వెకేషన్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేసిన బన్నీ.. వీడియో వైరల్! | Allu Arjun caught enjoying the magic of Tomorrowland in Europe - Sakshi
Sakshi News home page

Allu Arjun: వెకేషన్‌లో డ్యాన్స్ చేసిన బన్నీ.. వీడియో వైరల్!

Published Tue, Aug 22 2023 4:08 PM | Last Updated on Tue, Aug 22 2023 4:18 PM

Allu Arjun caught enjoying the magic of Tomorrowland in Europe - Sakshi

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే షూటింగ్‌ చివరిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. పుష్ప పార్ట్-1 బ్లాక్ బస్టర్‌గా  కావడంతో ఈ మూవీపై సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎర్రచందన స్మగ్లింగ్ నేపథ్యంతో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ఎస్పీగా భన్వ‌ర్‌ సింగ్ షెకావ‌త్‌గా కనిపించిన ఫహాద్ ఫాజిల్ నటన మరింత ఆసక్తిగా ఉండనున్నట్లు తెలుస్తోంది. 

(ఇది చదవండి: స్టార్‌ హీరోతో ఛాన్స్ కొట్టేసిన సీతారామం బ్యూటీ..!)

అయితే గతనెలలో షూటింగ్‌కు కాస్తా గ్యాప్ ఇచ్చిన బన్నీ వెకేషన్‌ కోసం విదేశాలకు వెళ్లారు. యూరప్‌లో జరిగే అతిపెద్ద అంతర్జాతీయ సంగీత ఉత్సవం టుమారో ల్యాండ్‌కు అల్లు అర్జున్ హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అక్కడే అందరి మధ్యలో డ్యాన్స్ చేస్తూ చిల్ అవుతూ కనిపించారు. దీంతో కొంతమంది అభిమానులు బన్నీతో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే ఈ వేడుక జూలై చివర్లో జరిగినట్లు తెలుస్తోంది.  

కాగా.. అల్లు అర్జున్  బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప సీక్వెల్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై, టీజర్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచాయి. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో నటించనున్నారు. 

(ఇది చదవండి: ఫోటోపై రియాక్ట్‌ అయిన రేణు దేశాయ్‌.. వెంటనే తొలగించేసిన రాఘవేంద్ర రావు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement