fencing of border
-
కంచె లొల్లి.. పాక్ సైన్యం-తాలిబన్ల మధ్య కాల్పులు
సరిహద్దు వివాదం పరిష్కారం అయ్యిందని ప్రకటించుకున్న కొన్నిరోజులకే పాక్ సైన్యం-తాలిబన్ల మధ్య భీకర కాల్పులు జరిగాయి. 2017 నుంచి పాకిస్థాన్, అఫ్గనిస్థాన్ ఇరు దేశాల మధ్య వేల కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ వివాదం తరచూ తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో డ్యూరండ్ లైన్ వెంట పాక్ సైన్యం, తాలిబన్ ఫోర్స్ మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో దాదాపు అర్థగంట పాటు ఈ కాల్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక మీడియా హౌజ్‌లతో పాటు ట్విటర్లోనూ ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఫెన్సింగ్ వద్ద తాలిబన్ ట్రూప్‌కు చెందిన వ్యక్తి కంచె తొలగిస్తుండగా .. ఇద్దరు పాక్ సైనికులు అడ్డుకున్నారని, వారిని ఆ వ్యక్తి కాల్చి చంపడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని సమాచారం. అయితే ఇరుపక్షాలు మాత్రం నష్టంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, కొన్ని గంటలకే వ్యవహారం సర్దుమణిగిందంటూ అఫ్గన్, పాక్ పక్షాల నుంచి ప్రకటన వెలువడింది. ఇక స్థానిక మీడియాలో కథనాలు మాత్రం విరుద్ధంగా ఉంటున్నాయి. మరోవైపు అఫ్గన్ సరిహద్దు వెంట 26 వేల కిలోమీటర్ల మేర కంచె పనుల్ని దాదాపు పూర్తి చేయగా.. తాలిబన్లు వైర్‌ను తెంచుకెళ్లి ఇనుప సామాన్ల స్టోర్లలో అమ్మేసుకుంటున్నారు. ఈ తీరుపైనా పాక్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. చదవండి: తాలిబన్ల అతి.. అఫ్గనిస్తాన్‌కు పాక్ షాక్ -
కంచె.. బలితీసుకుంది!
బెంగళూరు: ఏనుగులను కాపాడేందుకు వేసిన కంచె.. ఓ గజరాజు పాలిట శాపంగా మారింది. కర్ణాటకలోని నగర్‌హోళె జాతీయ పార్కులో ఈ విషాదం జరిగింది. ఓ ఊరిలోకొచ్చిన ఏనుగును స్థానికులు తరమడంతో కంచెను దాటబోయి ఇరుక్కుపోయింది. దీంతో తన బరువుకు ఊపిరాడక మృతి చెందింది. రైళ్లు ఢీకొని ఏనుగులు చనిపోకుండా ఉండే ందుకు రక్షణగా గతంలో రైలుపట్టాలకు ఇరువైపులా రూ.212 కోట్లతో ఈ కంచెను రైల్వేశాఖ నిర్మించింది. ఏనుగును జాతీయ పార్కులోని వీరహోసహళ్లి రేంజ్‌లోకి తరిమేందుకు జనం ప్రయత్నించారని అటవీ అధికారులు తెలిపారు. కంచెపై చిక్కుకోవడంతో తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించడంతోనే ఊపిరితిత్తుల్లో గాయమై ఏనుగు మరణించి ఉంటుందని అధికారులు వివరించారు. -
మనం కంచె వేసుకుంటే.. చైనాకు నొప్పేంటి?
భారత్ - పాకిస్థాన్ వ్యవహారంలో వేలు పెట్టడాన్ని చైనా ఇంకా మానుకోవడం లేదు. పాకిస్థాన్‌తో ఉన్న సరిహద్దులను మనం మూసుకుంటే అది తప్పని ఆ దేశం అంటోంది. దానివల్ల భారత్-చైనా సంబంధాలు మరింత పాడవుతాయని చెప్పింది. భారతదేశం చాలా అహేతుకమైన నిర్ణయం తీసుకుంటోందని, ఉడీ ఉగ్రవాద దాడి తర్వాత దానిపై ఇంతవరకు దర్యాప్తు కూడా మరీ గట్టిగా ఏమీ జరగలేదని, అలాగే ఆ దాడి వెనుక పాక్ హస్తం ఉందనడానికి సాక్ష్యం కూడా ఏమీ లేదని షాంఘై అకాడమీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌కు చెందిన హు జియాంగ్ వ్యాఖ్యానించారు. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న మొత్తం 3.323 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును 2018 డిసెంబర్ నాటికి పూర్తిగా మూసేస్తామంటూ భారత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిచంఆరు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య వాణిజ్యం అంతంతమాత్రంగా ఉందని, ఇప్పుడు సరిహద్దులను మూసేస్తే ఇది మరింత ప్రభావితం అవుతుందని ఆయన చెప్పారు. సరిహద్దులను మూసేయడం వల్ల ఇరుదేశాల మధ్య శాంతి ప్రయత్నాలకు మరింత విఘాగం కలుగుతుందని షాంఘై మునిసిపల్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లోని ఇన్స్టిట్యూట్ ఫర్ సదరన్ అండ్ సెంట్రల్ ఏషియన్ స్టడీస్ డైరెక్టర్ వాంగ్ డెహువా వ్యాఖ్యానించారు. భారత నిర్ణయాన్ని బట్టి చూస్తే ఇప్పటికే పరోక్ష యుద్ధం ఉందన్న జాడలు కనిపిస్తున్నాయని, సరిహద్దు మూత వల్ల కశ్మీర్ వాసులలో మరింత విద్వేషభావాలు చెలరేగుతాయని అన్నారు. చైనాకు పాకిస్థాన్ ఎప్పటికీ వ్యూహాత్మక భాగస్వామి కాబట్టి, భారత దేశం తీసుకుంటున్న నిర్ణయం వల్ల భారత్ - చైనా - పాక్ సంబంధాలు మరింత సంక్లిష్టం అవుతాయని హు జియాంగ్ తెలిపారు. కశ్మీర్ వివాదానికి శాంతియుత పరిష్కారం కనుక్కుంటే అది చైనాకు కూడా మంచిది అవుతుందన్నారు. త్వరలో గోవాలో జరిగే బ్రిక్స్ సదస్సులో ప్రధాన నరేంద్రమోదీతో పాటు కలిసి పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ వస్తున్న నేపథ్యంలో ఈ తరహా వ్యాఖ్యలు రావడం గమనార్హం.