Allu Arjun And Sneha Reddy Captures Spotted At Mumbai Airport Return From Europe Vacation, Video Viral - Sakshi
Sakshi News home page

Allu Arjun And Sneha: ఎయిర్‌పోర్ట్‌లో బన్నీ- స్నేహా.. సోషల్ మీడియాలో వైరల్!

Published Wed, Jun 7 2023 5:17 PM | Last Updated on Wed, Jun 7 2023 6:23 PM

Allu Arjun and Sneha Captures At Mumbai Airport return from Europe vacation - Sakshi

టాలీవుడ్‌ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్‌ అల్లు అర్జున్ - స్నేహారెడ్డి జంట  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జంట ఎక్కడికెళ్లినా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో టచ్‌లో ఉంటారు.  ఇక  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాస్త విరామం దొరికితే చాలు విదేశాల్లో వాలిపోతుంటారు. ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి యూరప్‌ ట్రిప్ వెళ్లిన బన్నీ తాజాగా ఇండియాకు తిరిగొచ్చారు. తన భార్య స్నేహా రెడ్డితో కలిసి ముంబయి విమానాశ్రయంలో కనిపించారు. 

(ఇది చదవండి: నాలుగున్నరేళ్లుగా నటుడితో సహజీవనం.. మీరిక పెళ్లి చేసుకోరా?)

టాలీవుడ్ జంట ఎయిర్‌పోర్ట్‌లో స్పెషల్ లుక్‌లో కనిపించారు. వీరిద్దరిని చూసిన నెటిజన్స్ స్టైలిష్ కపుల్ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.  కాగా.. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న పుష్ప- 2: ది రూల్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తోంది. పుష్ప పార్ట్ 1 సూపర్‌ హిట్ కావడంతో ఈ చిత్రంలో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే పుష్ప-2 షూటింగ్‌లో బన్నీ జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది.

(ఇది చదవండి: ఎన్టీఆర్‌ కోసం ఎవరూ ఊహించని హీరోయిన్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement