‘నన్ను ప్రత్యక్షంగా చూస్తే థ్రిల్లింగ్‌గా ఉందా.. తేడా కొడితే మాత్రం ఇంతే’ | Sri Lanka: Wild Elephant Attacking A Jeep Wins An Award | Sakshi
Sakshi News home page

‘నన్ను ప్రత్యక్షంగా చూస్తే థ్రిల్లింగ్‌గా ఉందా.. తేడా కొడితే మాత్రం ఇంతే’

Oct 30 2021 11:32 AM | Updated on Oct 30 2021 3:49 PM

Sri Lanka: Wild Elephant Attacking A Jeep Wins An Award - Sakshi

సఫారీలో జంతువులను ప్రత్యక్షంగా చూడటం చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. తేడా కొడితే మాత్రం ఇలా గుండెకాయ నోట్లోకి జారినట్లు కూడా ఉంటుంది. అలాంటి ఘటనే శ్రీలంకలోని యాలా నేషనల్‌ పార్కులో చోటుచేసుకుంది. పార్క్‌లో జనంతో నిండిన జీప్‌పై అడవి ఏనుగు దాడి చేయడానికి ప్రయత్నించింది. ‘ఇది నా ఏరియా.. మీరేందుకు వచ్చారు’ అనేలా వారిపై విరుచుకుపడింది.
చదవండి: కొండచిలువతో సీతకోక చిలుక ఏం చెబుతుందో చూడండి!

అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని ఈ చిత్రాన్ని క్లిక్‌మనిపించిన ఫోటోగ్రాఫర్‌ సెర్గీ తెలిపారు. సియనా ఇంటర్నేషనల్‌ ఫోటో పురస్కారాల్లో జర్నీస్‌ అండ్‌ అడ్వంచర్స్‌ కేటగిరీలో ఈ చిత్రం మెదట బహుమతిని గెలుచుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement