ఫైల్ ఫొటో
న్యూఢిల్లీ: పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి అక్రమ చొరబాట్లను ఆపేందుకు కేంద్రం కొత్త ప్రణాళిక రచించింది. చొరబాట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఉక్కు కంచెలను ఏర్పాటు చేయనున్నామని అధికారులు శుక్రవారం తెలిపారు. దీని కోసం అస్సాంలోని సిల్చార్ వద్ద పైలెట్ ప్రాజెక్టుగా ఏడు కిలోమీటర్ల పొడవున కత్తెరించినా తెగని ఉక్కు కంచె నిర్మించి పరిశీలిస్తున్నారు. ఈ కంచెకు కిలోమీటరుకు రూ. 2 కోట్లు ఖర్చవుతోందని చెప్పారు. పంజాబ్‌లోని అమృత్‌సర్ వద్ద కూడా 60 కిలోమీటర్ల సరిహద్దు వద్ద కూడా సింగిల్–రో ఉక్కు కంచెను నిర్మించబోతున్నారు.
సీడీఎస్‌కు సాయంగా పలువురు అధికారుల నియామకం
న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ నేతృత్వంలో కొత్తగా రూపొందించిన సైనిక వ్యవహారాల విభాగంలో ఇద్దరు జాయింట్ సెక్రటరీలు, 13 మంది డిప్యూటీ సెక్రటరీలు, 25 మంది కార్యదర్శి స్థాయి కింది సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. త్రివిధ దళాల సమాహారమైన సీడీఎస్‌ను కలసికట్టుగా ముందుకు తీసుకెళ్లేందుకు ఈ నియామకాలు దోహదపడుతాయని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ నెల 1న దేశ తొలి త్రిదళాధిపతిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రక్షణ శాఖ అధికారులతో రావత్ వరుసగా భేటీ అవుతున్నారు. భవిష్యత్ రక్షణ సవాళ్లను ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా కేంద్రం సీడీఎస్‌ను ఏర్పాటు చేసింది. అత్యవసర సమయంలో త్రివిధ దళాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడంలో సీడీఎస్ ప్రముఖ పాత్ర పోషించనుంది. సీడీఎస్ బాధ్యతలతోపాటు త్రివిధ దళాలకు సంబంధించిన విషయాలపై రక్షణ మంత్రికి ప్రధాన సలహాదారుగానూ రావత్ వ్యవహరించున్నారు. (చదవండి: రాజకీయాలకు మేము దూరం)
Comments
Please login to add a commentAdd a comment