Traffic jams
-
హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం భారీ వర్షం ముంచెత్తింది. కుండపోతగా పడుతున్న వర్షానికి చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్ఆర్నగర్, కూకట్పల్లి, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచి.. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ముఖ్యంగా పంజాగుట్ట నుంచి సికింద్రబాద్, ఖైరతాబాద్ నుంచి ఎర్రగడ్డ వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యధికంగా మదాపూర్‌లో 7.9 సెంటీమీటర్లు, జూబ్లీహిల్స్‌లో 7.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమైన క్రమంలో జీహెచ్ఎంసీ డిజాస్టర్ టీమ్స్ రంగంలోకి దిగాయి. -
హైదరాబాద్‌లో ఈ రూట్లలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం సందర్భంగా.. రాజధాని నగరంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు నెలకొన్నాయి. రాష్ట్రం మొత్తం ఒకేసారి జగగణమన ఆలపించేలా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మంగళవారం ఉదయం 11.30 ప్రాంతంలో ఎక్కడికక్కడే అంతా ఆగిపోయి.. జాతీయ గీతం పాడేలా కార్యక్రమం రూపొందించింది కేసీఆర్ సర్కార్. ఈ నేపథ్యంలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం 12.30 దాకా నగరంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు ప్రకటించారు. అయితే ఉదయం నుంచే చాలాచోట్ల ట్రాఫిక్ జామ్ కావడం విశేషం. అంతేకాదు మూడు గంటల తర్వాత కూడా ట్రాఫిక్ జామ్ కష్టాలు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. లిబర్టీ, బషీర్‌బాగ్, జగ్జీవన్‌రామ్ జంక్షన్, కింగ్‌కోఠి, అబిడ్స్‌లో భారీగా ఆంక్షలు ఉండనున్నాయి. కాబట్టి, ఆ రూట్లో వెళ్లే వాహనదారులు, ప్రయాణికులకు సూచనలు జారీ అయ్యాయి. ఈ ట్రాఫిక్ ఎఫెక్ట్‌తో.. డైవర్షన్ మూలంగా మరికొన్ని చోట్ల కూడా వాహన దారులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నాయి. కార్యక్రమంలో భాగంగా ఉదయం 11గం.30ని.కు.. అన్ని ట్రాఫిక్ కూడళ్లలో నిమిషం పాటు రెడ్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే చాలా చోట్ల భారీగా ట్రాఫిక్ ఝామ్ అవుతోంది. కోఠిలో ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ఐదు వేల మంది విద్యార్థులు జాతీయ గీతాలాపనలో పాల్గొననున్నారు. అబిడ్స్ జీపీవో దగ్గర చౌరస్తాలో నెహ్రూ విగ్రహం వద్ద జాతీయ గీతాలాపనలో పాల్గొననున్నారు సీఎం కేసీఆర్. కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం పాల్గొన్ననున్నారు. -
హైదరాబాద్: అక్కడ ట్రాఫిక్ జామ్.. ఇలా వెళ్లండి
బంజారాహిల్స్‌కు చెందిన ఓ వాహనదారు అబిడ్స్ వెళ్లడానికి బయలుదేరారు. లక్డీకాపూల్‌లోని రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద హఠాత్తుగా నిరసనకారులు రోడ్డు దిగ్బధించడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఈ విషయం ఆయనకు నిరంకారి దాటే వరకు తెలియలేదు. దీంతో ప్రత్యామ్నాయం ఎంచుకోలేక ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు సాక్షి, హైదరాబాద్: నగరంలో అనేక మంది వాహనచోదకుల పరిస్థితి ఇలాగే ఉంటోంది. ప్రధానంగా పీక్ అవర్స్‌లో కార్యాలయాలకు వెళ్లడానికి, అత్యవసరమైన పనులపై బయటకు వస్తున్న వాళ్లు హఠాత్తుగా తలెత్తే అవాంతరాలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఇలాంటి హఠాత్పరిణామాలపై వాహన చోదకులను అప్రమత్తం చేయాలని నిర్ణయించారు. ఆ మళ్లింపులపై భారీ కసరత్తు... నగరంలో రహదారి, డ్రైనేజీ, ఫ్లైఓవర్.. ఇలా ఏదో ఒక నిర్మాణం, మరమ్మతులు జరుగుతూనే ఉంటాయి. ఆయా సందర్భాల్లో ఆ దారిలో వెళ్లాల్సిన వాహనాలను నిర్ణీత కాలం వరకు మళ్లిస్తుంటారు. దీనికోసం ట్రాఫిక్ పోలీసులు పెద్ద ఎత్తున కసరత్తు చేసి ప్రత్యామ్నాయ మార్గాలు గుర్తించడంతో పాటు అవసరమైతే మరమ్మతులు చేయిస్తారు. ఈ మళ్లింపులపై మీడియా, సోషల్ మీడియాలో ప్రకటనలు ఇవ్వడంతో పాటు ఆయా మార్గాల్లో ఫెక్సీలు సైతం ఏర్పాటు చేస్తారు. వాహనచోదకులు అడ్డంకులు ఉన్న మార్గంలో వెళ్లి ఇబ్బందులు ఎదుర్కోకూడదన్నదే వీటి వెనుక ఉన్న ఉద్దేశం. హఠాత్తుగా వస్తే ఆగిపోవాల్సిందే... నగరం రాష్ట్ర రాజధాని కూడా కావడంతో అనేక శాఖలు, సంస్థల ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉంటాయి. ఎక్కడి వాళ్లు నిరసనలు తెలపాలన్నా తమ ‘గొంతు అందరికీ వినిపించాలనే’ ఉద్దేశంతో దానికి ఇక్కడి కార్యాలయాలు, ప్రాంతాలనే ఎంచుకుంటారు. నిరసనల్లో కొన్ని అనుమతులు తీసుకుని జరిగితే, మరికొన్ని హఠాత్తుగా తెరపైకి వస్తాయి. మొదటి కేటగిరీకి చెందిన వాటితో ఇబ్బంది లేకున్నా రెండో రకమైన వాటి వల్ల తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు వస్తుంటాయి. భారీ ప్రమాదం లాంటివి జరిగినా పరిస్థితి ఇలానే ఉంటుంది. చదవండి: కలెక్టర్ అవుదామని కలలు కని.. రియల్ ఎస్టేట్‌ను నమ్ముకుని.. సర్వీస్ ప్రొవైడర్ల సహకారంతో.. ఈ తరహా ట్రాఫిక్ జామ్స్‌పై ఆయా మార్గాల్లో వచ్చే వాహనచోదకులను నిర్ణీత ప్రాంతాలకు చేరుకోవడానికి ముందే అప్రమత్తం చేయాలని ట్రాఫిక్ విభాగం అధికారులు నిర్ణయించారు. దీనికోసం సెల్‌ఫోన్ సేవలు అందిస్తున్న సర్వీస్ ప్రొవైడర్ల సహాయం తీసుకోవాలని యోచిస్తున్నారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న, ఆయా మార్గాల్లో ప్రయాణిస్తున్న వాహనచోదకుల ఫోన్ నెంబర్ల డేటా సర్వీస్ ప్రొవైడర్ల వద్ద ఉంటుంది. ఈ సర్వీస్ ప్రొవైడర్లు ఓ ప్రాంతం పిన్‌కోడ్ నెంబర్ ఆధారంగా అక్కడ రిజిస్టర్ అయి ఉన్న, యాక్టివేషన్లో ఉన్న ఫోన్ నంబర్లను గుర్తించగలుగుతారు. దీని ఆధారంగా ఆ ప్రాంతంలో సెల్ఫోన్లను గుర్తిచడం ద్వారా వారికి ట్రాఫిక్ జామ్‌పై సమాచారం ఇప్పించడానికి ట్రాఫిక్ విభాగం అధికారులు కసరత్తు చేస్తోంది. ఏ రూపంలో అనే అంశంపై సమాలోచన... ట్రాఫిక్ జామ్‌లకు సంబంధించిన సమాచారాన్ని ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఉండే సిబ్బంది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. వీరి ద్వారా ఈ వివరాలు ఆయా సర్వీస్ ప్రొవైడర్లకు చేరతాయి. ఈ సమాచారాన్ని వాహన చోదకుడి ఏ రూపంలో పంపాలనే దానిపై అధికారులు సమాలోచన చేస్తున్నారు. సంక్షిప్త సందేశం, ఆడియో క్లిప్, ఐవీఆర్ఎస్ తరహా కాల్... తదితర మార్గాలను పరిశీలిస్తున్నారు. నగరంలోని అనేక కూడళ్లల్లో ఉన్న సైనేజ్ బోర్డుల ద్వారానూ ఈ అడ్డంకుల సమాచారాన్ని వాహనచోదకులకు తెలియజేయనున్నారు. ట్రాఫిక్ జామ్ ఉన్న ప్రాంతానికి దారి తీసే మార్గాల్లోనే ఈ సందేశం కనిపించేలా ఏర్పాటు చేయనున్నారు. బంజారాహిల్స్‌లో స్తంభించిన ట్రాఫిక్ బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని అగ్రసేన్ చౌరస్తాలో నీటి పైప్‌లైన్‌కు లీకేజీలు రావడంతో గత నాలుగు రోజుల నుంచి తవ్వకాలు చేపట్టి కొత్త పైపులు ఏర్పాటు చేస్తున్నారు. ఇరుకైన చౌరస్తాలో తవ్వకాలతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బంజారాహిల్స్ రోడ్ నెం.12 వైపు, తెలంగాణ భవన్ రోడ్డులో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. స్కూల్ బస్సులన్నీ ట్రాఫిక్‌లో గంటల తరబడిగా చిక్కుకుపోయాయి. -
వీడని వాన.. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు
శనివారం ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, అది ఆదివారం అల్ప పీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారి నాగరత్న తెలిపారు. ఆ అల్పపీడనం ప్రభావంతో ఆది, సోమవారాల్లో రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ముఖ్యంగా రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, మేడ్చల్, హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో కుండపోత వానలుపడే అవకాశం ఉందని తెలిపారు. ఇక నైరుతి రుతుపవనాల ఉపసంహరణ కొనసాగుతోందని.. రెండు రోజుల్లో ఉత్తర భారతం నుంచి రుతుపవనాలు వెళ్లిపోనున్నాయని వివరించారు. సాక్షి, హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. హైదరాబాద్ నగరంతోపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రిదాకా భారీ వర్షాలు కురిశాయి. పలుచోట్ల పెద్ద ఎత్తున ఉరుములు, మెరుపులతో కుండపోత వానలు, పిడుగులు పడటంతో ప్రజలు బెంబేలెత్తారు. హైదరాబాద్ ఆగమాగం.. హైదరాబాద్‌లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం రాత్రి వరకు దఫదఫాలుగా భారీ వర్షం కురిసింది. జనం ఇళ్లనుంచి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. సికింద్రాబాద్, కంటోన్మెంట్, మలక్‌పేట, ఎల్బీనగర్, కొత్తపేట, చార్మినార్, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో వాన బీభత్సం సృష్టించింది. కొత్తపేట, ఎల్బీనగర్, నాగోల్, మలక్‌పేట వంటి ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం నుంచే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చాలా కాలనీల ప్రజలు చీకట్లోనే ఉండాల్సి వచ్చింది. వరదతో చెరువులు, నాలాలు ఉప్పొంగాయి. పలు కాలనీలు నీట మునిగాయి. రోడ్లపై భారీగా నీరు చేరడంతో కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ స్తంభించిపోయింది. దసరా సెలవులు కావటంతో సొంతూర్లకు బయలుదేరినవారు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి ఇబ్బందిపడ్డారు. లోతట్టు ప్రాంతాలు, మూసీ నదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాల్లో ప్రజలను జీహెచ్ఎంసీ, పోలీసులు అప్రమత్తం చేశారు. దిల్సుఖ్నగర్ శివగంగ థియేటర్ ప్రహరీగోడ కూలిపోయి.. పార్కింగ్ చేసి ఉన్న వాహనాలపై పడింది. సుమారు 50 బైక్‌లు ధ్వంసమయ్యాయి. హైదర్‌గూడ ప్రాంతంలో మూసీ నదిలో మొసలి బయటికి రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రోడ్లపై గుంతలతో.. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఫైఓవర్లు, అండర్‌పాస్‌లు, ఫుట్ఓవర్ బ్రిడ్జిల పనులు జరుగుతున్నాయి. నిర్మాణాల కోసం ఆయా చోట్ల రహదారులను తవ్వడంతో.. గుంతలు పడ్డాయి. వాటిలో వాన నీళ్లు నిండటంతో.. వాహనదారులు భయంభయంగా ప్రయాణించాల్సి వచ్చింది. పలు జిల్లాల్లోనూ.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి నుంచీ వర్షం దంచికొట్టింది. నారాయణపేట, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో పత్తి పంట దెబ్బతిన్నది. మొత్తంగా ఉమ్మడి జిల్లా పరిధిలో 4,008 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఉండవెల్లి మండలంలో ఉల్లిపంట నీట మునిగింది. వరద పోటెత్తడంతో సంగంబండ రిజర్వాయర్, కోయిల్‌సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షం ధాటికి జనగామ జిల్లాలోని పెంబర్తి సమీపంలో వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారి కోతకు గురైంది. జూరాలకు భారీ వరద జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పెరిగింది. శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో ప్రాజెక్టులోకి 82,471 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ఎనిమిది గేట్ల ద్వారా, జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా కలిపి 79,571 క్యూసెక్కులను దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు వదులుతున్నారు. పిడుగులకు ఐదుగురు బలి రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఉరుములు, మెరుపులతో పెద్ద సంఖ్యలో పిడుగులు పడ్డాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో నలుగురు, హన్మకొండ జిల్లాలో ఒకరు పిడుగుపాటుకు బలయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ► ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం బుర్కపల్లి గ్రామానికి చెందిన బనియ గరన్‌సింగ్(45), ఆయన తమ్ముడు సర్దార్‌సింగ్ శనివారం తమ పొలాల్లో సోయా పంటకోత పనులు చేపట్టారు. సాయంత్రం ఒక్కసారిగా వాన మొదలవడంతో సర్దార్‌సింగ్ భార్య ఆశాబాయి (30), గరన్‌సింగ్ ఇద్దరూ సమీపంలోని చింతచెట్టు కిందికి వెళ్లారు. ఒక్కసారిగా పిడుగుపడటంతో చనిపోయారు. ఆశాబాయికి రెండు నెలల కుమారుడు ఉన్నాడు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ► ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని తాంసి మండలం బండల్‌నాగాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు చేనులో పత్తి ఏరేందుకు.. మహారాష్ట్రలోని మహోర్ తాలూకా బావునే గ్రామానికి చెందిన కూలీలు వచ్చారు. వారు చేనులో పనిచేస్తుండగానే సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో పిడుగుపడింది. రాథోడ్ దీప (15) అనే బాలిక అక్కడికక్కడే చనిపోగా.. పక్కనే ఉన్న ఆమె తల్లి బబిత, విజయలక్ష్మి, శోభా పవార్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ► కుమురంభీం జిల్లా జైనూరు మండలం గుడమామడకు చెందిన రైతు మొట్కర్ గణపతి, కుమ్ర కోద్దు పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్నారు. మధ్యాహ్నం భారీ వర్షం మొదలవడంతో పొలంలోని పందిరి కిందికి వెళ్లారు. కాసేపటికే వారిపై పిడుగుపడింది. గణపతి (35) అక్కడికక్కడే చనిపోగా.. కోద్దుకు తీవ్ర గాయాలయ్యాయి. ► హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేటకు చెందిన గోళ్ల తిరుపతి (39) అనే కౌలురైతు శనివారం పొలంలో మిర్చినారు పెడుతుండగా పిడుగుపాటుకు గురయ్యాడు. అక్కడే పనిచేస్తున్న మరో నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను మాజీ మంత్రి ఈటల పరామర్శించారు. ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మూగజీవాలు కూడా.. పిడుగుపాటు కారణంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని మక్తల్ మండలం రుద్రసముద్రంలో 70 గొర్రెలు మృతిచెందాయి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం సాంగ్వి(కె) గ్రామంలో 15 మేకలు, బండల్‌నాగాపూర్‌లో ఆవు, దూడ, పిప్పల్‌కోటిలో ఎద్దు, మంచిర్యాల జిల్లా పొలంపల్లిలో మేకపోతు, రెండు గొర్రెలు చనిపోయాయి. -
జనం ఒక్కసారిగా బైటికి రావటంతో పెరుగుతున్న ట్రాఫిక్
-
పారిస్‌లో 700 కి.మీ. ట్రాఫిక్ జామ్
పారిస్: గత కొంతకాలంగా యూరప్‌లో కోవిడ్ విజృంభిస్తుండడంతో ఫ్రాన్స్‌లో రెండోసారి లాక్డౌన్ ప్రకటించారు. శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో గురువారం నుంచే లక్షలాది మంది జనం సొంతూళ్ళకు పయనమయ్యారు. దీంతో గురువారం రాత్రి నుంచి పారిస్ చుట్టూ 700 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్ ఏడు నెలల కాలంలో రెండోసారి లాక్‌డౌన్‌కి డిక్రీ జారీచేయగా దీన్ని పార్లమెంటు ఆమోదించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతిరోజూ తాజాగా 50,000 కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు ఫ్రాన్స్‌లో 13,31,884 కేసులు నమోదు కాగా, 36,565 మంది మరణించినట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. కోవిడ్ ఆంక్షలు డిసెంబర్ 1 వరకు అమలులో ఉంటాయని ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రకటించారు. రాత్రి 9 గంటల నుంచి, ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అత్యవసరమైతే తప్ప ప్రజలెవ్వరూ ఇళ్ళలో నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం కోరింది. ఫ్రాన్స్‌కి చెందిన 6.7 కోట్ల మంది ప్రజలు పూర్తిగా ఇళ్ళకే పరిమితం కావాలనీ, ఒకరిళ్ళకు ఒకరు వెళ్ళకూడదని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. నిత్యావసర సరుకుల కోసం, మందుల కోసం, వ్యాయామం కోసం ఒక గంట మాత్రమే బయటకు అనుమతిస్తామని ప్రభుత్వం తెలిపింది. దీంతో ఆహారం ఇతర సరుకుల కోసం జనమంతా సూపర్మార్కెట్లకు ఎగబడ్డారు. లక్షలాది మంది సొంతూళ్ళకు పయనమయ్యారు. జనమంతా ఒకేసారి రోడ్లపైకి రావడంతో రోడ్లన్నీ ట్రాఫిక్‌తో కిక్కిరిసిపోయాయి. -
వర్షాల ధాటికి ఢిల్లీ జామ్
-
30 నిమిషాలునరకమే!
పాత పోస్టాఫీసు(విశాఖ దక్షిణ): విశాఖపట్నం–హైదరాబాద్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ సీహార్స్ కూడలి వద్ద నిలిపివేయడంతో ఈ మార్గంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు 30 నిమిషాలు నరకం చూస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.... హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చే గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజు ఉదయం 8.30– 9 గంటల మధ్య విశాఖ చేరుకుంటుంది. తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు హైదరాబాద్ తిరుగు ప్రయాణం చేస్తుంది. ఈ మధ్య కాలంలో దీన్ని శుభ్రం చేసేందుకు లోకోషెడ్‌కు తరలిస్తారు. అయితే ఉదయం 8.30 గంటల సమయంలో విశాఖపట్నానికి వచ్చే రైళ్ల సంఖ్య అధికంగా ఉండడంతో విశాఖకు చేరుకున్న గరీబ్ రథ్‌ను వెంటనే లోకోషెడ్‌కు తరలింపునకు కుదరదు. దీంతో గరీబ్ రథ్‌ను చావులమదుం మీదుగా పోర్టుకు వెళ్లే రైల్వే ట్రాక్‌మీద సీహార్స్ కూడలి వరకూ రైల్వే అధికారులు పంపుతున్నారు. సమస్య మొదలయ్యేది ఇక్కడే.. ఉదయం 9.30 గంటల సమయంలో గరీబ్ రథ్‌ను ప్రతి రోజు పంపుతుండడంతో ఆ ప్రాంతంలోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీహార్స్ కూడలి నుంచి పోర్టుట్రస్ట్, జీఎస్టీ, సెంట్రల్ ఎక్సైజ్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్ఎండీసీ వంటి ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పోర్టు ఆవరణలో ఉన్న పలు ప్రైవేటు కార్యాలయాలకు ఉద్యోగులు వెళ్లాల్సింది ఉంటుంది. హడావుడిగా ఉద్యోగులు సీహార్స్ కూడలి నుంచి పోర్టులోకి వెళ్లే మలుపు తిరగ్గానే ఎదురుగా గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ కనిపించడంతో దాదాపు అరగంట నుంచి నలభై ఐదు నిమిషాల వరకూ మండుటెండలో పడిగాపులు పడాల్సి వస్తోంది. ఆఫీసులకు వెళ్లే సమయంలో అడ్డంగా రైలు ఉండడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బయోమెట్రిక్ భయం.. దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు కార్యాలయాల్లో బయోమెట్రిక్ ప్రవేశపెట్టడంతో ఆలస్యంగా కార్యాలయానికి చేరుకుంటే ముప్పు తప్పదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయాలకు ముందుగా బయలుదేరినా మార్గమధ్యలో గరీబ్‌రథ్ సృష్టిస్తున్న ఆలస్యానికి ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. మరో మార్గంలో ప్రయాణం.. సీహార్స్ కూడలి వద్ద రైలు నిలిచిన సమయంలో కార్యాలయాలకు వెళ్లే వారు తమ కార్యాలయాలను చేరుకోవాలంటే మరో ప్రత్యామ్నాయ మార్గం ఉన్నా సుమారు నాలుగు కిలోమీటర్లు ప్రయాణించాలి. సీహార్స్ కూడలి నుంచి కాన్వెంట్ కూడలికి వచ్చి అక్కడి నుంచి పోర్టు అంతర్గత మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ప్రత్యామ్నాయ మార్గంలో నిరంతరం కంటైన్లరకు మోసుకుంటూ భారీ వాహనాలు నిరంతరం తిరుగుతుంటాయి. ప్రమాదకరమైన ఈ మార్గాన్ని అత్యవసర సమయాల్లో తప్ప వినియోగించేందుకు సాహసించారు. సకాలంలో చేరకుంటే ఇబ్బంది గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌ను సీహార్స్ కూడలి వరకూ తీసుకువచ్చి అక్కడ నిలిపి ఉంచడం వల్ల ఉద్యోగులు నరకం చూస్తున్నారు. సమ యానికి కార్యాలయాలకు వెళ్లకపోతే ఏం జరుగుతుందో అందరికి తెలిసిందే. రైల్వే అధికారులు తక్షణం స్పందించి తగిన చర్యలు తీసుకుని ఈ సమస్యను పరిష్కరించాలి – ఎం.ఎస్.ఎన్.పాత్రుడు, విశ్రాంత పోర్టు ఉద్యోగి -
దేశ రాజధానిలో భారీ వర్షాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని వసంత కుంజ్ వంటి కొన్ని ప్రాంతాల్లో ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ఈరోజు సాయంత్రం నుంచి వాతావరణంలో తేమస్థాయి తగ్గడంతో నగర ప్రజలు ఉపశమనం పొందారు. ఢిల్లీకి దక్షిణ దిక్కు నుంచి వర్షపు మేఘాలు సమీపిస్తున్నాయి. అదే విధంగా గురుగ్రామ్, ఫరిదాబాద్‌లో మోస్తరు వర్షం కురుస్తోందని.. దీంతో పాటు ఢిల్లీ, చండీగఢ్, పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌ల్లో భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతవరణశాఖ ఆదేశాలు జారీచేసింది. -
ఓఆర్ఆర్పై ‘చేంజ్’ ప్లీజ్!
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై ట్రాఫిక్ జామ్‌కు చెక్ పెట్టేందుకు హెచ్ఎండీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా టోలు రుసుము చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండడం వల్లే ట్రాఫిక్ సమస్య ఎదురవుతున్నట్లు గుర్తించారు. ఇందుకు ప్రధానంగా ‘చిల్లర’ సమస్య కూడా కారణమని తేల్చారు. టోల్గేట్ల వద్ద రుసుం చెల్లించే క్రమంలో సరిపడా చిల్లరను వాహనదారు లు ఇవ్వకపోవడంతో లావాదేవీలకు కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటూ ట్రాఫిక్ జామ్‌కు కారణమవుతుందని హెచ్ఎండీఏ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. దీనిపై వాహనదారులను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని ఆయన బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పేర్కొన్నారు. ‘ప్రతి రోజూ సగటున లక్షా ఇరవై నాలుగు వేల వాహనాలు ఓఆర్ఆర్పై ప్రయాణిస్తున్నాయి. ఒక్కో వాహనానికి 5 సెకన్ల సమయం చిల్లర వల్ల అనవసర జాప్యం జరుగుతున్నదనుకున్నా..మొత్తం అన్ని వాహనాలు 173 గంటల సమయం వృథాగా వాహనాలు వేచి ఉంటున్నాయి. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు టోల్ గేట్ల వద్ద సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని కమిషనర్ ఓఆర్‌ఆర్‌అధికారులనుఆదేశించారు. ఓఆర్ఆర్పై పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు ఆర్ఎఫ్ఐడీ, స్మార్ట్ కార్డుల ద్వారా టోలు వసూలు అమలు నిర్ణీత గడువుపై కూడా సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ...దీపావళికి ఆర్ఎఫ్ఐడీ ద్వారా టోలు వసూలు వ్యవస్థను పటిష్టంగా అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ లోగానే అన్ని సాంకేతిక ఇబ్బందులను అధిగమించడానికి ప్రయోగాత్మకంగా వసూలు చేసుకుని దీపావళి నాటికి ఆర్ఎఫ్ఐడీ పద్ధతిని ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావాలని ఆదేశించారు. క్లోజ్డ్ టోలింగ్‌పై దృష్టి... ఓఆర్ఆర్పై 2010లోనే ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఈటీసీ) పద్ధతిన వాహనదారుల నుంచి టోలుసుంకం వసూలు చేయాలని నిర్ణయించినా వివిధ కారణాల వల్ల అమలులో తీవ్ర జాప్యం జరిగింది. ఆ తర్వాత డెడికేటెడ్ షార్ట్ రేంజ్ కమ్యూనికేషన్ పద్ధతిన టోలు వసూలు చేయాలని నిర్ణయించినా జాతీయ రహదారులు, ఇతర రాష్ట్ర రహదారులపై అమలవుతున్న ఆర్ఎఫ్ఐడీ విధానంవైపే మొగ్గారు. ఇప్పటికే ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్లో భాగంగా స్మార్ట్ కార్డుల ద్వారా టోలు వసూలు కోసం జైకా ద్వారా రూ.70 కోట్ల నిధులు హెచ్ఎండీఏ రుణంగా తీసుకుంది. అయితే 181 లైన్లున్న ఓఆర్ఆర్పై ఎంట్రీ వైపు 82 లైన్లు, ఎగ్జిట్ 99 లైన్లు ఉన్నాయి. ఇందులో 112 లైన్లలో నగదు, స్మార్ట్ కార్డ్ ద్వారా (మాన్యువల్) టోలు వసూళ్లు చేయనున్నారు. 51 లైన్లలో నగదు, స్మార్ట్ కార్డులు మరియు ఆర్ఎఫ్ఐడీ పద్ధతుల్లో వసూలు చేస్తారు. అందులో 18 లేన్లు కేవలం ఆర్ఎఫ్ఐడీ ద్వారానే టోల్ వసూలు చేయాలని ఓఆర్ఆర్ అధికారులు నిర్ణయించారు. ఇటీవల బదిలీపై వచ్చిన కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి వారంలో ఓ రోజు ఓఆర్ఆర్ ట్రాఫిక్ రద్దీ తగ్గింపుపైపే సమీక్షలు నిర్వహిస్తూ సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ఓఆర్ఆర్ అధికారులు ఓపెన్ టోలింగ్ పద్దతిలో వాహనదారుల నుంచి నిర్ధారిత టోలు సుంకం వసూలు చేస్తున్నారు. కొత్తగా అమలు చేయాలనుకుంటున్న క్లోజ్డ్ టోలింగ్ పద్ధతిలో వాహనదారులు, వారు ఉపయోగించే వాహన శ్రేణి ప్రకారం ఎగ్జిట్ పద్ద వారు ప్రయాణం చేసిన దూరానికి మాత్రమే టోలు వసూలు చేస్తారు. వాహనదారులు సహకరించాలి ప్రతి వాహనదారుడు టోలు సుంకానికి సరిపడా చిల్లరను తీసుకురావాలి. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. టోలుగేట్ల వద్ద రద్దీ కూడా తగ్గుతుంది. ఈ మధ్య కాలంలో టోల్ గేట్ల వద్ద 150 మీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయిన సందర్భాలు ఉన్నాయి. వాహనదారులు అవసరమైన చిల్లరను తీసుకువస్తే టోలు చెల్లింపు, వసూలులో జరుగుతున్న జాప్యాన్ని తగ్గించవచ్చు. అలాగే త్వరలో తీసుకురానున్న ఆర్ఎఫ్ఐడీ, ఈటీసీ, క్యూఆర్ కోడ్ పద్ధతులను కూడా అందరూ వినియోగించుకోవాలి.– కమిషనర్, డా.బి.జనార్దన్‌రెడ్డి -
జంక్షన్లో జంప్!
సాక్షి, సిటీబ్యూరో: ఆటోలు యమవేగంతో నడుపుతూ.. ట్రాఫిక్ జంక్షన్లలో సిగ్నల్స్ జంప్ చేస్తూ.. ఇతర వాహనదారుల ప్రాణాలకు ముప్పువాటిల్లేలా వ్యవహరిస్తున్న ఆటోవాలాలపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. ప్రధానమైన రోడ్లు, జంక్షన్లలో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తున్నారని, డ్రైవింగ్‌తో భయపెడుతన్నారంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు భారీగా వస్తుండటంతో వివిధ ప్రాంతాల్లో ‘ఆటోల స్పెషల్ డ్రైవ్’ నిర్వహిస్తున్నారు. ఒక్క జూలై నెలలోనే ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన ఆటోవాలాలపై మాదాపూర్‌లో 1018, గచ్చిబౌలిలో 757, కూకట్‌పల్లిలో 637, మియాపూర్‌లో 497, బాలానగర్‌లో 444 కేసులు నమోదు చేశారు. ఎక్కువగా ప్రమాదకరంగా వాహనాలను నడపడం, ఆటోల్లో ఓవర్ లోడ్‌ను తరలించడం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, పైలటింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ తదితర కేసులు నమోదు చేశారు. వారికి జరిమానా విధించడంతో రోడ్డుపై ఆటోలు నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రాఫిక్ నిబంధనలపై వివరిస్తున్నారు. ఆ నాలుగు రూట్లలో స్పెషల్ డ్రైవ్.. ట్రాఫిక్ నిబంధనలు బేఖాతరు చేస్తున్న ఆటోడ్రైవర్లపై కొరడా ఝళిపించేందుకు బీహెచ్ఈఎల్– ఆల్విన్ జంక్షన్, కూకట్పల్లి, ఆల్విన్ జంక్షన్ –కొత్తగూడ– బొటానికల్– గచ్చిబౌలి, జేఎన్టీయూ– సైబర్ టవర్స్ – రహేజా మైండ్ స్పేస్– బయో డైవర్సిటీ జంక్షన్లతో పాటు బాలానగర్‌లో ఆటోలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాంతాల నుంచే ఎక్కువగా ఫిర్యాదులు వస్తుండటంతో జూలై నెలలో డ్రైవ్ నిర్వహించి 3,353 మంది ఆటోవాలాలపై కేసులు నమోదు చేశామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు తెలిసినా తొందరగా వెళ్లాలన్న ఆతృతను ప్రదర్శిస్తున్నారని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై 8500411111 ఫోన్ లేదా వాట్సప్ చేయాలని సూచించారు. -
గుడ్డిగా యాప్స్ వాడితే అంతే సంగతి..!
వాషింగ్టన్: ప్రస్తుతం ఎక్కువగా టెక్నాలజీ మీదే ఆధారపడి పనులు లాగించేస్తున్నారు. అయితే కొన్నిసార్లు అది మన ప్రాణాల మీదకి తెస్తుందనడానికి అమెరికాలో ఇటీవల ఓ ప్రమాదం ఘటన నిదర్శనమని చెప్పవచ్చు. అసలేమైందంటే.. ఓ వ్యక్తి వద్ద ఇద్దరు మిత్రులు కారు అద్దెకు తీసుకున్నారు. ఈశాన్యరాష్ట్రం వెర్మాంట్ లోని బర్లింగ్టన్ నగరంలో ఎస్యూవీ కారును ఈ వ్యక్తుల డ్రైవర్ నడుపుతున్నాడు. ఆ డ్రైవర్ ట్రాఫిక్ తగ్గుతుందని భావించి తరచుగా జీపీఎస్ మ్యాప్ ఫాలో అయ్యేవాడు. అందులో భాగంగానే తన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్న వేజ్ యాప్ (Waze app)ను వాడాడు. ఈ క్రమంలో ఓ ప్రదేశానికి రాగానే ట్రాఫిక్ ఎక్కువగా ఉందని, రద్దీ తక్కువగా ఉండే రూట్ కోసం వేజ్ యాప్‌లో జీపీఎస్ మ్యాప్‌ను ఫాలో అవుతూ కాస్త ముందుకు నడపగానే మంచుతో గడ్డకట్టి ఉన్న చిన్న సరసులోకి కారు రయ్‌మంటూ దూసుకెళ్లింది. భయబ్రాంతులకు లోనవడం కారులోని వారి వంతయింది. మంచుగడ్డలు చూపిన నరకం కన్నా యాప్ చూపిన నరకమే ఆ ముగ్గురు బాధితుల్ని తెగ ఇబ్బంది పెట్టిందని పోలీసులు తెలిపారు. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదని, స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు ప్రమాదం విషయం తెలియగానే యజమాని టారా గుర్టిన్ షాకయ్యారు. కారులోని వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారని తెలియగానే ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం ఎస్యూవీ జీపును నీటి మడుగు నుంచి బయటకు తీసినట్లు చెప్పారు. గూగుల్ అధికార ప్రతినిధి జూలీ మోస్లర్ ఈ ఘటనపై స్పందిస్తూ.. వేజ్ యాప్‌లో ఇప్పటికే కొన్ని లక్షలసార్లు మార్పులు చేశాం. నిత్యం రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందనేది రోజూ అప్డేట్ చేస్తుంటాం. డ్రైవర్లు యాప్‌తో పాటు రోడ్డుపై ఓ కన్నేసి ఉంచి వాహనాలు నడిపితే కొన్ని ప్రమాదాలను అరికట్టవచ్చునని అభిప్రాయపడ్డారు. -
అక్కడ కార్లపై నిషేధం
సింగపూర్ : రహదారులపై భరీదైన బైక్‌లు, కార్లలో జామ్..జామ్ అంటూ దూసుకుపోవడం చాలామందికి సరదా. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో ఇటువంటి సన్నివేశాలే కనిపిస్తాయి. కార్లు.. బైక్‌లో నిత్యావసరాల జాబితాలో చేరిపోవడంతో సగటున ప్రతి ఇంటికి కారో.. బైక్‌లో ఉంటోంది. దీంతో రోడ్లపై విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మనదేశంలోనూ.. ప్రధానంగా ఢిల్లీ-గుర్గావ్ హైవే మీద ట్రాఫిక్ సమస్యలను మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. ఆధునిక రవాణా వ్యవస్థకు కేంద్రగా నిలిచిన సింగపూర్‌లోనూ ట్రాఫిక్ జామ్‌లు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం వినూత్న నిర్ణయాన్ని తీసుకుంది. ఆసియాలో అభివృద్ధి చెందిన దేశాల్లో సింగపూర్ ఒకటి. ఇక్కడ వ్యక్తిగత వాహనాలు సంఖ్య అధికం కావడంతో రహదారులపై ట్రాఫిక్ సమస్యలు అధికంగా ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి సింగపూర్‌లో వ్యక్తిగత వాహనాలను అంచెలంచెలుగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ప్రజా రవాణ వ్యవస్థకు ఊపు తీసుకురావడంతో పాటు.. వ్యక్తిగత వాహనాలు ఉపయోగించాలనుకునే వారు.. భారీగా ప్రభుత్వానికి పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది 0.25 శాతం వాహనాలను తగ్గిస్తూ.. చివరకు వ్యక్తిగత వాహనాలు లేకుండా చేయాలన్నది తమ ఆలోచనగా సింగపూర్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ ఆథారిటీ (ఎల్‌టీఏ) పేర్కొంది. కొత్త చట్టం ప్రకారం సింగపూర్‌లో వ్యక్తిగత వాహనాన్ని కొనుగోలు చేయడం అనేది అత్యంత ఖరీదైన వ్యవహరం. కారును కొనడంతో పాటు.. దానిని పదేళ్ల పాటు వినియోగించుకునేందుకు వీలుగా ప్రభుత్వానికి ‘సర్టిఫికెట్ ఆఫ్ ఎన్టైటిల్మెంట్‘ కింద 2లక్షల 50 వేల రూపాయాలు చెల్లించాలి. అంతేకాక ప్రభుత్వం విధించిన వివిధరకాల పన్నులతో కార్ల ధరలు ఆకాశానికి చేరుకున్నాయి, టయోటా కరోలా ఆల్టీస్, అయిదు డోర్ల సెడాన్ కారు ఖరీదు.. రూ. 52 లక్షలకు చేరింది. సింగపూర్‌లోని భూభాగంలో ఇప్పటికే 12 శాతాన్ని రహదారుల నిర్మాణం కోసం వినియోగించినట్లు ఎల్‌టీఏ అధికారులు తెలిపారు. -
హైదరాబాద్ అలర్ట్ : జామ్.. జామ్.. జామ్..!!
సాక్షి, హైదరాబాద్ : సోమవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ నగరవాసులు నరకం చవిచూశారు. రహదారులన్నీ ట్రాఫిక్ జామ్ లతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపై ఎక్కడికక్కడ నీరు చేరిపోవడంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయ్యింది. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ.. సహాయ కార్యక్రమాలు మొదలుపెట్టిన కొద్దిసేపటికే వాతావరణ శాఖ నుంచి మరో హెచ్చరిక జారీ అయింది. రానున్న మరికొద్ది గంటలూ ప్రజలు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని సూచించింది. మియాపూర్, కూకట్ పల్లి, దిల్ సుఖ్ నగర్, హయత్ నగర్, నాగోల్, మలక్ పేట్ లతో పాటు నగరంలోని ప్రధాన రహదారులన్నీ ట్రాఫిక్ జామ్ తో నిండిపోయాయి. రహదారులపై చేరిన నీటిని తొలగించడానికి కనీసంగా మరో మూడు గంటల సమయం పట్టే అవకాశాలున్నందున అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. భారీ నీటి వరద వస్తున్న కారణంగా మొజాంజాహీ నుంచి బేగంబజార్ వైపునకు వచ్చే వాహనాలను పూర్తిగా మళ్లించాలని అధికారులను ఆదేశించారు. ఆస్మాన్ గఢ్, చార్మినార్, బేగంబజార్, అత్తాపూర్, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా విద్యుత్ స్తంభాలపై చెట్లు కూలాయి. రహదారులపై పడిన విద్యుత్ వైర్లను తాకరాదని సీఎండీ రఘుమారెడ్డి హెచ్చరించారు. విద్యుత్ డిసాస్టర్ మేనేజ్ మెంట్ బృందాలు రంగంలోకి దిగాయని, తెగిపడిన విద్యుత్ వైర్లను తొలగించే పనిలో నిమగ్నమయ్యారని ఆయన తెలిపారు.విద్యుత్ ఫిర్యాదుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ⇒ విద్యుత్ వైర్లు తెగిపడిన కారణంగా సైఫాబాద్, బేగంబజార్, ఆస్మాన్ గఢ్, సైనిక్ పురి, సరూర్ నగర్, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పాతబస్తీలోని చందూలాల్బరదారిలోని హెచ్ఎండబ్ల్యూఎస్ కార్యాలయం గోడ కూలి పక్కన ఉన్న రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బంజారాహిల్స్ లోని నాయుడు నగర్ లో మట్టిపెల్లలు కూలగా, ఆ మట్టిలో ఇద్దరు వ్యక్తులు కూరుకుపోయినట్టు సమాచారం. ఈ ఘటనలో తండ్రి, కొడుకులిద్దరూ మృతిచెందినట్టు చెబుతున్నారు. రాత్రి తొమ్మిది గంటల సమయానికి ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ⇒ నాగారం గ్రామంలో, సమీపంలోని ఎగువ ప్రాంతంలో భారీ వరద నీరు అన్నరాయుని చెరువుకు చేరుతోంది. ఆ కారణంగా సమీపంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ⇒ లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తూ మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి తెలిపారు. ⇒ లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు ఈ రాత్రి అందించడానికి తక్షణం వెయ్యి ప్యాకెట్ల మేరకు ఆహార పదార్థాల పంపిణీ ప్రారంభించినట్టు చెప్పారు. రేపు ఉదయం మరో 5 వేల ఆహార ప్యాకెట్లను సిద్ధం చేసి పంపిణీ చేపట్టనున్నట్టు తెలిపారు. ఇప్పటివరకూ నమోదైన వర్షపాతం వివరాలు.. సోమవారం సాయంత్రం నుంచి మొదలై రాత్రి వరకు హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. సాయంత్రం భారీగా కురిసి రాత్రి 8 గంటల ప్రాంతంలో తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. అత్యధికంగా బహదూర్ పుర ప్రాంతంలో 12.6 సెం.మీ., వర్షం కురిసింది. రాజేంద్రనగర్ లో 11.2 సెం.మీ., అంబర్ పేటలో 11.5 సెం.మీ., గోల్కొండ ప్రాంతంలో 9.5 సెం.మీ., సికింద్రాబ్ద్ మోండా మార్కెట్ ప్రాంతంలో 9.5 సెం.మీ., నారాయణగూడ ప్రాంతంలో 8.8 సె.మీ., ముషీరాబాద్ లో 8.7 సెం. మీ., మల్కాజిగిరి కాప్రాలో 8.7 సె.మీ., సరూర్ నగర్ ప్రాంతంలోని డీఎంఆర్ఎల్ సమీపంలో 8.6 సె.మీ., సైదాబాద్ లోని ఆస్మాన్ గఢ్ ప్రాంతంలో 8.6 సెం.మీ. మేరకు వర్షపాతం నమోదైంది. ఇక మిగతా అన్ని ప్రాంతాల్లో మూడు నుంచి అయిదు సెంటీమీటర్ల మేరకు వర్షపాతం నమోదైంది. ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు : పలు రైళ్ల వేళల్లో మార్పులు భారీ వర్షాల కారణంగా సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది గంటల మధ్య కాలంలో ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను నిలిపివేశారు. సికింద్రాబాద్, నాగులపల్లి, మౌలాలి, గట్కేసర్ మార్గంలో నాలుగు సర్వీసులను నిలిపివేసినట్టు అధికారులు వెల్లడించారు. నాలుగు సర్వీసులను నిలిపివేయడంతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లాల్సిన చార్మినార్ ఎక్స్ ప్రెస్ సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, సాయంత్రం 7.30 గంటలకు బయలుదేరి వెళ్లింది. భారీ వర్షాల కారణంగా ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ ను మౌలాలి వద్ద, తెలంగాణ ఎక్స్ ప్రెస్ ను చెర్లపల్లి వద్ద, తాండూరు-హైదరాబాద్ ప్యాసింజర్ ఎక్స్ ప్రెస్ ను శంకర్ పల్లి వద్ద, వరంగల్-హైదరాబాద్ ప్యాసింజర్ ఎక్స్ ప్రెస్ ను హుస్సేన్ సాగర్ వద్ద కొద్దిసేపు నిలుపుదల చేశారు. రాత్రి వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత ఒక్కో రైలు కదిలింది. ప్రస్తుతం మిగతా అన్ని రైళ్లు షెడ్యూలు ప్రకారం నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. హైదరాబాద్‌లో వాన బీభత్సం ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
వామ్మో! ఇలా కూడా ఆఫీస్‌కు వెళుతారా?
ఆఫీస్‌కు రావడం, మళ్లీ ఇంటికి వెళ్లడం.. మధ్యలో ఆఫీస్‌లో పనిచేయడం.. ఇవి చాలు ఒక సగటు ఉద్యోగి అలిసిపోవడానికి.. దీనికితోడు నగరాల్లో నరకం చూపించే ట్రాఫిక్ గురించి చెప్పకపోవడమే మేలు.. ఆఫీస్‌లో చేసిన వర్క్ కంటే.. ఆఫీస్‌కు రావడానికి, మళ్లీ ఇంటికి వెళ్లడానికి ట్రాఫిక్‌లో ఎదుర్కొనే చిక్కులే ఎక్కువ. దారి పొడగుతా పాములా మెలికలు తిరిగి.. నత్తలా నిదానంగా ముందుకుసాగే ట్రాఫికే చాలామందికి చెప్పలేనంత విసుగు తెప్పిస్తుంది. ఈ ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి చాలామంది చాలా ప్రయత్నాలే చేస్తుంటారు. కొందరు వినూత్నంగా ట్రాఫిక్ సమస్య తమ దారికి అడ్డురాకుండా కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తారు. ఇదేవిధంగా ఆలోచించి ఓ చెక్ రిపబ్లిక్ వ్యక్తి ఏకంగా చిన్న హెలికాప్టర్ రూపొందించుకొని.. ఆఫీస్ వెళుతుండగా.. జర్మన్లో ఓ వ్యక్తి మరింత వినూత్నంగా ఆఫీస్ బాటపట్టాడు. మ్యూనిచ్‌లో ఉండే బెంజమిన్ డేవిడ్ ట్రాఫిక్ బెదడతో విసిగిపోయాడు. నిత్యం చుక్కలు చూపించే ట్రాఫిక్ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనుకున్నాడు. రోడ్డుమార్గంలో వెళితే.. ట్రాఫిక్ ఎదురవుతుంది. అదే నీటిమార్గంలో వెళ్లితే.. వాహనాలు ఉండవు. సిగ్నళ్లు ఉండవు. ట్రాఫిక్ బెడద ఉండదు. అందుకే నగరంలోని ఇసార్ నదిని ఎంచుకున్నాడు. ప్రస్తుతం ఆ నది మార్గంలో రవాణసౌలభ్యం లేదు. అయినా, బెంజిమిన్ వెనుకకు తగ్గలేదు. రోజూ 1.6 కిలోమీటర్లు (ఒక మైలు) ఎంచక్కా ఈదుకుంటూ వెళుతున్నాడు. ఇంటి నుంచి నేరుగా బెంజమిన్ నదికి వస్తాడు. అక్కడ తన దుస్తులు, బూట్లు, మొబైల్‌ఫోన్, ల్యాప్‌టాప్ వాటర్ ప్రూఫ్ బ్యాగులో పెట్టి.. ఎంచక్కా నదిలో దూకేసి ఈదుకుంటూ ఆఫీస్‌కు వెళుతాడు. ఇలా రోజు ఆఫీస్‌కు వెళ్లడం, ఇంటికి రావడం ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా ఉందని బెంజమిన్ చెప్తున్నాడు. గత రెండేళ్ల నుంచి అతను ఆఫీస్‌కు ఇలాగే వెళుతున్నాడు. -
ఇంకా కోలుకోని హైదరాబాద్ నగరం...
హైదరాబాద్: బుధవారం కురిసిన భారీ వర్షంతో అస్తవ్యస్థమైన హైదరాబాద్ నగరం ఇంకా కోలుకోలేదు. నగరంలోని పలు కాలనీలు, ప్రభుత్వ కార్యాలయాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ప్రధాన రహదారుల వెంట, నాలాల వద్ద చెత్తాచెదారం పేరుకుపోవడంతో రోడ్లపైకి నీరు చేరుకుంది. దీంతో ట్రాఫిక్‌కు ఆటంకం ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగర మేయర్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది నాలాలను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. పారిశుద్ధ్య లోపంతో వ్యాధులు ప్రబలే అవకాశముందని.. ప్రజలు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పాదచారులు, వాహనదారులు మ్యాన్ హోల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. మరో వైపు గురువారం కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. శిధిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించే పనిలో గ్రేటర్ అధికారులున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. హుస్సేన్‌సాగర్ వద్ద గురువారం వరద ఉధృతి తగ్గింది. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 513.62 అడుగులుగా ఉంది. -
వాన ధాటికి లింగంపల్లి బస్సులో..!
చాలారోజులకు వరుణుడు నగరంపై కరుణ చూపాడు. నిన్నమొన్నటివరకు ఎండలతో, ఉక్కపోతతో అల్లాడిన నగరవాసులకు వర్షాకాలం ఎలా ఉంటుందో ఒక్కసారిగా మీదపడి రుచి చూపించాడు. ఇటీవలికాలంలో ఎన్నడూలేని రీతిలో భారీ కుంభవృష్టి మన విశ్వనగరాన్ని ముంచెత్తింది. ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది. రోడ్లు, వీధులు నదులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు మునకేశాయి. బడుగుల ఇళ్లు కూలాయి. సామాన్యుల కష్టాలు రెట్టింపయ్యాయి. పిల్లల పాఠశాలకు సెలవులొచ్చాయి. ఎనిమిది మంది అభాగ్యులు ప్రాణాలు విడిచారు. వాన కొంత తెరిపి ఇవ్వడంతో నగరంలో పరిస్థితి ఇప్పుడు కొంత కుదుటపడింది. కానీ, వాహనదారులకు, బస్సు ప్రయాణికులకు వాన చుక్కలు చూపింది. ఆర్టీసీ బస్సులు చాలావరకు పాతవి కావడంతో కొన్ని మొరాయించగా.. మరికొన్ని బస్సుల్లో ప్రయాణికులు ఇంకోరకం కష్టాలు ఎదురయ్యాయి. బస్సులకు అన్ని చిల్లులు ఉండటంతో బస్సు ఎక్కినా గొడుగు పట్టుకొని కూర్చొక తప్పని పరిస్థితి నెలకొంది. లింగంపల్లి నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్లే (218 నంబర్) బస్సులో ప్రయాణించినవారికి చిత్రమైన అనుభవం ఎదురైంది. భారీ వర్షంలో ప్రయాణిస్తున్న వారిని వరుణుడి బస్సు కాపాడలేకపోయింది. వర్షం ధాటికి బస్సు మొత్తం కురుస్తుండటంతో వారు బస్సులోపలే గొడుగులు వేసుకొని కూర్చోవాల్సిన పరిస్థితి. 'ప్యార్ హువా.. ఏక్ రార్ హువా..' 'చిటచిట చినకులు పడుతూ ఉంటే' అన్న పాటలు వారికి గుర్తొచ్చాయో లేదో కానీ, బస్సులో గొడుగు జర్నీతో వారు బతుకు బండిని లాగించారు. -
హైదరాబాద్ అతలాకుతలం
ఇటీవలి కాలంలో ఎప్పుడూ కనీ వినీ ఎరుగని రీతిలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరం అస్తవ్యస్తం అయింది. జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. భోలక్‌పూర్, రామంతపూర్ ప్రాంతాల్లో గోడలు కూలి ఏడుగురు మరణించారు. హుస్సేన్‌సాగర్ నీటిమట్టం నాలుగు అడుగులకు పైగా పెరగడంతో అది ప్రమాదకరస్థాయిలో ఉందని.. తూములు తెరిచి నీటిని కిందకు వదిలారు. గత పదిహేనేళ్లలో ఎన్నడూ చూడనంతగా రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సైతం చెప్పారు. ఉదయం 6 గంటల ప్రాంతం నుంచే చిరుజల్లులుగా మొదలైన వర్షం.. 7 గంటలకల్లా తీవ్రరూపం దాల్చింది. అక్కడి నుంచి దాదాపు మధ్యాహ్నం వరకు కూడా పలు ప్రాంతాల్లో కురుస్తూనే ఉంది. సాధారణంగా హైదరాబాద్‌లో ఒక ప్రాంతంలో వాన పడితే మరో ప్రాంతంలో ఎండ కాస్తుందంటారు. కానీ ఈసారి మాత్రం అక్కడ, ఇక్కడ అని లేకుండా నగరం నలుమూలలా భారీగా వర్షాలు కురిశాయి. కడపటి సమాచారం అందేసరికి అంబర్‌పేట ప్రాంతంలో అత్యధికంగా 9.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. (నగరంలోని వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం వివరాలు) అన్నిచోట్లా ట్రాఫిక్ జామ్ హయత్‌నగర్ వైపు నుంచి గానీ, కూకట్పల్లి వైపు నుంచి గానీ, సికింద్రాబాద్ వైపు నుంచి గానీ నగరంలోకి రావడానికి ఏమాత్రం వీలులేకుండా అన్నిచోట్లా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. నీళ్లు మోకాలిలోతులో నిలిచిపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. కూకట్పల్లి నుంచి పంజాగుట్ట చౌరస్తా చేరుకోడానికి ఉదయం సమయంలో దాదాపు రెండు గంటలకు పైగా పట్టింది. ఇక దిల్సుఖ్నగర్ వైపు నుంచి మియాపూర్ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు చుక్కలు చూశారు. చాలాచోట్ల కార్లు దాదాపు మూడు వంతులు మునిగిపోయాయి. తాను కారు తీసుకున్న తర్వాత ఐదేళ్లలో తొలిసారి ఇలా జరిగిందని, బెల్టు శబ్దం సైతం చాలా తేడాగా వచ్చిందని నిజాంపేట ప్రాంతానికి చెందిన రాము 'సాక్షి'కి తెలిపారు. మలక్‌పేట బ్రిడ్జి కింద మూడు బస్సులు ఇరుక్కుపోయాయి. నగరంలోని చింతల్‌బస్తీ ప్రాంతంలో ఒక కారు కొట్టుకుపోతుండగా స్థానికులు తాళ్ల సాయంతో దాన్ని, అందులోని డ్రైవర్‌ను కూడా కాపాడారు. సైఫాబాద్, మలక్‌పేట, అఫ్జల్‌గంజ్, నాగార్జున సర్కిల్, పంజాగుట్ట, బేగంపేట, ప్యారడైజ్ తదితర ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి. ఉద్యోగుల పరిస్థితి దారుణం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు వెళ్లాల్సిన ఉద్యోగులు దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఉదయం 8 గంటలకు బయల్దేరి 9.30కల్లా వస్తామనుకుంటే.. 11.45కు గానీ ఆఫీసుకు చేరుకోలేకపోయామని కొందరు అన్నారు. మరికొందరు ఉదయం 10 గంటలకల్లా ఆఫీసులకు రావాల్సి ఉంటే.. సగం రోజు సెలవు పెట్టి, మధ్యాహ్నానికి చేరుకుంటామని చెప్పారు. ఇక భారీ వర్షం కారణంగా కార్యాలయాలకు ఒక గంట ఆలస్యంగా వచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎంఎంటీఎస్ రైళ్లు హైదరాబాద్‌లోని పలు మార్గాలలో తిరగాల్సిన ఎంఎంటీఎస్ రైళ్లను సైతం వర్షాల కారణంగా రద్దు చేశారు. బాగా రద్దీగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం ప్రత్యేకంగా నాలుగు రైళ్లను నడిపిస్తున్నారు. లింగంపల్లి రైల్వే బ్రిడ్జి కింద ప్రాంతంలో కూడా వాహనాలు నిలిచిపోయాయి. పాఠశాలలు, కళాశాలలకు సెలవు విద్యార్థులు ఉదయం అష్టకష్టాలు పడి పాఠశాలలు, కళాశాలలకు వెళ్తే.. వర్షం కారణంగా సెలవు ప్రకటించినట్లు యాజమాన్యాలు చెప్పాయి. వర్షాల నేపథ్యంలో రోడ్ల మీద మ్యాన్‌హోల్స్ పరిస్థితి ప్రమాదకరంగా ఉండటం, విద్యార్థులు తడిసి అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉండటంతో ముందుజాగ్రత్త చర్యగా సెలవులు ఇచ్చేశారు. శిథిల భవనాలు ఖాళీ చేయాలి: మేయర్ హైదరాబాద్‌లో చాలా ప్రాంతాల్లో కొన్ని భవనాలు శిథిలస్థితికి చేరుకున్నాయని, ప్రజల ప్రాణాలకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా వాటిని వెంటనే ఖాళీ చేయాలని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. శిథిలభవనాలను కూల్చేయాలని తాము ప్రయత్నిస్తున్నా, వాళ్లు మాత్రం కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నారని, ఇప్పుడు మరో మూడు రోజుల పాటు వర్షాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న దృష్ట్యా పెను ప్రమాదం ఉందని ఆయన అన్నారు. అందువల్ల ఇప్పటికైనా అలాంటి భవనాల్లో ఉన్నవాళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపారు. జీహెచ్ఎంసీకి చెందిన దాదాపు వంద వరకు సహాయ బృందాలు నిరంతరం పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. ముమ్మరంగా సహాయచర్యలు: కమిషనర్ సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని జీహచ్ఎంసీ కమిషనర్ జనార్దనరెడ్డి తెలిపారు. వర్షాల పరిస్థితిపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జనార్దనరెడ్డి మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పాత భవనాల్లో ఎవరూ ఉండొద్దని కోరారు. గోడలు కూలి మరణించిన వారి కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. రోడ్లపై నిలిచిన నీటిని పంపింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. -
శిథిల భవనాలు ఖాళీ చేయాలి
-
ఇంటికి వెళ్లడానికి 12 గంటలు పట్టింది
గుర్గావ్: దేశ రాజధాని ఢిల్లీ చుట్టుపక్కల రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాహనదారులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ-గుర్గావ్ ఎక్స్‌ప్రెస్ వేపై కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికే గంటలకొద్దీ సమయం పడుతోంది. గురువారం ఆఫీస్ నుంచి బయలుదేరితే ట్రాఫిక్ జామ్ కారణంగా 12 గంటల తర్వాత ఈ రోజు ఉదయం ఇంటికి చేరుకున్నానని ఓ ఉద్యోగి చెప్పారు. రెండు రోజులు పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని గుర్గావ్ పోలీసులు యాజమాన్యాలను కోరారు. అలాగే పరిస్థితి కుదుటపడే వరకు కార్పొరేట్ హబ్ అయిన గుర్గావ్కు రాకుండా ఉండాలని ఢిల్లీ ఉద్యోగులకు సూచించారు. ఢిల్లీ-గుర్గావ్ హైవేపై కిలోమీటర్ల మేర వాహానాలు నిలిచిపోయాయి. కార్లు, ఇతర వాహనదారులు గంటలకొద్దీ ఫస్ట్ గేర్‌లోనే వెళ్లాల్సిరావడంతో ఆయిల్ అయిపోయి కొన్ని వాహనాలు ఆగిపోయాయి. రోడ్లను క్లియర్ చేసేందుకు అధికారులతో కూడిన బృందాన్ని పంపాల్సిందిగా కేంద్ర రవాణ శాఖమంత్రి నితిన్ గడ్కరీ నేషనల్ హైవే చీఫ్‌ను ఆదేశించారు. గుర్గావ్ పోలీస్ చీఫ్ నవదీప్ విర్క్ బైక్‌పై వెళ్లి ట్రాఫిక్ జామ్ అయిన ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షించారు. ఢిల్లీ నుంచి గుర్గావ్ వెళ్లడం కంటే న్యూయార్క్‌కు తొందరగా చేరుకోవచ్చని కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సూర్జేవాలా ట్వీట్ చేశారు. -
'మండే టెస్ట్' పాస్.. ఢిల్లీవాలా రిలీఫ్!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యానికి చెక్ పెట్టేందుకు కేజ్రీవాల్ సర్కార్ అమల్లోకి తెచ్చిన 'సరి-బేసి' అంకెల విధానం 'మండే టెస్ట్'లో దాదాపు పాస్ అయినట్టు కనిపిస్తోంది. 'సరి-బేసి' వాహన నెంబర్ ప్లేట్ల విధానం జనవరి 1 తేదీన అమల్లోకి వచ్చినప్పటికీ, ఈ మూడురోజులు వారాంతపు సెలవులు కావడంతో దీని ప్రభావం ప్రధానంగా సోమవారం తెలుస్తోందని సర్వత్రా భావించారు. అంతా అనుకున్నట్టే సోమవారం 'సరిసంఖ్య' నెంబర్ కలిగిన వాహనాలు మాత్రమే రోడ్లు ఎక్కాయి. సరిసంఖ్య వాహనం లేనివాళ్లు ప్రజారవాణా వ్యవస్థపై ఆధారపడ్డారు. దీంతో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు కిక్కిరిసిపోయి కనిపించాయి. కొన్నిచోట్ల ఈ విధానాన్ని ఉల్లంఘిస్తూ 'బేసి' సంఖ్య కలిగిన వాహనాలు రోడ్లు ఎక్కడంతో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు దాదాపు 200 మందికి జరిమానా విధించారు. ఈ విధానం అమలు విషయంలో ప్రముఖులకు కూడా ఎలాంటి మినహాయింపు ఉండదని ఢిల్లీ పోలీసు స్పెషల్ కమిషనర్ ముక్తేశ్ చందర్ తెలిపారు. ఈ విధానాన్ని ఉల్లంఘించిన ఓ వీఐపీకి ఆయన స్వయంగా చలాన్ విధించారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ ట్రాఫిక్ విధానానికి అనుగుణంగా తన కారును పక్కనబెట్టారు. రవాణాశాఖ మంత్రి గోపాల్ రాయ్ టాటా నానో కారులో ఆయనతోపాటు కలిసి కేజ్రీవాల్ సెక్రటేరియట్ కు పయనమయ్యారు. ట్రాఫిక్ చిక్కులు తప్పడంతో రిలీఫ్ ఢిల్లీ రోడ్ల మీద సాధారణంగా భారీ ట్రాఫిక్ ఉంటుంది. అందుకు భిన్నంగా సోమవారం దర్శనమిచ్చింది. సహజంగా ట్రాఫిక్ ఉండే జంక్షన్లు కూడా 'సరి-బేసి' విధానం కారణంగా సాధారణంగా కనిపించాయి. నూతన విధానం వల్ల భారీ సంఖ్యలో కార్లు రోడెక్కకపోవడంతో హస్తినలో పెద్దగా ట్రాఫిక్ సమస్యలు ఎదురుకాలేదంటూ ఢిల్లీ వాసులు ట్విట్టర్ లో ఆనందం వ్యక్తం చేశారు. 'సరి-బేసి' నెంబర్ ప్లేట్ల ఆధారంగా దినం తప్పించి దినం కార్లను రోడ్లకు మీదకు అనుమతిస్తూ కేజ్రీవాల్ సర్కార్ తెచ్చిన ఈ విధానంపై కొందరు సంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకోవడానికి ప్రైవేటు వాహనదారులు ప్రయత్నిస్తున్నారని, ముఖ్యంగా క్యాబ్‌ల చార్జీలను విపరీతంగా పెంచారని మరికొందరు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పుష్కరాలా.. అమ్మబాబోయ్!
పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాలు.. అందులోనూ ఈసారి 144 ఏళ్లకు వస్తున్న మహాపుష్కరాలు.. పుణ్యస్నానం చేయకపోతే మహాపాపం అని అందరూ అనడంతో సకుటుంబ సపరివార సమేతంగా పాలకొల్లు వెళ్లా. అక్కడికి వెళ్లడం వరకు బాగానే ఉంది గానీ, తిరిగి వచ్చేటప్పుడే.. చుక్కలు కనిపించాయి. ఏలూరు వరకు వస్తే.. అక్కడ కారు ఉంది. కానీ, ఏలూరు చేరుకోవడమే పెద్ద తపస్సులా అనిపించింది. పాలకొల్లు నుంచి భీమవరం ప్రయాణం.. మహా అయితే ముప్పావు గంట. కానీ, అప్పటికి దాదాపు రెండు గంటల నుంచి వెయిటింగ్. మామూలుగా అయితే ఐదు నిమిషాలకు ఓ బస్సు వచ్చి వెళ్లేది, ఆ రెండు గంటల్లో వచ్చినవి రెండే బస్సులు. అవికూడా ఫుల్లుగా ఉండటంతో అస్సలు ఆగలేదు. షేర్ ఆటోలు ఉన్నా.. ఒక్కోదాంట్లో అప్పటికే 20 మంది వరకు కుక్కి.. ఇక ఆపలేను బాబోయ్ అంటూ వెళ్లిపోతున్నారు. ఎట్టకేలకు ఒక్క బస్సు ఆగింది. హమ్మయ్య అంటూ కుటుంబంతో కలిసి బస్సు ఎక్కాను. ఆర్టీసీ బస్సులో కూర్చోవడం మాట దేవుడెరుగు.. కాలు పెట్టడానికి కాసింత జాగా దొరికింది.. అదే పదివేలు అనుకున్నాం. పావుగంట గడిచింది.. ఇంతలో ఎక్కడో సీటులోంచి ఓ ఆడగొంతు.. కండక్టర్‌తో గొడవ పడుతోంది. ఏంటా అని చెవులు రిక్కించి విన్నా. ''నిల్చున్నవాళ్లను అర్జంటుగా దించెయ్యండి.. మాకు గాలి ఆడట్లేదు. అలా తలుపు దగ్గరే అడ్డంగా నిలబడిపోతే మేం గాలి పీల్చుకోవక్కర్లేదా?'' అంటూ కండక్టర్‌ను గద్దిస్తోంది ఆవిడ. 'అంతమందిని ఎలా దించుతామమ్మా.. కావాలంటే మీరు దిగిపోయి కారులో రండి' అని కండక్టర్ ఆమెకు సమాధానం ఇచ్చాడు. సీట్లో కూర్చున్నవాళ్లను దించుతారా.. ఎంత ధైర్యం.. అంటూ మళ్లీ సదరు మహిళామణి ఒంటికాలి మీద లేచింది. ఎలాగోలా బస్సు కదిలింది. భీమవరానికి రెండు కిలోమీటర్ల దూరం ఉందనగా ఉన్నట్టుండి బస్సు ఆగిపోయింది. అలా ఆగడం.. ఆగడం.. దాదాపు ముప్పావు గంట సేపు అలాగే ఉండిపోయింది. ఏంటా అని దిగి బయటకు వెళ్లి చూస్తే, కనుచూపు మేర అంతా ట్రాఫిక్ జామే. పక్కన పెట్రోలు బంకు ఉంటే.. అక్కడున్న ఓ పెద్దమనిషిని బస్టాండు ఎంత దూరం ఉంటుందని అడిగా. ఆ, ఎంత.. రెండు ఫర్లాంగుల లోపే. నడిచి వెళ్లపోవచ్చని చెప్పారు. తీరా నడక మొదలుపెడితే.. రెండు కిలోమీటర్ల వరకు నడవాల్సి వచ్చింది. అక్కడ ఏలూరు బస్సు కోసం మరో గంటన్నర వెయిటింగ్.. అదీ దొరక్కపోవడంతో తాడేపల్లిగూడెం బస్సు కనిపించింది. మహాప్రసాదం అనుకుంటూ ఎక్కేసి, గూడెంలో ఉన్న స్నేహితుడికి ఫోన్ చేశా. అప్పటికి సమయం రాత్రి 9.45. ఓ గంటలో ఇంటికి వస్తానని చెప్పా. 11 గంటల సమయంలో గూడెం చేరుకుని, వాళ్ల ఇంటికి వెళ్లేసరికి వాళ్ల భార్య అన్నపూర్ణమ్మలా వేడివేడిగా వంట చేసి పెట్టింది. తినేసి ఏసీలో పడుకుని.. తెల్లారే లేచి ఫస్టు బస్సుకే ఏలూరు వెళ్లడం.. అక్కడ కారు తీసుకుని హైదరాబాద్ బయల్దేరి, మళ్లీ హనుమాన్ జంక్షన్ దగ్గర మూడు గంటల ట్రాఫిక్ జాంలో ఇరుక్కుని.. సాయంత్రం లోపు రావాల్సింది రాత్రి 7 గంటలకు ఇంటికి చేరుకున్నాం. అంతకుముందు 'డాడీ.. మళ్లీ పన్నెండేళ్లకు గానీ రావట కదా.. నేను పుష్కరాలు చూడాల్సిందే' అంటూ పట్టుబట్టిన నా పదిహేనేళ్ల కూతురు.. మళ్లీ పుష్కరాలు అన్న మాట ఎత్తితే ఒట్టు!! -కామేశ్వరరావు పువ్వాడ -
హైదరాబాద్-విజయవాడ రహదారిపై ట్రాఫిక్ జామ్
మునగాల: హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. దీంతో ఆ మార్గంలో గంటకుపైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నల్లగొండ జిల్లా మునగాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన తాళ్లపాక పుల్లమ్మ(65) ఉదయం 6.30 గంటల సమయంలోరోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఓ కారు ఆమెను ఢీకొట్టింది. దీంతో పుల్లమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంతో గ్రామస్తుల్లో ఆగ్రహం పెల్లుబుకింది. గ్రామస్తుల రాకపోకల కోసం ప్రత్యేకంగా సర్వీసు రోడ్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో వెయ్యి మంది వరకు జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. దీంతో ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. -
'అక్కడ ట్రాఫిక్ జామ్‌లు లేవు'
హైదరాబాద్: చైనా సోషలిజం వైపు సాగుతూనే అభివృద్ధిని సాధించడం గొప్ప అనుభూతిని కలిగించిందని సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ చెప్పారు. కమ్యూనిస్టుపార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) ఆహ్వానం మేరకు 12 మంది సీపీఐ బృందంతో పాటు ఆయన పన్నెండురోజుల పాటు చైనాలో పర్యటించారు. చైనాలో తమ అనుభవాలను శనివారం ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘అక్కడ అద్భుతమైన అభివృద్ధి జరుగుతోంది. నిమిషం కూడా ట్రాఫిక్ జామ్ కాదు. రోడ్డు ప్రమాదాలు లేవు. శాంతి, భద్రతలు అదుపులో ఉన్నాయి. ఆశ్చర్యాన్ని కలిగించే రీతిలో ప్లైఓవర్లున్నాయి. జనాభా నియంత్రణకు ఒకే సంతానం విధానాన్ని అమలుచేస్తున్నారు. ప్రభుత్వ నియంత్రణలోనే మల్టీ నేషనల్ కంపెనీలు పనిచేయడం విశేషం’’ అని తెలిపారు. తనతో పాటు ఏపీకి చెందిన హరినాథ్‌రెడ్డి, మహిళానేత సుల్తానా ఫైజీ, ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వి.ఉల్లాఖాద్రీ, తమిళనాడు, మహారాష్ట్ర,పంజాబ్,అస్సాం, ఒడిశా, కేరళ, గోవా రాష్ట్రాల నాయకులు తమ ప్రతినిధి బృందంలో ఉన్నారని రవీంద్రకుమార్ చెప్పారు. -
ట్రాఫిక్ జామ్ సమస్యతో స్కూల్ కు సెలవులు!
పాట్నా: ట్రాఫిక్ జామ్ కారణంగా ఓ స్కూల్ కు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. విపరీతమైన ట్రాఫిక్ కారణంగా విద్యార్ధులు సకాలంలో చేరలేకపోతుండటంతో చేసేదేమిలేక స్కూల్ ను గురువారం నుంచి మూడు రోజులపాటు మూసివేశారు. ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలో పాట్నాకు సమీపంలోని జెతులీలో చోటు చేసుకుంది. జెతూలీ నగర శివారులోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ వద్ద ఎప్పటిలానే ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఉదయం 7.15 నిమిషాలకు చేరాల్సిన విద్యార్ధులు ట్రాఫిక్ జామ్ లో బస్సులు ఇరుక్కుపోవడంతో 11.30 గంటల వరకు కూడా చేరలేకపోతున్నారని అధికారులు వెల్లడించారు. మంగళవారం రోజున స్కూల్ కు సకాలంలో చేరలేకపోయిన విద్యార్ధులను 12.10 గంటలకు వెనక్కి పంపగా వాళ్లు ఇంటికి చేరే సరికి సాయంత్రం 5 గంటలైందని, ట్రాఫిక్ జామ్ నరకాన్ని చూపిస్తొందని, బస్సులో పిల్లలు కూర్చోలేక ఏడుపు అందుకున్నారని బస్సు డ్రైవర్ తెలిపారు. హైవేకి ఆనుకుని ఉన్న ఈ పట్టణంలో ట్రాఫిక్ జామ్ లు రెగ్యులర్ వ్యవహారమని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ జామ్ స్కూల్ విద్యార్ధులు చిక్కుకోకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ట్రాఫిక్ అధికారులను ఆదేశించినట్టు అధికారులు తెలిపారు. ఈ ట్రాఫిక్ జామ్ లో కేవలం పిల్లలే కాదు.. అంబులెన్స్ లు, ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. -
భారీ వర్షంతో రాజధానిలో నరకయాతన
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ వాసులు హడలెత్తిపోతున్నారు. కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నగర జీవితం నరకప్రాయంగా మారింది. రోడ్లు చాలావరకు నదులు, కాలువలను తలపిస్తుంటే.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీరు ముంచెత్తుతుండడంతో నగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. ఒక కిలోమీటరు దూరం వెళ్లడానికే దాదాపు గంట సమయం పడుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు.. వేటిలో వెళ్లినా ఇదే పరిస్థితి. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటంతో చిన్న చినుకు పడితే చాలు.. నీళ్లు ఎక్కడికక్కడ నిల్వ ఉండిపోతున్నాయి. దీనికి తోడు పెద్దపెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. ఇక మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. దీంతో రోడ్డుపై ప్రయాణించాలంటేనే వాహన చోదకులు బెంబేలెత్తిపోతున్నారు. ఎక్కడ గుంత ఉందో.. మ్యాన్ హోల్ తెరుచుకుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన భయంకర పరిస్థితి. నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. కొన్ని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో గోడలు కూలిపోతున్నాయి. బుధవారం నాటి వర్షానికి జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, మాసాబ్ ట్యాంక్, లక్డీకా పుల్, ఆబిడ్స్, కోఠీ, మలక్ పేట, మూసారాం బాగ్, దిల్ సుఖ్ నగర్ లాంటి ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. మెట్రో రైలు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో అయితే, సగానికి పైగా రోడ్డును మెట్రో రైలు కోసం ఆక్రమించుకోవడం, మిగిలిన కొద్దిపాటి రోడ్డు అప్పటికే ఎంతో కొంత ఆక్రమణలకు గురికావడంతో ఆ మధ్య ఉన్న కొద్దిపాటి ఖాళీ లోంచి వాహనాలు వెళ్లలేక, ఆగలేక నానా అవస్థలు పడాల్సి వస్తోంది. మామూలు రోజుల్లోనే ఇలాంటి ప్రాంతాల్లో సమస్య ఉందంటే, ఇక వర్షం వచ్చినప్పుడు అసలు చెప్పనక్కర్లేదు. -
సిటీ జామ్
= వర్ష బీభత్సం.. ట్రాఫిక్ అస్తవ్యస్తం = ఈ సీజన్లో ఇదే రికార్డు = 9.81 సెంటీమీటర్లుగా నమోదు = రాదారులన్నీ గోదారులు = గంటల తరబడి ట్రాఫిక్ జామ్స్ సాక్షి, సిటీబ్యూరో: ఒకపక్క మెట్రోరైలు పనులు.. మరోపక్క ఇప్పటికే దెబ్బతిన్న రహదారులు.. అసలే నత్తనడకన సాగుతున్న ట్రాఫిక్ బుధవారం కురిసిన భారీ వర్షంతో పడకేసింది. ఒక్క వానకే రాకపోకలు కకావికలమయ్యాయి. రోడ్ల నిండా నీళ్లు.. కదలని వాహనాలు.. చుక్కల్ని చూపించాయి. వర్షం కురిసి.. వెలిసిన చాలాసేపటి వరకు కూడా వాహనాల వేగం గంటకు ఐదు కిలోమీటర్లు మించలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో కిలోమీటరు ప్రయాణానికి అరగంట పట్టింది. గంటల తరబడి వాహనాలు ముందుకు కదల్లేదు. రాత్రి 11 గంటల వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. మామూలుగానే మహా ఘోరం.. సాధారణ రోజుల్లోనే ఉదయం, సాయంత్రం వేళల్లో నగరంలో ట్రాఫిక్ జామ్స్ మామూలే. అదే సమయంలో వర్షం కురిస్తే.. బుధవారం అంతా ఇళ్లకు వెళ్లే వేళ కురిసిన వర్షం నరకాన్ని చూపించింది. నగర వ్యాప్తంగా దాదాపు 67 ప్రాంతాల్లో వర్షమొస్తే నీళ్లు నిలిచిపోతున్నాయి. ఆయా రహదారులన్నీ గోదారులవుతున్నాయి. ఇది నగరంలో ఎప్పుడూ ఉండే పరిస్థితే అయినా.. ఇప్పటికే రోడ్లు దెబ్బతిని ఉండటంతో బుధవారం మరింత దారుణంగా మారింది. ఫలితంగా వాహనాల వేగం పడిపోయింది. పలుచోట్ల బారులు తీరి నిలిచిపోయాయి. కొందరు వర్షం నుంచి తలదాచుకునేందుకు ద్విచక్రవాహనాలను రోడ్ల పక్కన ఆపి అటుఇటు పరుగులు తీయడంతో వెనుకే వస్తున్న వాహనాలు ఆగిపోయాయి. ‘మెట్రో’ మార్గంలో అవస్థలు నగరంలో మెట్రోరైల్ నిర్మాణ పనులు జరుగుతున్న రహదారులపై ఇబ్బందులు మరీ ఎక్కువయ్యాయి. నాగోలు-మెట్టుగూడ, సికింద్రాబాద్-బేగంపేట, ఎల్బీనగర్-చాదర్‌ఘాట్, ఎంజే మార్కెట్-నాంపల్లి, పంజగుట్ట-కూకట్పల్లి ప్రాంతాల్లో ఎక్కడిక్కడ నీళ్లు నిలిచిపోవడంతో ఈ రూట్లలో ప్రయాణం నరకాన్ని చూపించింది. చెట్టు, హోర్డింగులు కూలడంతో... బుధవారం కురిసిన వర్షానికి నగరంలోని పలుచోట్ల చెట్లు నేలమట్టమయ్యాయి. విద్యుత్, కేబుల్ తీగలు తెగిపడ్డాయి. కటౌట్లు, హోర్డింగ్స్ కుప్పకూలాయి. రోడ్లన్నీ జామ్ కావడంతో వీటి తొలగింపులో జాప్యం జరిగింది. జోరువానలో పరిస్థితిని చక్కదిద్దలేక ట్రాఫిక్ పోలీసులు చేతులెత్తేశారు. వర్షం తగ్గి, వీరు రంగంలోకి దిగేసరికి పరిస్థితి చేయిదాటిపోయింది. వాహనచోదకులే ఆగుతూ.. సాగుతూ ఎలాగో ‘దారి’ వెతుక్కున్నారు. బళ్లూ, ఒళ్లూ హూనం వర్షం, ఛిద్రమైన రోడ్లు, ఆగిపోయిన ట్రాఫిక్ కారణంగా వాహనాల మైలేజ్ ఘోరంగా పడిపోయింది. కార్లు వంటి వాహనాలు కేవలం ఒకటి, రెండు గేర్లలో మాత్రమే కిలోమీటర్ల మేర వెళ్లాల్సి వస్తుండటంతో ఇంధనం ఎక్కువ ఖర్చయింది. మరోపక్క వర్షాలకు ఛిద్రమైన రోడ్ల కారణంగా వాహనాలు దెబ్బతిన్నాయి. శరీరాలూ హూనమయ్యాయి. గోతులు గుర్తించలేక పలువురు అదుపుతప్పి పడిపోయారు. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ చిక్కులు.. ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, మలక్‌పేట, చాదర్‌ఘాట్, ఎంజీబీఎస్, సికింద్రాబాద్, బేగంపేట , ముషీరాబాద్, అమీర్‌పేట, అబిడ్స్, కోఠి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, నల్లకుంట, ఎంజే మార్కెట్, జీపీఓ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాసబ్‌ట్యాంక్, టోలిచౌకి, రవీంద్రభారతి, లక్డీకాపూల్, హిమాయత్‌నగర్, సోమాజిగూడ, పంజగుట్ట, తార్నాక.