
'సినిమాలు క్లాస్ రూంలా ఉండాలి'
ముంబై: సినిమాలు కూడా తరగతి గదుల్లా విజ్ఞానాన్ని అందించేవిగా ఉండాలంటున్నారు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు శ్యామ్ బెనెగల్. ఆయన మంగళవారం ఆరో నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సినిమాల్లో వినోదంతోపాటు సమాచారం, విజ్ఞానం ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పారు.
దర్శకులు సినిమా తీసేటప్పుడు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. గ్రామీణ స్థాయి వరకూ సమాచారం చేరవేయడంలో సినిమా ఎంతగానో దోహదపడుతుందన్నారు. స్వాతంత్య్రం వచ్చి 68 ఏళ్లు గడిచినా దేశంలో 67 శాతం మంది అజ్ఞానులుగా, చదువు లేనివారిగా ఉండటం సిగ్గుచేటన్నారు.