
మనకు తెలిసిన జాతీయ పార్కు అంటే ఏ యాభై, అరవై చదరపు కిలోమీటర్ల మేర పరుచుకుని ఉంటుంది. అందులో బోలెడు చెట్లు.. జంతువులు, పక్షులతో ఆహ్లాదంగా.. సందడిగా ఉంటుంది. అయితే ఈ ఫొటోలో ఉన్న చెట్టును చూశారా.. ఇది అమెరికా అలస్కాలోని అల్యూటియన్ దీవుల్లో ఉంది.
దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఓ జాతీయ వనం. అమెరికాలోని అతి చిన్న వనం ఇది. ఒకే చెట్టులా ఉన్న ఈ వనానికి ఓ చరిత్ర కూడా ఉంది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా సైనికులు 33 పైన్ చెట్లను నాటారు. అక్కడి భయంకరమైన చలి వాతావరణానికి ఆ చెట్లు తట్టుకోలేక ఒకదానికి ఒకటి పెనవేసుకుని మరుగుజ్జు చెట్టు మాదిరిగా మిగిలిపోయాయి. 1960లలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఈ చెట్టు ముందు ‘అడక్ జాతీయ వనం’ అనే బోర్డు పెట్టారు. అప్పటినుంచి దాన్ని జాతీయ వనంగా అక్కడి జనం పిలుచుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment