు.. వివాహ వేడుకలో పాల్గొనేందుకు స్వగ్రామానికి లారీలో తిరిగివస్తున్నారు.. మరో గంట సమయం గడిస్తే ఇంటికి చేరుకుంటామనుకునేలోగానే మార్గమధ్యలోనే వారి బతుకులు తెల్లారిపోయాయి.. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా లారీ బోల్తా పడడంతో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
- మునగాల
మేళ్లచెరువు మండలం రేవూరు గ్రామానికి చెందిన నార్ల కొండస్వామి(35),షేక్ సైదా(31), గెనుకొండ కొండలరాజు(30), బాణో తు వెంకటరామదాసు వృత్తిరీత్యా కూలీ లుగా జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 11న జీవనోపాధి నిమిత్తం మెదక్ జిల్లాకు వలసెల్లారు. అక్కడ 20 రోజుల పాటు ఇళ్ల పైకప్పులు కప్పేందుకు ఒప్పందం చేసుకున్నారు. వీరితో పాటు గ్రామానికి చెందిన మరో ఇద్దరు కూడా వెళ్లారు.
వివాహ వేడుకలో పాల్గొనేందుకు వస్తూ..
నార్ల కొండస్వామి అన్న కూతురు వివాహం ఆదివారం రేవూరులో జరుగనున్నది. ఈ వివాహా వేడుకలలో పాల్గొనేందుకు నలుగురు వ్యక్తులు స్వగ్రామానికి రావాలని నిర్ణయించుకున్నారు. శనివారం తెల్లవారుజామున మెద క్ నుంచి విజయవాడకు టైల్స్ లోడుతో వెళ్తు న్న లారీలో బయలుదేరారు.
కొంపముంచిన డ్రైవర్ నిద్రమత్తు
మరో గంట గడిస్తే కూలీలంతా స్వగ్రామానికి చేరుకునేవారే. మార్గమధ్యలో మునగాల మం డలం ఆకుపాముల శివారులోకి రాగానే డ్రైవర్ మరియాదాసుకు నిద్రమత్తు ముంచుకురావడంతో లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో టైల్స్ లోడుపై ఉన్న నార్ల కొండస్వామి(35),షేక్ సైదా(31), గెనుకొండ కొండలరాజు(30), అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా బాణోతు వెంకటరామదా సు, డ్రైవర్‌కు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకుని పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను, క్షతగాత్రులను లారీకింద నుంచి వెలికి తీయించారు.
లారీడ్రైవర్ మరియాదాసుది నందిగామ నియోజకవర్గం చందర్లపాడుగా గుర్తిం చారు. గాయపడిన మరియదాసు, వెంకటరామదాసును కోదాడకు తరలించారు. ఈ ప్రమాదానికి లారీక్లీనర్ కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రైవర్ నిద్రిస్తుం డగా క్లీనర్ లారీని నడుపుతున్నటు ప్రమాదం నుంచి బయటపడిన బాధితుడు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. క్లీనర్ పరారీలో ఉన్నాడు. మృతదేహాలకు కోదాడ ప్ర భుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కు టుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ నగేష్ తెలిపారు.