టాలీవుడ్ గామా అవార్డ్స్‌.. హనుమాన్ హీరోకు అవార్డ్..! | Tollywood Gama Award Winners List Goes Viral | Sakshi
Sakshi News home page

Tollywood Gama Awards: టాలీవుడ్ గామా అవార్డ్స్‌.. విన్నర్స్ వీళ్లే..!

Published Thu, Mar 7 2024 6:53 PM | Last Updated on Thu, Mar 7 2024 7:06 PM

Tollywood Gama Award Winners List Goes Viral  - Sakshi

తెలుగు సినిమా అవార్డ్స్‌ వేడుక ఘనంగా నిర్వహించారు. గామా పేరిట అందిస్తున్న అవార్డుల నాలుగో ఎడిషన్‌ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. దుబాయ్‌ వేదికగా జరిగిన వేడుకల్లో టాలీవుడ్ సినీ తారలు హాజరై సందడి చేశారు. 2021, 2022, 2023 సంవత్సరాలకు సంబంధించి వివిధ కేటగిరిల్లో ఈ అవార్డులను అందింటారు. ఈ వేడుకల్లో గామా అవార్డ్స్ ఛైర్మన్ కేసరి త్రిమూర్తులుతో పాటు మరికొందరు ముఖ్య అతిథులు విన్నర్స్‌కు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు నేహాశెట్టి, ఫరియా అబ్దుల్లా, డింపుల్ హయాతి, దక్షా నగార్కర్, ఆషికా రంగనాథ్‌ తమ డ్యాన్స్‌లతో ప్రేక్షకులను అలరించారు.

 2021 గామా అవార్డ్ విజేతలు

  •     ఉత్తమ నటుడు - అల్లు అర్జున్ (పుష్ప)
  •     ఉత్తమ నటి - ఫరియా అబ్దుల్లా (జాతి రత్నాలు)
  •     ఉత్తమ దర్శకుడు- సుకుమార్  (పుష్ప)
  •     బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్  - దక్షా నగర్కర్ (జాంబి రెడ్డి)
  •     ఉత్తమ సంగీత దర్శకుడు - దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప)
  •     అత్యంత ప్రజాదరణ పొందిన పాట- నీలి నీలి ఆకాశం (అనూప్ రూబెన్స్)
  •     ఉత్తమ గాయకుడు- ధనుంజయ్ (నా మది నీదే)
  •     ఉత్తమ గాయని  - ఎంఎల్ శృతి (అడిగా అడిగా)
  •     గామా బెస్ట్ పాపులర్ సాంగ్  - మౌనిక యాదవ్ (సామి  నా సామి - పుష్ప)
  •     మూవీ ఆఫ్ ది ఇయర్ - పుష్ప (మైత్రి మూవీ మేకర్స్ - యలమంచిలి రవి, నవీన్ యెర్నేని)

    2022 గామా అవార్డ్ విజేతలు

  •     ఉత్తమ నటుడు - నిఖిల్ (కార్తికేయ 2)
  •     ఉత్తమ నటి - మృణాల్ ఠాకూర్ (సీతా రామం)
  •     బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్- డింపుల్ హయతి (ఖిలాడి)
  •     మూవీ ఆఫ్ ది ఇయర్ - సీతా రామం (వైజయంతి మూవీస్)
  •     ఉత్తమ దర్శకుడు  - హను రాఘవపూడి (సీతా రామం)
  •     గామా జ్యూరీ ఉత్తమ నటుడు  - విశ్వక్ సేన్ (అశోక వనంలో అర్జున కళ్యాణం)
  •     ఉత్తమ సంగీత దర్శకుడు - ఎస్ఎస్ తమన్ (భీమ్లా నాయక్)
  •     ఉత్తమ ఆల్బమ్ - సీతారామం (విశాల్ చంద్రశేఖర్)
  •     ఉత్తమ గాయకుడు- అనురాగ్ కులకర్ణి (సిరివెన్నెల... శ్యామ్ సింగరాయ్)
  •     ఉత్తమ గాయని - హారిక నారాయణ (లాహే లాహే... ఆచార్య)

   2023 గామా అవార్డుల విజేతలు

  •     ఉత్తమ నటుడు - ఆనంద్ దేవరకొండ (బేబీ)
  •     ఉత్తమ నటి - సంయుక్త (విరూపాక్ష)
  •     బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ - ఆషికా రంగనాథ్ (అమిగోస్, నా సామి రంగ)
  •     బెస్ట్ ట్రెండింగ్ యాక్టర్ - తేజ సజ్జా (హను-మాన్)
  •     మూవీ ఆఫ్ ది ఇయర్- బ్రో (పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ - టీజీ విశ్వప్రసాద్)
  •     ఉత్తమ దర్శకుడు  - బాబీ (వాల్తేరు వీరయ్య)
  •     గామా జ్యూరీ ఉత్తమ నటుడు - సందీప్ కిషన్ (మైఖేల్)
  •     ఉత్తమ విలక్షణ నటుడు - మురళీ శర్మ

  పలు కేటగిరీల్లో అవార్డులు

  •     గామా లెజెండ్రీ సంగీత దర్శకుడు - డాక్టర్ కోటి సాలూరి (40 ఇయర్స్ ఆఫ్ మ్యూజికల్ జర్నీ)
  •     గామా స్పెషల్ జ్యూరీ అవార్డు - ఎంఎం శ్రీలేఖ (25 ఇయర్స్ ఆఫ్ మ్యూజికల్ జర్నీ)
  •     గామా గౌరవ్ సత్కర్ - చంద్రబోస్ (ఆస్కార్ విన్నింగ్ ఇండియన్ లిరిసిస్ట్)
  •     ఉత్తమ సంగీత దర్శకుడు - హేషమ్ అబ్దుల్ వాహాబ్ (ఖుషి)
  •     ఉత్తమ గేయ రచయిత  - కాసర్ల శ్యామ్ (చంకీలా అంగీ లేసి... దసరా సినిమా)
  •     అత్యంత ప్రజాదరణ పొందిన పాట - పూనకాలు లోడింగ్ (దేవి శ్రీ ప్రసాద్)
  •     గామా మూవీ ఆఫ్ ది డెకేడ్ - ఆర్ఆర్ఆర్ (డీవీవీ దానయ్య నిర్మాణం)
  •     గామా మోస్ట్ ట్రెండింగ్ సాంగ్ - నక్కిలీసు గొలుసు (రఘు కుంచె)
  •     ఉత్తమ గాయకుడు- రాహుల్ సిప్లిగంజ్ (ధూమ్ దాం - దసరా)
  •     ఉత్తమ గాయని - చిన్మయి (ఆరాధ్య - ఖుషి)
  •     గామా గద్దర్ మెమోరియల్ అవార్డు - జానపద గాయకుడు ‘నల్లగొండ గద్దర్’ నరసన్న

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement