కేంద్రమంత్రికి అవమానం..గాజులతో దాడి | Man Throws Bangles at Smriti Irani in Gujarat | Sakshi
Sakshi News home page

కేంద్రమంత్రికి అవమానం..గాజులతో దాడి

Published Tue, Jun 13 2017 9:52 AM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM

కేంద్రమంత్రికి అవమానం..గాజులతో దాడి

కేంద్రమంత్రికి అవమానం..గాజులతో దాడి

అహ్మదాబాద్‌: కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఓ వ్యక్తి ఝలక్‌ ఇచ్చాడు. గుజరాత్‌లోని ఆమ్రేలీలో నిర్వహించిన ఓ ఫంక్షన్‌లో ఆమె మాట్లాడుతుండగా ఓ వ్యక్తి ఆమెపైకి గాజులు విసిరేశాడు. వందేమాతరం అంటూ గట్టిగా నినాదాలు చేశాడు. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అమ్రేలీలో వేడుక నిర్వహిస్తుండగా కేంద్రమంత్రి  స్మృతి ఇరానీ అక్కడికి అతిథిగా వచ్చారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతుండగా కాస్వాలా అనే వ్యక్తి లేచి రెండు మూడు గాజులు అనూహ్యంగా ఆమెపైకి విసిరాడు.

అనంతరం వందేమాతరం అంటూ నినాదాలు చేశాడు. అయితే, ఆ వ్యక్తికి స్మృతి ఇరానీకి మధ్య కాస్త దూరం ఉండటంతో ఆమెను తాకలేదు. పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని బయటకు తీసుకెళ్లారు. ఆ వ్యక్తికి భండారియా అనే గ్రామంగా గుర్తించారు. అయితే, రైతులపై రుణమాఫీ, అప్పుల విషయాన్ని కేంద్రమంత్రి చెప్పే ప్రయత్నంలో భాగంగా అతడు అలా చేశాడని కాంగ్రెస్‌ పార్టీ నేతలు చెప్పగా పోలీసులు తోసిపుచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement