హైదరాబాద్ : దేశీయ అతిపెద్ద జువెల్లరీ బ్రాండ్ రిలయన్స్ జువెల్స్ ‘బ్యాంగిల్ మేళా’ నిర్వహిస్తోంది. జూన్ 22 నుంచి ప్రారంభమైన ఈ మేళా, జూలై 8 వరకు కొనసాగనుంది. ఈ మేళలో హైదరాబాద్‌లోని పంజాగుట్ట, కూకట్‌పల్లి షోరూంలలో బంగారపు గాజులను(గోల్డ్ బ్యాంగిల్స్‌ను) ప్రదర్శనకు ఉంచింది. మొత్తం 200 కిపైగా డిజైన్‌లతో కళకళలాడుతున్న ఈ మేళలో, రోజువారీ, ఫంక్షన్లకు వేసుకెళ్లే గాజులు ఉన్నాయి. తాము బ్యాంగిల్ మేళ నిర్వహించడాన్ని ఎంతో సంతోషిస్తున్నామని, తమ ప్రదర్శనలో ఇదీ ఒకటని రిలయన్స్ జువెల్స్ సీఈవో సునిల్ నాయక్ చెప్పారు. ప్రతి ఒక్క సందర్భాన్ని వేసుకెళ్లే గాజులను అందుబాటులో ఉంచామన్నారు.
భారతీయ మహిళల సంస్కృతి, సంప్రదాయాల్లో గాజులు ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటాయని చెప్పారు. నగరంలోని గాజుల అభిమానులందరికీ ఈ బ్యాంగిల్ మేళ ఎంతో ఉత్తేజకరమైన అవకాశమని పేర్కొన్నారు. వారి అభిరుచులకు అనుగుణంగా ఇక్కడ గాజులను ఎంపిక చేసుకోవచ్చని నాయక్ చెప్పారు. రిలయన్స్ జువెల్స్ ప్రస్తుతం గోల్డ్, డైమాండ్స్‌ను ఆఫర్ చేస్తోంది. మొత్తం 47 నగరాల్లో ఈ కంపెనీ 77 షోరూంలను కలిగి ఉంది. ప్రతి ఒక్క ప్రత్యేక సందర్భంలో అద్భుతమైన డిజైన్లను కంపెనీ అందుబాటులో ఉంచుతుంది. 100 శాతం బీఐఎస్ హాల్‌మార్క్ గోల్డ్‌ను మాత్రమే రిలయన్స్ జువెల్స్ విక్రయిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment