
ఎప్పుడు షూటింగ్‌లతో బిజీగా ఉండే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాస్తా విరామం ఇచ్చారు. ఆయన ప్రస్తుతం వ్యాకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. రాజస్థాన్‌లో ఫ్యామిలీతో కలిసి పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. ఈ వ్యాకేషన్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను అల్లు స్నేహారెడ్డి తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. అలాగే ఓ నేషనల్ పార్క్‌లో అల్లు అర్జున్ పులిని ఫోటో తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
కాగా.. పుష్ప సినిమా సూపర్ హిట్ కావడంతో మేకర్స్ సీక్వెల్ రూపొందిస్తున్నారు. ఇటీవలే వైజాగ్‌లో షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నారు బన్నీ. సినిమా షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ గ్యాప్ దొరికినప్పుడల్లా ఫ్యామిలీకి సమయం కేటాయిస్తున్నారు. రణథంబోర్ నేషనల్ పార్కులో దూరంగా ఉన్న పులిని తన పిల్లలకు చూపిస్తూ కనిపించాడు బన్నీ. అయితే పుష్ప-2 షూటింగ్‌లో మళ్లీ త్వరలోనే మళ్లీ బన్నీ జాయిన్ అవ్వాల్సి ఉంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.
Allu Arjun Did Tiger Safari At Ranthambhore On Friday Morning 🔥😍😍@alluarjun #AlluArjun #PushpaTheRule pic.twitter.com/aHOc3wRF0Y
— KA̶A̶rthikᴾᵘˢʰᵖᵃᵀʰᵉᴿᵘˡᵉ 🪓 (@KarthikAADHF__) February 28, 2023
Comments
Please login to add a commentAdd a comment