
టాంజానియాలోని సెరెంగిటి నేషనల్ పార్కులో తీసినదీ చిత్రం.. దీన్ని కెనడాకు చెందిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ జార్జ్ హార్ట్ తీశారు. ‘ఇలాంటి అరుదైన చిత్రాన్ని క్లిక్‌మనిపించడం నా అదృష్టమే. ఈ జంటను నేను ముందు నుంచీ గమనిస్తూ ఉన్నాను. ఏదో విషయంపై సింహం సివంగిపై గర్జించింది.
అంతే.. వెంటనే సివంగి ఇదిగో ఇలా రివర్స్ అటాక్ ఇచ్చింది. దీంతో ఆ తీవ్రతను తట్టుకోలేక చివరికి సింహం తన ముఖాన్ని చేతుల్లో దాచుకోవాల్సి వచ్చింది. సింహం అడవికి రాజు అయిండొచ్చు. కానీ ఇంట్లో బాస్ ఎవరన్నది ఈ ఫొటో తెలుపుతోంది. ఈ చిత్రాన్ని చూసినవారి ముఖాలపై నవ్వులే నవ్వులు’అని జార్జ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment