హైదరాబాద్ నగరానికి కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ ఉద్యానవనం(కేబీఆర్ పార్కు) ప్రకృతి మణిహారంగా ఉంది. ఈ ఉద్యానవనం 352 ఎకరాల విస్తీర్ణంలో పచ్చని వృక్షజాలం నడుమ వివిధ రకాల జంతుజాలలతో విస్తరించి ఉంది. ఇది రెగ్యులర్ వాకర్స్, రన్నర్‌లు, ఫిట్‌నెస్ ఔత్సాహికులు, కుటుంబాలు, తదితర వర్గాల ప్రజలను ఆకర్షిస్తుంది, ఇది అనేక నెమళ్లకు స్వర్గధామంగా ఉంటుంది. అంతేగాదు నెమళ్లు నడిచేవారిని వాటి చేష్టలతో ఆకర్షిస్తాయి.
ఈ పార్కులో నెమళ్ళు, 133 జాతుల పక్షులు, 20 జాతుల సీతాకోకచిలుకలు గుడ్లగూబ, పిట్టలు, పాట్రిడ్జ్‌లు, రస్సెల్ వైపర్, నాగుపాము, కొండచిలువ, కుందేళ్ళు, పందికొక్కులు, అడవి పిల్లులు, పాంగోలిన్‌లు తదితర వన్యప్రాణులు ఉన్నాయి. వాటిని పరిరక్షించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 03, 1998లో దీనిన జాతీయ పార్క్‌గా ప్రకటిస్తూ నోటిఫై చేసింది. సాధారణంగా ఈ పార్కులో నడిచేవారు చాలా అరుదుగా సరీసృపాలు, కుందేళ్ళు, పందికొక్కులు పాంగోలిన్‌లను చూడటం కుదురుతుంది. ఐతే వాటిలో నెమళ్ళు అన్నింటికంటే స్నేహపూర్వకంగా ఉంటాయి. తరచుగా నడిచేవారితో పాటు నడుస్తూ చెట్ల పై నుంచి వంగి చూస్తూ పలకరిస్తున్నట్లుగా కనిపిస్తాయి.
నెమళ్ల సంఖ్య పెరగడానికి కారణం..
ఇటీవలి సర్వే ప్రకారం ఈ పార్క్‌లో 512 నెమళ్లు, పీహాన్‌లు ఉన్నాయి. అటవీ ప్రాంతం చాలావరకు పొదలతో సరైన ఫెన్సింగ్ రక్షణ ఉంటుంది,. పార్క్ ప్రారంభమైనప్పటి నుంచి నెమళ్లకు నిలయంగా ఉంది. నీటి వనరుల ఉనికి, వేటాడే జంతువులు లేకపోవడం నెమళ్ల సంఖ్య పెరగడానికి సహాయపడింది. ఆ పార్క్‌లో ఉదయం నెమళ్ల అరుపులు, కేకలతో ప్రతిధ్వనిస్తుంది. అయితే నెమళ్లను తాకడానికి లేదా ఆహారం తినిపించడానికి ఎవరికి అనుమతి ఉండదు.
అలాగే నెమలి ఈకలు కూడా తీయకూడదు. ఇక నెమలి సగటు జీవిత కాలం 10 నుంచి 25 సంవత్సారాల మధ్య ఉంటుంది. భారతీయ వన్యప్రాణి చట్టం 1972 ప్రకారం దీన్ని రక్షించడం జరుగుతోంది. అంతేగాదు ఈ నెమళ్లను ఈకలు, వాటి కొవ్వు, మాంసం కోసం వేటాడి పలు ఉదంతాలు కూడా ఉన్నాయి. భారతదేశం జాతీయ పక్షిగా, నెమలి భారతీయ కళల్లో, హిందూ మత సంస్కృతిలో భాగమవ్వడమే గాక హిందూ దేవుళ్ళకు సంబంధించినంత వరకు దానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వాటిలో అందరూ ఇష్టపడేవి, అత్యంత ప్రజాదరణ పొందిన నెమళ్ళు మగ నెమళ్ళు. వాటికి ఉండే నీలం, ఆకుపచ్చ రంగుల ఈకలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి.
పర్యాటకులను ఆకర్షించేలా స్క్రీనింగ్‌లో తోపాటు..
అటవీ శాఖ కూడా సెలవు దినాల్లో పర్యాటకులను ఆకర్షించేలా కార్యక్రమాలు, పిల్లలు ప్రకృతితో మమేకమయ్యేలా శిబిరాలు, స్క్రీనింగ్ ఏర్పాటు చేసి తన వంతుగా ఈ పార్క్ అభివృద్ధికి కృషి చేస్తోంది. ఆ పార్కులో నిర్వహించే కార్యక్రమంలో వివిధ రకాల పాము జాతులు, ఏడాదిలో వివిధ సమయాల్లో పార్కులో కనిపించే అనేక జాతుల పక్షులను ఎలా గుర్తించాలనే దాని తోపాటు పర్యావరణ పెంపుదలకు సంబంధించి చిన్న డాక్యుమెంటరీలను కూడా ప్రదర్శిస్తోంది. అంతేగాదు అటవీ శాఖ ప్రతి ఏటా డిసెంబర్ 3న పీకాక్ ఫెస్టివల్‌ని ఘనంగా నిర్వహిస్తోంది కూడా.
ఈమేరకు అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ..జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం, ఆవాసాలను సంరక్షించడం అనేది ఇతర జీవుల అవసరాలను తీర్చడం తోపాటు మనకు వాటి గురించి తెలుసుకునే అవగాహన సామర్థ్యం పెరుగుతుంది. నెమలి వంటి అందమైన జాతుల గురించి మనం మరింతగా తెలుసుకున్నప్పుడు.. అవి నివసించే అడవులు, పొదలను సంరక్షించాలనే ప్రేరణ పొందుతాం. ఇక పార్క్‌లోని నెమళ్లు, ఇతర వృక్షజాలం, జంతుజాలం రక్షించబడేలా చూడటం మా బాధ్యత. ప్రకృతిని పరిరక్షించడం, సామరస్యంతో సహజీవనం చేయడం తదితరాలు జీవవైవిధ్యాన్ని పెంచడంలో ఉపకరిస్తుందని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు.
నాలాగే క్యాప్చర్ చేయడం చూశా..
ఈ క్రమంలో ఆ పార్క్‌కి తరచుగా వచ్చే ఓ ఔత్సహిక వాకర్ మాట్లాడుతూ..నా అనేక మార్నింగ్ వాక్‌లలో నెమళ్లతో పాటు నడవడం, వర్షాకాలంలో వాటి అద్భుతమైన నృత్యాన్ని చూడడం నాకు చాలా ఇష్టం. ఒకసారి నెమలి పూర్తి నిడివి గల నృత్యం ఎనిమిది నిమిషాల పాటు కొనసాగింది.అలాగే నాలా నెమలి అద్భుతమైన ప్రదర్శనను చాలా మంది వ్యక్తులు ఫోన్లో కాప్చర్ చేయడం చూశాను. నెమలి కొద్ది దూరం ఎగరడం చూసి ఆనందించాను.
రచయిత : కవిత యార్లగడ్డ
ఫోటోగ్రాఫర్ : గరిమా భాటియా
(చదవండి: వెరైటీ వైద్యం.. ఆ రెండు పందులతో వాకింగ్ చేస్తే ఆనందం, ఆరోగ్యం!)
Comments
Please login to add a commentAdd a comment