festival effect
-
'చెట్టునీడ నీకెందుకు బాబూ.. నీ నీడలో నువ్వు సేద తీర్చుకో'..
ఒకరోజు జ్ఞాని దగ్గరకు కోటీశ్వరుడు వెళ్లి స్వామి నా దగ్గర కోటానుకోట్ల డబ్బు ఉన్నది. పూర్తి ఆరోగ్యవంతుడిని. ఇక నేను ఎవరిపైనా ఆధారపడవల్సిన అవసరం లేదు. ఎవరినీ సహాయం చేయమని అర్థించాల్సిన అవసరం లేదని చాలా గొప్పగా చెప్పుకున్నాడు. ఆ మాటలు విన్నాక జ్ఞాని నవ్వుతూ ‘‘బాబు నాతో కాస్త దూరం నడవగలవా’’ అని అడిగాడు. అయన ఆలా అడగడంతో నిరాకరించడం బాగుండదని తలచిన ఆ వ్యక్తి జ్ఞానితో కలిసి అడుగులు వేశాడు. అలా నడుస్తూ నడుస్తూ అలసిపోయిన వ్యక్తి దరిదాపులలో ఏదైనా చెట్టు కనిపిస్తుందేమో... ఆ చెట్టు నీడలో కాసేపు సేద తీరాలని చుట్టూ చూసాడు. ఎక్కడా ఏ చెట్టూ కనిపించలేదు. ఇది గమనించిన జ్ఞాని ‘‘ఏంటి బాబూ... వెతుకుతున్నావు?’’ అని అడిగాడు. ‘‘అయ్యా చాల దూరం వచ్చాము. కాసేపు చెట్టునీడలోకి వెళ్లి సేదతీర్చుకుని ఆ తర్వాత తిరిగి ముందుకు సాగుదాం’’అని చెప్పాడు. అతడి మాటలకు ఆ జ్ఞాని ‘‘చెట్టునీడ నీకెందుకు బాబూ... నీ నీడలో నువ్వు సేద తీర్చుకో’’ అన్నాడు. ‘‘నా నీడలో నేను ఎలా ఉండగలను స్వామీ! ఏం మాట్లాడుతున్నారు మీరు?’’ అని కాస్తంత ఆశ్చర్యంగా మరికాస్త నిష్ఠురంగానూ అడిగాడు ఆ వ్యక్తి. అందుకు ఆ జ్ఞాని, చిరునవ్వుతో అతడివైపు చూస్తూ... అదేంటి, నీ నీడలో నువ్వు తల దాచుకోలేవా? నువ్వే కదా బాబూ, నాదగ్గర అన్నీ ఉన్నాయి. నేను ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు అన్నావు, చూశావా! ఇప్పుడు నీ నీడ సైతం నీకు ఉపయోగపడలేదు’’ అన్నారు. ఇప్పుడు ఆ ఐశ్వర్యవంతుడికి నిజంగా జ్ఞానోదయం అయింది ఏ చెట్టు కిందకూ వెళ్లకుండానే. అందుకే పెద్దలన్నారు... అహంకరించవద్దు అని. ఎంత ధనవంతులైనా, వారికి ఎన్ని ఉన్నా ఎప్పుడు ఎవరికీ ఏది అవసరం అవుతుందో తెలియదు ఈ లోకంలో. అన్నింటికీ మించి మనపైన మనకు నమ్మకం ఉండాలి అహం ఉండకూడదు. మనపైన మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి. అంతేకానీ, ఇతరులపైన ఏమాత్రం చులకన భావం ఉండకూడదు.. మనసులోకి రాకూడదు. ఇవి చదవండి: Ugadi Festival: నిండుగ వెలుగునిచ్చే.. 'తెలుగు పండుగ' ఇది.. -
హోలీ 2024: సెలబ్రిటీల సందడి (ఫోటోలు)
-
'ఊరికి బంధువులొస్తున్నారు'.. కానుకలతో కాచుకోండి..!
'సంక్రాంతి పండగ వస్తే ఊర్లోకి పాత బంధువులొస్తారు. పండిన పంట నుంచి హక్కుగా తమ భాగం తీసుకుపోతారు. హరిదాసులు, గంగిరెద్దుల వారు, కొమ్మదాసరులు, జంగం దేవరలు, పిట్టల దొరలు, గారడీ వాళ్లు.. వీరందరికీ సంక్రాంతి వస్తే సంవత్సరానికి సరిపడా సాయం. సాటివారికి సాయం చేయడమే సంక్రాంతి'. సంక్రాంతి అనగానే ఊళ్లోకి బంధువులే కాదు డూడూ బసవన్నలు కూడా వస్తారు. సంక్రాంతి అంటే తిని, తేన్చి, సంబరాలు చేసుకునే పండగ మాత్రమే కాదు... రైతు సౌభాగ్యానికీ పల్లె సౌభాగ్యానికీ సహకారం అందించిన అన్ని వర్గాల వారికీ పంపకాలు చేసే పండగ కూడా. సంక్రాంతి పండగ సమయంలో ఇంటికి పుట్ల కొద్దీ చేరిన ధాన్యం నుంచి రైతు తనకు సేవ చేసిన, సాయం చేసిన వర్గాల వారికి భాగం ఇస్తాడు. ‘మేర’ పంచుతాడు. పాలేర్లకి, సేద్యగాళ్లకి. పనివాళ్లకి వడ్లు పోస్తాడు. కొందరికి కొత్తబట్టలు పెడతాడు. అయితే వీరు కాకుండా ఊరి మీద హక్కుగా తమ వాటా కోసం వచ్చే సంప్రదాయ వృత్తికళకారులు వచ్చి ఊరిలో ఆడి, పాడి వినోదం పంచి తమ వడ్లు మూట గట్టుకుని పోతారు. శ్రీమద్రమా రమణ... ‘సద్గురుని కృపచే తారతమ్యము తరచి గనుమన్నా.. ధరణి లోపల మూఢమతులకు దొరుకుటకు బహు దుర్లభమ్మిది’.. అని పాడుతూ గురు కటాక్షం వలనే భక్తిని, ముక్తిని చేరుకోవాలని బోధిస్తూ వీధివీధిన తిరుగుతూ సంక్రాంతి శోభను తెస్తాడు హరిదాసు. పండగ రోజుల్లో దానికి ముందు ధనుర్మాసంలో హరిదాసు తిరగని ఊరు, వీధి ఎంతో బోసిపోతాయి. నెత్తిన అక్షయపాత్ర, భుజాన తంబూర, చేతిలో చిడతలతో ‘శ్రీమద్రమా రమణ గోవిందా’ అంటూ భిక్ష స్వీకరించా ‘కృష్ణార్పణం’ అంటూ మనం సంపాదించిన దానిలో కొంత పేదలకు అర్పణం చేయడం ద్వారా దేవునికి సమర్పణం చేసిన పుణ్యం పొందాలని సూచిస్తాడు హరిదాసు. ఒకప్పుడు పల్లెల్లో ప్రతి వీధి వాకిట్లో హరిదాసు కోసం గృహిణులు కాచుకుని ఉండేవారు. ఇప్పుడు పై అంతస్తుల్లో, అపార్ట్మెంట్ బాల్కనీల్లో నుంచి చూస్తూ కిందకు దిగడానికి బద్దకిస్తున్నారు. హరిదాసు అక్షయ΄ాత్రలో జారవిడిచే కాసిన్ని బియ్యం మన ఇంటి సంపదను అక్షయపాత్రగా మారుస్తాయి. డూడూ బసవన్నలు ‘గంగిరెద్దులా తల ఊపకు’ అని అంటారు గాని దైవచిత్తానికి తల ఊపుతూ భారం అంతా నీదే అనుకోవడానికి మించిన వేరే సుఖం ఏముంటుంది? డూడూలు కొట్టే బసవన్నను యజమాని ముద్దుగా చూసుకున్నట్టే జీవుణ్ణి దేవుడు ముద్దుగా చూసుకుంటారు. గంగిరెద్దులు ఇంటి ముందుకొచ్చి సన్నాయి పాట వినిపిస్తే ఆ కళే వేరు. రంగు రంగుల పాతబట్టలు ఇస్తే అవి బసవడి మూపురం మీదకు చేరుతాయి. కాసులిస్తే గంగిరెద్దులవాడి నల్లకోటు జేబులో చేరుతాయి. కాసిన్ని డబ్బులు ఎక్కువిస్తే గంగిరెద్దులు విన్యాసం చేస్తాయి. యజమాని ఛాతీ మీద సుతారంగా గిట్టలు ఆడిస్తాయి. బుడబుడలు... కొమ్మదాసరులు ‘అంబ పలుకు జగదంబ పలుకు’ అంటూ డమరుకం వాయిస్తూ బుడబుక్కల వాళ్ళు వస్తారు సంక్రాంతికి. తలపాగా, కోటు, గొడుగు చేతబూని శుభాల భవిష్యత్తును చెబుతూ భిక్ష స్వీకరిస్తారు. వారు వేగంగా వాయించే డమరుకం గొప్ప శబ్ద విన్యాసం సృష్టిస్తుంది. వీరికి డబ్బు. వడ్లు, పాతబట్టలు ఇవ్వాల్సిందే. ఇక ఊరికి ఒకప్పుడు కొమ్మదాసరులు వచ్చేవారు. వీరు ఊరి మధ్యలోని చెట్టు కొమ్మెక్కి కూచుని కింద గుడ్డ పరిచి వచ్చేపోయేవారి మీద వ్యాఖ్యానం వినిపిస్తుండేవారు. తగిన సొమ్ము ముట్టజెప్తేనే దిగేవారు. కొయ్య తుపాకీతో పిట్టల దొరలు వస్తారు పెద్ద పెద్ద వాళ్లతో కలిసి తిరగాలనుకునే సామాన్యుడి కలలకు మాటల మలాం పూస్తారు. ‘మేము స్నానం చేసిన సబ్బు నీళ్లతో పేద దేశాల వాళ్లు డ్యాములు కట్టుకున్నారు’ అంటారు. ‘మా ఇంట్లో కేజీ బంగారం కుక్క నాకిందని చెత్తకుప్పలో పడేశాం’ అంటారు. ‘మోదీ గారు పిలిచి పాకిస్తాన్ మీద యుద్ధానికి పొమ్మని ఆర్రూపాయలు అడ్మాన్సు ఇచ్చారు’ అంటారు. దుబాయ్ షేకుతో టిఫిని తిని అమెరికా ప్రెసిడెంట్‌తో లంచ్‌కు కూచోపోబోతున్నాం అంటారు. తర్వాత శంఖం ఊదుతూ జంగం దేవరలు వస్తారు. గారడీ వాళ్లు, కనికట్టు ప్రదర్శించేవాళ్లు.. వరుస కడతారు. రైతు ఎవరినీ కాదనడు. అందరినీ ఆదరిస్తాడు. ఇక సాయంత్రమైతే ఊళ్లో పాట కచేరీలు, డాన్సు ప్రోగ్రాములు ఉంటాయి. రకరకాల కళాకారులు దిగుతారు. సినిమా నాటకాలు ఒకప్పుడు వేసేవారు. సినిమాలు కూడా వేసేవారు. సంక్రాంతి సందేశం... సామూహిక ఉత్సవం. జీవితం సాటి మనుషులతో కలిసి మెలిసి సాగాలని చెప్తుంది. ఉన్నది పంచుకుని తినాలని చెప్తుంది. శ్రమ చేసి సమృద్ధితో జీవించమని చెబుతుంది. నలుగురూ కలిసి ప్రకృతి వనరులను ఫలవంతం చేసుకుని నలుగురూ వృద్ధి కావాలని కోరడమే సంక్రాంతి. ఇవి చదవండి: Makar Sankranti 2024: పతంగులు ఎందుకు ఎగురవేస్తారో తెలుసా? -
దసరా పండగకి పల్లె బాట పట్టిన పట్నం (ఫొటోలు)
-
వాహన అమ్మకాలు రయ్
ముంబై: దేశీయ ఆటో అమ్మకాలు ఆగస్టులో పెరిగాయి. పండగ సీజన్ సందర్భంగా వాహనాలకు డిమాండ్ ఊపందుకోవడంతో పాటు సెమీ కండక్టర్ల సరఫరా మెరుగవడం ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రాఅండ్‌మహీంద్రా, కియా మోటార్స్ విక్రయాల్లో వృద్ధి కన్పించింది. హ్యుందాయ్, టయోటా, స్కోడా కంపెనీలూ చెప్పుకోదగిన స్థాయిలో అమ్మకాలు జరిపాయి. అయితే హోండా కార్స్, ఎంజీ మోటార్స్ వాహన సంస్థల విక్రయాల్లో స్వల్ప క్షీణత కన్పించింది. ‘‘గడిచిన మూడు నెలల్లో మునుపెన్నడూ లేని విధంగా 9.92 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. బలమైన డిమాండ్‌కు తగ్గట్టు సప్లై మెరుగుపడటంతో ఇది సాధ్యమైంది. ఈ పండుగ సీజన్లో 3.77 లక్షల వాహనాలను ఆర్డర్ చేసేందుకు కంపెనీ సన్నద్ధమైంది. పరిశ్రమ వ్యాప్తంగా పెండింగ్ ఆర్డర్లు 7–7.5 లక్షల వాహనాలు ఉండొచ్చు’’ అని మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీవాస్తవ తెలిపారు. మారుతీ సుజుకీ ఇండియా విక్రయాలు ఆగస్టులో 1,34,166కు చేరాయి. 30 శాతం పెరిగాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా విక్రయాలు 59,068 నుంచి 5% వృద్ధితో 62,210 యూనిట్లకు చేరాయి. -
ముల్తానీల్లో మార్పు వచ్చేనా..?
సాక్షి, ఇచ్చోడ (ఆదిలాబాద్): ఈసారైనా ముల్తానీల మార్పు సాధ్యపడేనా.? వారి మార్పు కోసం జిల్లా అధికార యంత్రాంగం తీసుకునే నిర్ణయాలు ఏకీభవించి వాటికి అనుగుణంగా అడుగులు ముందుకు వేస్తారా.? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. నేర ప్రవృత్తిలో కరుడుగట్టిన ముల్తానీలు పరస్పర దాడులు, పోలీసు కేసులకు బయపడే రకం కాదు. గుండాల, కేశవపట్నం, జోగిపేట్ గ్రామాల్లో నివసిస్తున్న ముల్తానీలపై 20ఏళ్లుగా 2వేలకు పైగా మందిపై జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. కానీ ఇటీవల గుండాలలో ఉర్సు ఉత్సవాల్లో రెండు గ్రూపుల మధ్య జరిగిన దాడిలో ఇద్దరు దారుణ హత్యకు గురి కాగా పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనతో జిల్లా పోలీసు యంత్రాంగం అలర్ట్ అయింది. ముల్తానీల గ్రామాల్లో దాడులు పునరావృతం కాకుండా పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర గుండాల గ్రామ ప్రజలతో రెండు, మూడు సార్లు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. ముల్తానీల్లో మార్పునకు తీసుకోవాల్సిన చర్యలపై మండల స్థాయి అధికారులతో ఓ టీంను ఏర్పాటు చేశారు. ఫలించని కృషి ముల్తానీల మార్పునకు గతంలో జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకున్నప్పటికీ ఆశించిన ఫలితం రాలేదు. కలప స్మగ్లింగ్ చేస్తున్న వారికి మైనార్టీ, బీసీ, ఎస్సీ కార్పొరేషన్ అధికారులతో పాటుగా బ్యాంకు అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి ముల్తానీల గ్రామాల్లో పర్యటించి ప్రణాళిక తయారు చేసి అప్పటి కలెక్టర్‌కు అందజేశారు. కానీ పూర్తిస్థాయిలో ముల్తానీలకు స్వయం ఉపాధి కల్పించకపోవడంతో అధికారులు చేసిన కృషి ఫలించ లేదు. ప్రస్తుతం కలెక్టర్ సిక్తా పట్నాయక్, జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర మండల స్థాయి అధికారులతో టీంను ఏర్పాటు చేశారు. ఈ టీం ఆ గ్రామాల్లో పర్యటించి వారి మార్పునకు ప్రణాళిక సిద్ధం చేయనుంది. గుండాల్లో నాలుగుసార్లు దాడులు... గుండాల గ్రామంలో ఐదేళ్ల కాలంలో నాలుగు సార్లు దాడులు జరిగాయి. చిన్నచిన్న దాడులు తరుచుగా జరుగుతూనే ఉంటాయి. నాలుగుసార్లు కత్తులు, రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు గాయాల పాలై చావు అంచుల వరకు వెళ్లి వచ్చినవారు ఉన్నారు. ఈ దాడులన్నీ ఉర్సు ఉత్సవాల సమయంలోనివే. ఇటీవల జరిగిన దాడిలో ఓ గ్రూపునకు చెందిన ఇద్దరు హత్యకు గురి కాగా జిల్లా అధికార యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. కేసులంటే బయం లేదు.. గతం నుంచి నేరప్రవృత్తి కలిగిన ముల్తానీలకు పోలీసు కేసులంటే అసలు బయమేలేదు. గుండాల, కేశవపట్నం, జోగిపేట్, ఎల్లమ్మగూడ గ్రామాల్లో 9వేల వరకు వీరి జనాభా ఉంది. వీరిలో 20నుంచి 60ఏళ్ల లోపుగల 2వేల మందిపై కేసులు ఉన్నాయి. అక్షరాస్యత లేక... ముల్తానీలు మార్పు చెందకపోవడానికి ప్రధాన కారణం నిరక్షరాస్యతే. వీరిలో పదో తరగతి వరకు చదుకున్న వారు పదుల సంఖ్యలోనే ఉంటారు. నాలుగైదు తరగతి చదివిన తరువాత బడిని మాన్పిస్తారు. ఒక్కో కుంటుంబంలో కనీసం 5నుంచి 12 మంది వరకు పిల్లలు ఉంటారు. ముల్తానీ మహిళలు కుటుంబ నియంత్రణ చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. మార్పునకు తీసుకోవాల్సిన అంశాలు... ► ముల్తానీల మార్పు కోసం జిల్లా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ► బడీడు పిల్లలకు నిర్బంధ విద్యను అందించాలి. ► ప్రాథమిక విద్య అనంతరం పై చదువుల కోసం వారిని మైనార్టీ గురుకుల పాఠశాలలో చేర్పించాలి. ► పాఠశాలకు పిల్లలను పంపని వారి తల్లితండ్రులకు ప్రభుత్వ పథకాలు నిలిపివేయాలి. ► కుటుంబ నియంత్రణ తప్పనిసరిగా పాటించేలా అవగాహన కల్పించాలి. ► నిరుద్యోగ యువతకు ప్రత్యేక శిక్షణ ఇప్పించి బ్యాంకుల ద్వారా రుణాలు అందజేసి ఉపాధి కల్పించాలి. ► అర్హులకు వృద్ధాప్య, వితంతువు పింఛన్లు ఇప్పించాలి. ► పోలీసు కేసులతో కోర్టుల చుట్టు తిరిగడం వల్ల కలిగే ఇబ్బందులు తెలియజేయాలి. వలస వచ్చి నివాసం.. పాకిస్తాన్‌ను నుంచి సుమారు 160 ఏళ్ల క్రితం వలస వచ్చిన ముస్లిం గిరిజన తెగకు చెందిన ముల్తానీలు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గుండాల, కేశవపట్నం, జోగిపేట్ గ్రా మాల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. దేశ విభజన తర్వాత వీరు తిరిగిఅక్కడికి వెళ్లిపోకుండా ఇక్కడే ఉండిపోయారు. కలప అక్రమ రవాణాను ఉపాధిగా మార్చుకుని జీవించేవారు. రాష్ట్ర ప్రభుత్వం కలప స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపడంతో నాలుగేళ్ల నుంచి కలప స్మగ్లింగ్ తగ్గుముఖం పట్టింది. దీంతో వీరిలో కొంతమంది వ్యవసాయం, మరికొంత మంది చిరువ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. -
Diwali 2021 Safety Precautions: టపాసులు కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి!
దీపావళి ఎంత కాంతిని ఇస్తుందో... వికటిస్తే అంతే చీకటినీ తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ప్రమాదాలేవీ లేకుండా కేవలం వేడుకల సంబరాలు పొందేందుకు కొన్ని జాగ్రత్తలు అందరూ పాటించాలి. మరీ ముఖ్యంగా పిల్లల విషయంలో పెద్దలు. అలాంటి సాధారణ జాగ్రత్తలు మొదలు కళ్లూ, ఒళ్లూ, చెవులూ... విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపేదే ఈ కథనం. చెవులు జాగ్రత్త... దీపావళి బాణాసంచా వల్ల దేహంపై ప్రధానంగా దుష్ప్రభావం చూపే ముఖ్యమైన మూడు అంశాలు శబ్దం, పొగ, రసాయనాలు. అప్పుడే పుట్టిన చిన్నారులు, చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులపై వీటి ప్రభావం మరింత ఎక్కువ. వీటిలో శబ్దం వల్ల ప్రధానంగా చెవులు దెబ్బతింటాయి. చెవుల విషయంలో రక్షణ పొందడం ఎలాగో చూద్దాం. కొన్ని టపాకాయల శబ్దం 100–120 డెసిబుల్స్ వరకు ఉంటుంది. కానీ మన చెవి కేవలం 7 డెసిబుల్స్ శబ్దాన్ని మాత్రమే హాయిగా వినగలుగుతుంది. ఆ పైన పెరిగే ప్రతి డెసిబుల్ కూడా చెవిని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి చెవులను రక్షించుకోడానికి ‘ఇయర్ ప్లగ్స్’ కొంతమేరకు అనువైనవి. ►పెద్ద శబ్దాలతో పేలిపోయే టపాకాయలు కాకుండా చాలా తక్కువ శబ్దంతో పూలలాంటి వెలుగులు కురిపించే చిచ్చుబుడ్లు, కాకరపూవత్తులు, పెన్సిళ్లు, భూచక్రాల వంటివి కాల్చడం మంచిది. ►ఒకవేళ పెద్ద పెద్ద శబ్దాలకు ఎక్స్పోజ్ అయితే చెవిలో ఎలాంటి ఇయర్ డ్రాప్స్, నీళ్లూ, నూనె వంటివి వెయ్యకుండా ఈఎన్టీ నిపుణుడిని సంప్రదించాలి. కళ్ల విషయంలో అప్రమత్తత అవసరం చాలా ఎక్కువ తీక్షణమైన వెలుగు, దానితోపాటు వెలువడే వేడిమి, మంట... ఈ మూడు అంశాలతో కళ్లు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. బాణాసంచాలోని రసాయనాలతో కళ్లు పరోక్షంగా ప్రభావితం కావచ్చు. సల్ఫర్, గన్‌పౌడర్ లాంటి రసాయనాల ప్రభావం వల్ల కళ్ల నుంచి నీళ్లు కారడం, కళ్ల మంటలు, దురద వంటి ప్రభావాలు ఉంటాయి. ప్రమాద నివారణ / నష్టాలను తగ్గించుకోవడం ఎలా: ►బాణాసంచా కాల్చగానే వేడిమి తగలకుండా వీలైనంత దూరంగా వెళ్లాలి. కాలని / పేలని బాణాసంచాపై ఒంగి చూడటం మంచిది కాదు. ►కంటికి రక్షణగా ప్లెయిన్ గాగుల్స్ వాడటం మంచిది. ►ప్రమాదవశాత్తు కంటికి ఏదైనా గాయం అయినప్పుడు ఒక కన్ను మూసి, ప్రమాదానికి గురైన కంటి చూపును స్వయంగా పరీక్షించి చూసుకోవాలి. ఏమాత్రం తేడా ఉన్నా వెంటనే కంటి డాక్టర్‌ను సంప్రదించాలి. చర్మం జర భద్రం బాణాసంచాతో చర్మం కాలిపోయే ముప్పు ఎక్కువ. అందునా కాళ్ల, వేళ్ల, చేతుల ప్రాంతంలోని చర్మం గాయపడే ప్రమాదం మరింత అధికం. ప్రమాద నివారణ / నష్టాలను తగ్గించుకోవడం ఎలా: ►బాణాసంచాని కిచెన్, పొయ్యి ఉన్న ప్రాంతాల్లో ఉంచకూడదు. ►బాణాసంచా కాల్చే సమయంలో వదులైన దుస్తులు ధరిస్తే, అవి వేలాడుతూ మంట అంటుకొనే ప్రమాదం ఉంది. అందుకే కొద్దిగా బిగుతైనవే వేసుకోవాలి. ►బాణాసంచా కాల్చే సమయంలో టపాకాయకు వీలైనంత దూరంగా ఉండాలి. దూరం పెరిగే కొద్దీ చర్మానికి నేరుగా తాకే మంట, వేడిమి తాకే ప్రభావమూ తగ్గుతుంది. ►బాణాసంచా కాల్చే సమయం లో ముందుజాగ్రత్తగా రెండు బక్కెట్లు నీళ్లు పక్కనే ఉంచుకోవాలి. చర్మం కాలితే కంగారు పడకుండా తొలుత గాయంపై నీళ్లు ధారగా పడేలా కడగాలి. మంట తగ్గేవరకు అలా కడిగి అప్పుడు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. గాయాన్ని కడగడానికి గది ఉష్ణోగ్రతతో ఉన్న మామూలు నీళ్ల (ప్లెయిన్ వాటర్)ను వాడాలి. ఐస్ వాటర్ మంచిది కాదు. కాలడం వల్ల అయిన గాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో రుద్దకూడదు. డాక్టర్ దగ్గరికి వెళ్లేవరకు గాయాల్ని తడిగుడ్డతో కప్పి ఉంచవచ్చు. ►కాలిన తీవ్రత చాలా ఎక్కువగా సమయాల్లో చేతుల వేళ్లు ఒకదానితో ఒకటి అంటుకుపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు వాటి మధ్య తడిగుడ్డ ఉంచి డాక్టర్ దగ్గరికి తీసుకుపోవాలి. ►కాలిన గాయాలు తీవ్రమైతే బాధితులకు ఒక్కోసారి శ్వాస సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కంగారు పడకుండా వీలైనంత త్వరగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. ►బాణాసంచా ఎప్పుడూ ఆరుబయటే కాల్చాలి. ఇంటి కారిడార్లలో, ఇంటి లోపలా, టెర్రెస్‌పైన కాల్చకూడదు. పేలే బాణాసంచాను డబ్బాలు, పెట్టెలతో పాటు... మరింత శబ్దం కోసం కుండల్లో, తేలికపాటి రేకు డబ్బాల్లో, గాజు వస్తువుల్లో ఉంచి అస్సలు కాల్చకూడదు. అవి పేలిపోయినప్పుడు వేగంగా విరజిమ్మినట్టుగా విస్తరించే పెంకుల వల్ల చర్మం, కళ్లూ, అనేక అవకాశాలు, తీవ్రంగా గాయపడే ప్రమాదం ఉంది. ►చిన్న పిల్లలను ఎత్తుకొని బాణాసంచా అస్సలు కాల్చకూడదు. పెద్దవాళ్ల సహాయం లేకుండా చిన్నపిల్లలు వాళ్లంతట వాళ్లే కాల్చడం సుతరామూ సరికాదు. పిల్లలు కాలుస్తున్నప్పుడు పెద్దలు పక్కనే ఉండి, జాగ్రత్తగా వారిని చూసుకోవాలి. పైన పేర్కొన్న జాగ్రత్తలతో మన పండగ... మరింత సురక్షితంగా మారి పూర్తిగా‘సేఫ్ దీపావళి’ అవుతుందని మనందరమూ గుర్తుపెట్టుకోవాలి. చదవండి: Diwali Special 2021: మీ ప్రియమైనవారికి ఈ గిఫ్ట్స్ ఇచ్చారంటే.. దిల్ ఖుష్!! -
మోండాలో సెల్‌ఫోన్ దొంగల హల్చల్.. సీసీ కెమెరాలో రికార్డు
సాక్షి, బన్సీలాల్‌పేట్(హైదరాబాద్): సికింద్రాబాద్ మోండా మార్కెట్లో సెల్‌ఫోన్ దొంగల ముఠా హల్చల్ చేస్తోంది. మార్కెట్‌కు వివిధ రకాల కొనుగోళ్ల కోసం వచ్చేవారి సెల్ఫోన్లను దొంగలు తస్కరిస్తున్నారు. కనురెప్పపాటులో ఫోన్లు మాయం అవుతున్నాయి. ఇటీవల వినాయకచవితి సందర్భంగా మార్కెట్‌కు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజల రాకతో మార్కెట్ జన సంద్రంగా మారింది. వినియోగదారులు తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తుంటే దొంగలు మరో వైపు తమ పని కానిచ్చేశారు. ► బోయిగూడ కట్టెలమండి ప్రాంత నివాసి పాకాల రమేష్ మార్కెట్లో పూలు కొనుగోలు చేస్తుండగా దొంగ పూలు కొంటున్నట్టు నటిస్తూ రమేష్ షర్ట్ జేబులో ఉన్న విలువైన సెల్‌ఫోన్‌ను తస్కరించాడు. అయితే ఈ తతంగం అంతా అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. ► సదరు దొంగ వ్యూహాత్మకంగా వచ్చి సంచి అడ్డుగా పెట్టి సెల్‌ఫోన్‌ను దొంగిలించాడు. అదే రోజు మరో ఇద్దరి సెల్ఫోన్లు కూడా చోరీకి గురయ్యాయి. దీంతో బాధితులు మోండా మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ► సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు సమీపంలో మోండా మార్కెట్ ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి దొంగతనాలకు పాల్పడుతూ రైళ్లలో ఇట్టే మాయమవుతున్నారు. పోలీసుల వైఫల్యంపై విమర్శలు ►నిత్యం వేలాది మంది ప్రజల రాకపోకలు...వ్యాపార కార్యకలాపాలతో రద్దీగా ఉంటే మోండా మార్కెట్లో పోలీసు నిఘా వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ►విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ దొంగలు అడ్డూఅదుపు లేకుండా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ►మోండా మార్కెట్లో కనీసం పండగ వేళల్లో అయినా పోలీసు అనౌన్స్మెంట్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తే జాగ్రత్తగా ఉంటారని పలువురు సాక్షితో వాపోయారు. ► మోండా మార్కెట్‌కు వచ్చిన అనేకమంది డబ్బు, సెల్ఫోన్లు పోగొట్టుకొని పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయలేకపోతున్నారు. ► ఇప్పటికైనా పోలీసులు ప్రత్యేక నిఘాతో దొంగతనాలకు కళ్లెం వేయాలని ప్రజలు కోరుతున్నారు. గట్టి నిఘా : క్రైమ్ ఇన్స్పెక్టర్ శేఖర్ మోండా మార్కెట్లో సెల్‌ఫోన్ దొంగతనాల నివారణకు గట్టి చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. మోండా మార్కెట్ రద్దీ ప్రాంతాల్లో సివిల్‌డ్రెస్‌లో పోలీసు సిబ్బందిని ఉంచాం. ప్రజలను అప్రమత్తం చేయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నాం మార్కెట్‌కు వచ్చేటప్పుడు ప్రజలు విలువైన వస్తువులను వెంట తీసుకురాకూడదు. చదవండి: షాకింగ్: పెట్రోలు పోసి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు -
అన్నకు ఆనందంగా రాఖీకట్టిన చెల్లెలు.. అంతలోనే..
సాక్షి, నస్రుల్లాబాద్(నిజామాబాద్): మండలంలోని కామిశెట్టిపల్లి గ్రామానికి చెందిన రాజు(35) ఆదివారం పాము కాటుతో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజు మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తాడు. తన సోదరితో రాఖీ కట్టిన తర్వాత రాజు తన బార్బర్ షాపులో పని చేసుకుంటుండగా పాము కరవడం గమనించకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. పాము కరిచిన చాలా సేపటి తర్వాత స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. గ్రామంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. కేసు నమోదు చేసుకొని దర్యాపు చేస్తున్నట్లు ఎస్సై మచ్చేందర్ పేర్కొన్నారు. చదవండి: Snake: ఐదు అడుగుల నాగుపాము పట్టివేత -
పట్టు కోల్పోయిన రంగుల రాట్నం, షాక్‌లో ప్రేక్షకులు
వాషింగ్టన్: సరదగా పిల్లలతో గడపడానికి ఓ పార్కుకో, ఏదైనా ఎగ్జిబిషన్ కో వెళ్తే పిల్లలను ముందుగా ఆకర్షించేది రంగుల రాట్నం (స్పిన్నర్). ఎవరైనా రంగుల రాట్నం ఎక్కడానికి ఇష్టపడతారు. అంతెత్తున పైకి తీసుకెళ్లి.. కిందకు తీసుకురావడంతో పిల్లలు, పెద్దలైనా మురిసిపోతారు. మరి కొందరేమో సరదాగా రంగుల రాట్నం ఎక్కినా.. ఎక్కడ కిందపడిపోతామో అని భయంతో వణికిపోతారు. ఇక నిజంగానే రంగుల రాట్నంలో ఏదో లోపం తలెత్తి అది లెక్కలేకుండా తిరుగుతుంటే! వామ్మో అది ఊహిస్తేనే కష్టం కదా. తాజాగా అమెరికాలోని మిచిగాన్‌లో జరిగిన నేషనల్ చెర్రీ ఫెస్టివల్లో అటువంటి ఘటన వెలుగుచూసింది. మ్యాజిక్ కార్పెట్ రైడ్ మధ్యలో స్పిన్ యంత్రం నియంత్రణ కోల్పోయింది. గుడ్రంగా తిరుగుతూ రంగుల రాట్నంలో ఉన్నవారు.. కింద ఉన్న వారి బంధువులు, కుటుంబ సభ్యులను బెంబేలెత్తించింది. వారి అరుపులతో ఆ ప్రాంతమంతా గందరగోళమైంది. ఆ యంత్రం రైలింగ్ ఇక కూలిపోవడం ఖాయం అనుకున్న సమయంలో ఒక వ్యక్తి సాహసం చేశాడు. అతను స్పిన్ యంత్రం బేసిమెంట్‌ను బలంగా పట్టుకున్నాడు. మిగతా ప్రేక్షకులు అందరూ కూడా అతన్ని అనుసరించి బేస్మెంట్ను పట్టుకోవడంతో రంగుల రాట్నం ఆగిపోయింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. రైడ్ మిషన్‌లో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది. సరదా కాస్త పీడకలగా మారిందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
నేడే ‘మృగశిర కార్తె’: ఆకాశాన్నంటిన ‘మీనం’ ధరలు
సాక్షి,యాదగిరిగుట్ట(నల్లగొండ): మృగశిర కార్తె వచ్చిందంటే సకల జనులకు ఊరట కలుగుతుంది. అప్పటివరకు గ్రీష్మతాపంతో అల్లాడుతున్న సర్వకోటి జీవాలు తొలకరి జల్లులతో ఉపశమనం పొందుతాయి. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు కాస్తాయి. అనంతరం మృగశిర కార్తె వస్తుంది. రుతుపవనాల రాకను మృగశిర కార్తె ఆహ్వానిస్తుంది. చంద్రుడు ఏ నక్షత్రంలో ప్రవేశిస్తే ఆ రాశి ప్రారంభం అవుతుంది. ఈ కార్తె ప్రజల్లో, రైతాంగంలో విశేష ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఈ రాశిలోనే నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి.అప్పటివరకు నిప్పులు చెలరేగిన భా నుడి కిరణాలు నల్లటి మేఘాల ప్రభావంతో చల్ల బడుతాయి. దీంతో తొలకరి జల్లులు పడగానే రైతులు దుక్కులు దున్ని పంటలు వేసేందుకు సిద్ధమవుతారు. దీనిని ఏరువాక సాగే కాలం అని కూడా అంటారు. నేటినుంచి కార్తె మొదలు.. మృగశిర కార్తె మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ కార్తె ప్రవేశం రోజు చేపలు తినడం అనాది నుంచి ఆనవాయితీగా వస్తున్నా.. దీని వెనుక ఆరోగ్య రహస్యం దాగి ఉంది. రోళ్లు పగిలే ఎండలను మోసుకొచ్చిన రోహిణి కార్తె ముగిసి.. ముంగిళ్లు చల్లబరిచే మృగశిర మొదలవనున్నది. ఈ కార్తెలో చల్లదనాన్ని తట్టుకునేందుకు శరీరంలో వేడి ఉండేందుకు ఎక్కువగా నాటుకోళ్లు, గుడ్లు, చికెన్, చేపలు, మటన్ అ«త్యధికంగా కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా ఇంగువ, బెల్లం ఉండలను కూడా మింగుతారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మృగశిరను వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున రైతులు సాగు పనులు ప్రారంభించడానికి అధిక ప్రా«ధాన్యత ఇస్తారు. కార్తె రోజున పంటలను ప్రారంభిస్తే పంటలకు ఈగ, దోమ పోటు పడదని రైతులు భావిస్తారు. చేపలు తినడం ఆనవాయితీ.. మృగశిర ప్రారంభం రోజు చేపలను తినడం ప్రజలు ఆచారంగా భా«విస్తారు. దీంతో మామూలు రోజుల కంటే ఈ రోజున చేపలు ఎక్కువగా అమ్ముతుండడంతో అధికంగా గిరాకీ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాపారులు అదే స్థాయిలో వాటిని వివిధ ప్రాంతాల్లో చెరువుల నుంచి తీసుకొస్తారు. మృగశిర కార్తెకు ఒక్క రోజు ముందుగానే అంటే సోమవారం కొర్రమేను చేప రూ.550 నుంచి రూ.600కిలో అమ్మారు. మామూలు రోజులు అయితే రూ.450కి అమ్ముతారు. ఈ ధర మృగశిర కార్తెరోజు ( మంగళవారం) మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక మిగతా చేపలు కిలోకు రూ.200నుంచి రూ.350 వరకు పలుకుతుంది. మార్కెట్లో చేపలు ఒక్కోక రకాన్ని ఒక్కో ధరకు అమ్ముతున్నారు. చేపల దారిలోనే చికెన్, మటన్ ధరలు ఉన్నాయి. చేపల్లో పోషక విలువలు.. చేపల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. శరీరానికి మేలు చేసే ఎన్నో గుణాలు ఇందులో ఉన్నాయి. కాల్షియం, పాస్పరస్, ఐరన్, కాపర్, మెగ్నిషియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. వీటితో పాటు రుచిని పెంచే లైసిన్, మిథియోనిన్ వంటి అమైనో అమ్లాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. చేపలు తినడం ద్వారా కంటి చూపుని మెరుగు పరుచుకోవచ్చునని చెబుతున్నారు. జ్ఞాపకశక్తి మెరుగు అవుతుందని, మృగశిర కార్తె రోజు చేపలు తినడంతో ఆరోగ్యానికి అన్ని విధాలుగా మేలు జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. చేపలు ఎక్కువగా తినడంతో గుండె సమస్యలు ఉన్న వారికి మంచిదని వైద్యులు సైతం పేర్కొంటున్నారు. ఇక గర్భిణులు, పిల్లల తల్లులు వీటిని తినడంతో పాలవృద్ధితో పాటు వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి, నాడీ వ్యవస్థ మంచి పనిచేస్తోందని పలువురు చెబుతున్నారు. చదవండి: Telangana: కేబినెట్ సమావేశంపై అన్ని వర్గాల్లో ఉత్కంఠ -
నెల్లూరులో కోలాహలంగా రొట్టెల పండుగ
-
ఎయిర్‌పోర్టుకు సంక్రాంతి సందడి
పెరుగుతున్న విమాన ప్రయాణికులు టికెట్ ధరలు పైపైకి మధురపూడి (రాజానగరం) : రాజమహేంద్రవరం విమానాశ్రయానికి సంక్రాంతి సందడి వచ్చింది. శుక్రవారం విమాన ప్రయాణికుల రద్దీ ఏర్పడింది. సుదూర ప్రాంతాల నుంచి స్వగ్రామానికి చేరుతున్న ప్రయాణికుల కారణంగా రద్దీ ఏర్పడింది. కొంతకాలంగా విమాన ప్రయాణికుల సంఖ్య తగ్గుతుండగా సంక్రాంతి నేపథ్యంలో ఒక్కసారిగా పెరిగింది. శుక్రవారం అన్ని విమాన సర్వీసులలో 60–70 మంది చొప్పున ప్రయాణించారు. పండగ రద్దీ రాజమహేంద్రవరం విమానాశ్రయానికి రోజూ ఐదు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. జెట్‌ఎయిర్‌వేస్ సర్వీసులు 2, స్పైస్‌జెట్ 2, ట్రూజెట్ 1 సర్వీసు నడుస్తున్నాయి. హైదరాబాద్ వైపు నుంచి జిల్లాకు, ఇక్కడి నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూర్‌లకు తిరిగి వెళ్తున్న విమానా లున్నాయి. వీటి రాకపోకలు ఉదయం 11 నుంచి సాయంత్రం 4–40 గంటల వరకూ జరుగుతాయి. పెరుగుతున్న టికెట్ ధరలు సంక్రాంతి పండగ సందర్భంగా విమాన సర్వీసుల టికెట్ ధరలు రూ.3,000 నుంచి రూ.6,000 వరకూ పెరిగాయి. పండగకు ముందు రూ.2,500 నుంచి రూ.3,500 ఉన్న టికెట్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఆ¯ŒSలై¯ŒS విక్రయాలతో వీటిని పెంచుతున్నారు. మొదటి 20 టికెట్లు ఒక ధర కాగా ఆ తర్వాత నుంచి ధరలను పెంచుతున్నారు. ఆలస్యంతో ఇబ్బంది శీతాకాలం వాతావరణం అనుకూలించక విమానాలు ఆలస్యం కావడం ప్రయాణికులకు ఇబ్బందిగా ఉంది. విమానం రద్దు, ఆలస్యాన్ని మందే ప్రకటించకపోవడంతో కూడా సమస్యలుత్పన్నం అవుతున్నాయి.