ఫెన్సింగ్‌ దాటబోయి.. ఏనుగు మృతి | Elephant dies after getting stuck in fence in Nagarhole National Park | Sakshi
Sakshi News home page

ఫెన్సింగ్‌ దాటబోయి.. ఏనుగు మృతి

Published Sat, Dec 15 2018 7:02 PM | Last Updated on Sat, Dec 15 2018 7:04 PM

Elephant dies after getting stuck in fence in Nagarhole National Park - Sakshi

సాక్షి, బెంగళూరు : ప్రజల రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న ఫెన్సింగ్‌ను దాటబోయి 42 ఏళ్ల వయసున్న ఓ ఏనుగు మృతిచెందింది. ఈ సంఘటన కర్నాటకలోని నాగర్‌హోల్‌ నేషనల్‌ పార్క్‌లో చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి అడవిలో నుంచి బయటకు వచ్చిన ఏనుగు పంటపొలాల్లో సంచరించి తిరిగి వీరాహోసహల్లీ రేంజ్‌లోకి వెలుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే ఫెన్స్‌ దాటే సమయంలో ఏనుగు మధ్యలోనే ఇరుక్కుని చాలా సమయం కొట్టుమిట్టాడినట్టు తెలుస్తోంది. ఇదే విధంగా నాగర్‌హోల్‌ జాతీయ పార్క్‌లో గత నవంబర్‌లో కూడా ఓ ఏనుగు మృతిచెందింది. ఎన్నో ఏళ్లుగా ఏనుగులు సంచరించే ప్రాంతాలనే మానవులు ఆక్రమిస్తూ వాటి మార్గాల్లో ఫేన్సింగ్‌లు నిర్మించడమేంటని జంతుప్రేమికులు మండిపడుతున్నారు. 

2015లో కర్ణాటక ప్రభుత్వం ఈ ఫెన్సింగ్‌ ప్రాజెక్టును ప్రారంభించింది. భారీ రైల్వే పోల్‌ల సహాయంతో ఈ నిర్మాణాలను చేపట్టారు. మొదటి దశలో భాగంగా నాగర్‌హోల్‌ జాతీయ పార్క్‌ చుట్టుపక్కల మానవ ఆవాసాలున్న చోట మొత్తం 33 కిలోమీటర్ల మేర ఈ ఫేన్సింగ్‌లను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు పనులు ఇంకా కొనసాగుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement