Allu Arjun On Vacation With His Family In Dubai - Sakshi
Sakshi News home page

Allu Arjun: దుబాయ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న బన్నీ

Published Sat, Sep 25 2021 11:49 AM | Last Updated on Sat, Sep 25 2021 2:25 PM

Allu Arjun on Vacation with Family in Dubai - Sakshi

టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోల్లో అల్లు అర్జున్‌ ఒకరు. ఆయన ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. మొదట ఒకే సినిమాగా చేద్దామనుకున్న, కథ లెంత్‌ దృష్ట్యా రెండు పార్టులుగా తీస్తున్నారు. అయితే మొదటి పార్టైన ‘పుష్ప: ది రైజ్‌’ ఈ ఏడాది చివరికి విడుదల చేసేలా మూవీ టీం ప్లాన్‌ చేస్తుంది. అందుకే షూటింగ్‌ త్వరగా పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. 

అయితే ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎంత బిజీగా ఉన్న వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంతో బాగా బ్యాలెన్స్‌ చేస్తుంటాడు బన్నీ. టైట్‌ షెడ్యూల్‌ ఉన్న ఈ తరుణంలోనూ షూటింగ్‌కి గ్యాప్‌ ఇచ్చి కుటుంబంతో కలిపి దుబాయ్‌లో వేకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాడని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ పిక్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఆ పిక్‌లో స్టైలిష్‌ స్టార్‌ టోటల్‌ బ్లాక్‌ డ్రెస్‌లో ఉండగా, వెనుక చీకట్లో మెరుస్తున్న దుబాయ్‌ సిటీ ఆకట్టుకుంటోంది.

అయితే ఆర్య, ఆర్య 2 హిట్‌ సినిమాల తర్వాత అల్లు అర్జున్‌, సుకుమార్‌ కలయికలో వస్తున్నా మూడో మూవీ కావడంతో ‘పుష్ప’పై భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇంతకుముందు ‘అల వైకుంఠపురంలో’తో బన్నీ,  ‘రంగస్థలం’తో సుకుమార్‌ మంచి హిట్లను సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. కాగా ఈ సినిమా అనంతరం స్టైలిష్‌ స్టార్‌  ‘ఐకాన్‌’ చేయ‌నున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement