
ప్రణబ్‌ను కలిసిన మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ మంగళవారం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకుని ఆయన ఆశీస్సులు అందుకున్నారు. ప్రధాని మోదీ నినాదమైన సబ్‌కా సాథ్..సబ్ కా వికాస్..సబ్‌కా విశ్వాస్ సాకారం కావాలని ప్రణబ్ ముఖర్జీ ఆకాంక్షించారు. ప్రణబ్‌తో భేటీ సందర్భంగా మాజీ రాష్ట్రపతిని రాజనీతిజ్ఞడిగా మోదీ కొనియాడారు.
ప్రణబ్ దాదాతో ఎప్పుడు కలిసినా అది అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుందని, అపార విజ్ఞానం సొంతమైన ఆయన అసలైన రాజనీతిజ్ఞుడని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు మోదీతో భేటీ ఆహ్లాదంగా సాగిందని, ఆయన రెండవ పర్యాయం ప్రధానిగా సేవలందించేందుకు సిద్ధమతున్న క్రమంలో శుభాకాంక్షలు అందిస్తున్నానంటూ ప్రణబ్ ముఖర్జీ ట్వీట్ చేశారు. కాగా మాజీ రాష్ట్రపతిని కలుసుకునేందుకు ప్రణబ్ నివాసానికి వచ్చినందుకు ప్రధాని మోదీకి ప్రణబ్ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ కూడా ధన్యవాదాలు తెలిపారు.