ముంబై: 13 సంవత్సరాలు మంత్రిగా ఉండి కూడా ఏ పని చేయకపోతే.. ఆ వ్యక్తి గాజులు తొడుక్కోవడం ఉత్తమమని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విరుచుకుపడ్డారు. అహ్మద్ నగర్ జిల్లా శ్రీగోండా నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఎన్సీపీ మాజీ నేత బాబన్‌రావు పచ్‌పుటేపై పవార్ నిపులు చెరిగారు. కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వంలో 13 ఏళ్ల మంత్రిగా పనిచేసిన పచ్‌పుటే 2014లో బీజేపీలో చేరారు. కాంగ్రెస్-ఎన్సీపీ హయాంలో మంత్రిగా ఉన్నప్పటికీ తనను ఏ పని చేయనివ్వలేదని పచ్‌పుటే విమర్శలు చేశారు.
తాజాగా శ్రీగోండా నియోజకవర్గంలో ఎన్సీపీ అభ్యర్థి ఘనశ్యాం షెలార్ తరఫున ప్రచారం నిర్వహించిన పవార్.. పచ్‌పుటే విమర్శలపై స్పందించారు. ‘పచ్‌పుటే ఇటీవల ఓ సభలో మాట్లాడుతూ.. తాను మంత్రిగా ఉన్నప్పుడు సంతకాలు చేయడం తప్ప ఏ పనిని చేయనివ్వలేదని పేర్కొన్నారు. మంత్రి సంతకాలు చేస్తేనే ఏదైనా ఉత్తర్వుగా మారుతోంది. క్షేత్రస్థాయిలో చేయాల్సిన పనులకు ఆమోదం లభిస్తుంది. సంతకాలు చేసి కూడా.. ఏ పని చేయలేకపోయానని అనడంలో అర్థముందా? మంత్రిగా ఉండి కూడా ఏ పనిచేయలేకపోతే.. ఆ వ్యక్తి గాజులు ధరించాలి’ అని పవార్ ఘాటుగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment