భక్తులకు గాజుల పంపిణీ | distributing bangles to devotees | Sakshi
Sakshi News home page

భక్తులకు గాజుల పంపిణీ

Published Sat, Oct 29 2016 8:49 PM | Last Updated on Mon, Sep 4 2017 6:41 PM

భక్తులకు గాజుల పంపిణీ

భక్తులకు గాజుల పంపిణీ

విజయవాడ (ఇంద్రకీలాద్రి) : ఇటీవల దుర్గమ్మకు అలంకరించిన గాజులను శనివారం భక్తులకు పంపిణీ చేశారు. అమ్మవారి అలంకరణకు ఉపయోగించిన గాజులతో పాటు మహామండపం ఆరో అంతస్తులోని ఉత్సవమూర్తికి అలంకరించిన గాజులను కూడా ఇచ్చారు. క్యూలైన్‌లో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు నాలుగు గాజులు చొప్పున పంపిణీ చేశారు. మహిళలు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని గాజులు స్వీకరించారు. కాగా, గాజులను ఆలయ సిబ్బంది కాకుండా ఇతర వ్యక్తులు పంపిణీ చేయడం గమనార్హం. క్యూలైన్‌లో వచ్చే వారికి నాలుగంటే నాలుగు గాజులే ఇస్తున్న వీరు తమ వారికి మాత్రం కోరినన్ని గాజులు ఇచ్చారు. ఇదేమిటని ప్రశ్నించిన భక్తులకు సేవా బృందమంటూ సాకులు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement