ఫెన్సింగ్‌లో కర్నూలుకు ఓవరాల్ చాంపియన్‌షిప్
ఫెన్సింగ్‌లో కర్నూలుకు ఓవరాల్ చాంపియన్‌షిప్
Published Tue, Oct 4 2016 10:30 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
నంద్యాల: నెల్లూరులో నిర్వహించిన 62వ రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో కర్నూలు జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుందని ఏపీ ఫెన్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్యాంసుందర్‌లాల్ తెలిపారు. స్థానిక పద్మావతినగర్ స్టేడియంలో మంగళవారం పతకాలు సాధించిన క్రీడాకారులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలుర విభాగంలో అనిల్‌కుమార్, (ఈపీ) లేకజ్ (ఫయిల్), అంకరాజు, మురళీకృష్ణ (సాబ్రా) బాలిక విభాగంలో సౌమ్య(ఈపీ), వైష్ణవి(ఫయిల్), ప్రసన్న(సాబ్రా) వ్యక్తిగత బంగారు పతకాలు సాధించారన్నారు. బృందాలుగా జరిగిన విభాగంలో సౌమ్య, సుచరిత, లలిత, బేబిప్రియ(ఈపీ), వైష్ణవి, సమన్విత, ప్రసన్న (ఫయిల్), లావణ్యరాయల్, శ్వేత, లక్ష్మి, మేరి(సాబ్రా)లకు, బాలుర విభాగంలో అనిల్‌కుమార్, నాగయ్య, వంశీకృష్ణ, సాయిశైలేంద్ర (ఈపీ), లేఖచ్, సమీర్, విజయ్‌కుమార్, సన్ని, సునీల్(ఫయిల్), అంకరాజు, మురళీకృష్ణ, బషీర్‌బాబు, హుసేన్‌వలి(సాబ్రా) విభాగాల్లో పసిడి పతకాలను సాధించారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఫెన్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మహేశ్వరరావు, స్కూల్ గేమ్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చలపతిరావు, కోచ్‌లు లక్ష్మణ్, రవీంద్రనాథ్, పూర్ణచంద్రప్రసాద్, రాఘవకార్తీక్ పాల్గొన్నారు.
Advertisement