వాషింగ్టన్: సరదగా పిల్లలతో గడపడానికి ఓ పార్కుకో, ఏదైనా ఎగ్జిబిషన్ కో వెళ్తే పిల్లలను ముందుగా ఆకర్షించేది రంగుల రాట్నం (స్పిన్నర్). ఎవరైనా రంగుల రాట్నం ఎక్కడానికి ఇష్టపడతారు. అంతెత్తున పైకి తీసుకెళ్లి.. కిందకు తీసుకురావడంతో పిల్లలు, పెద్దలైనా మురిసిపోతారు. మరి కొందరేమో సరదాగా రంగుల రాట్నం ఎక్కినా.. ఎక్కడ కిందపడిపోతామో అని భయంతో వణికిపోతారు.
ఇక నిజంగానే రంగుల రాట్నంలో ఏదో లోపం తలెత్తి అది లెక్కలేకుండా తిరుగుతుంటే! వామ్మో అది ఊహిస్తేనే కష్టం కదా. తాజాగా అమెరికాలోని మిచిగాన్‌లో జరిగిన నేషనల్ చెర్రీ ఫెస్టివల్లో అటువంటి ఘటన వెలుగుచూసింది. మ్యాజిక్ కార్పెట్ రైడ్ మధ్యలో స్పిన్ యంత్రం నియంత్రణ కోల్పోయింది. గుడ్రంగా తిరుగుతూ రంగుల రాట్నంలో ఉన్నవారు.. కింద ఉన్న వారి బంధువులు, కుటుంబ సభ్యులను బెంబేలెత్తించింది. వారి అరుపులతో ఆ ప్రాంతమంతా గందరగోళమైంది.
ఆ యంత్రం రైలింగ్ ఇక కూలిపోవడం ఖాయం అనుకున్న సమయంలో ఒక వ్యక్తి సాహసం చేశాడు. అతను స్పిన్ యంత్రం బేసిమెంట్‌ను బలంగా పట్టుకున్నాడు. మిగతా ప్రేక్షకులు అందరూ కూడా అతన్ని అనుసరించి బేస్‌మెంట్‌ను పట్టుకోవడంతో రంగుల రాట్నం ఆగిపోయింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. రైడ్ మిషన్‌లో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది. సరదా కాస్త పీడకలగా మారిందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment