Peacocks
-
నగరానికి మణిహారం ఆ పార్కు..అక్కడ అవే ప్రధాన ఆకర్షణ!
హైదరాబాద్ నగరానికి కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ ఉద్యానవనం(కేబీఆర్ పార్కు) ప్రకృతి మణిహారంగా ఉంది. ఈ ఉద్యానవనం 352 ఎకరాల విస్తీర్ణంలో పచ్చని వృక్షజాలం నడుమ వివిధ రకాల జంతుజాలలతో విస్తరించి ఉంది. ఇది రెగ్యులర్ వాకర్స్, రన్నర్లు, ఫిట్నెస్ ఔత్సాహికులు, కుటుంబాలు, తదితర వర్గాల ప్రజలను ఆకర్షిస్తుంది, ఇది అనేక నెమళ్లకు స్వర్గధామంగా ఉంటుంది. అంతేగాదు నెమళ్లు నడిచేవారిని వాటి చేష్టలతో ఆకర్షిస్తాయి. ఈ పార్కులో నెమళ్ళు, 133 జాతుల పక్షులు, 20 జాతుల సీతాకోకచిలుకలు గుడ్లగూబ, పిట్టలు, పాట్రిడ్జ్లు, రస్సెల్ వైపర్, నాగుపాము, కొండచిలువ, కుందేళ్ళు, పందికొక్కులు, అడవి పిల్లులు, పాంగోలిన్లు తదితర వన్యప్రాణులు ఉన్నాయి. వాటిని పరిరక్షించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 03, 1998లో దీనిన జాతీయ పార్క్‌గా ప్రకటిస్తూ నోటిఫై చేసింది. సాధారణంగా ఈ పార్కులో నడిచేవారు చాలా అరుదుగా సరీసృపాలు, కుందేళ్ళు, పందికొక్కులు పాంగోలిన్లను చూడటం కుదురుతుంది. ఐతే వాటిలో నెమళ్ళు అన్నింటికంటే స్నేహపూర్వకంగా ఉంటాయి. తరచుగా నడిచేవారితో పాటు నడుస్తూ చెట్ల పై నుంచి వంగి చూస్తూ పలకరిస్తున్నట్లుగా కనిపిస్తాయి. నెమళ్ల సంఖ్య పెరగడానికి కారణం.. ఇటీవలి సర్వే ప్రకారం ఈ పార్క్‌లో 512 నెమళ్లు, పీహాన్లు ఉన్నాయి. అటవీ ప్రాంతం చాలావరకు పొదలతో సరైన ఫెన్సింగ్ రక్షణ ఉంటుంది,. పార్క్ ప్రారంభమైనప్పటి నుంచి నెమళ్లకు నిలయంగా ఉంది. నీటి వనరుల ఉనికి, వేటాడే జంతువులు లేకపోవడం నెమళ్ల సంఖ్య పెరగడానికి సహాయపడింది. ఆ పార్క్‌లో ఉదయం నెమళ్ల అరుపులు, కేకలతో ప్రతిధ్వనిస్తుంది. అయితే నెమళ్లను తాకడానికి లేదా ఆహారం తినిపించడానికి ఎవరికి అనుమతి ఉండదు. అలాగే నెమలి ఈకలు కూడా తీయకూడదు. ఇక నెమలి సగటు జీవిత కాలం 10 నుంచి 25 సంవత్సారాల మధ్య ఉంటుంది. భారతీయ వన్యప్రాణి చట్టం 1972 ప్రకారం దీన్ని రక్షించడం జరుగుతోంది. అంతేగాదు ఈ నెమళ్లను ఈకలు, వాటి కొవ్వు, మాంసం కోసం వేటాడి పలు ఉదంతాలు కూడా ఉన్నాయి. భారతదేశం జాతీయ పక్షిగా, నెమలి భారతీయ కళల్లో, హిందూ మత సంస్కృతిలో భాగమవ్వడమే గాక హిందూ దేవుళ్ళకు సంబంధించినంత వరకు దానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వాటిలో అందరూ ఇష్టపడేవి, అత్యంత ప్రజాదరణ పొందిన నెమళ్ళు మగ నెమళ్ళు. వాటికి ఉండే నీలం, ఆకుపచ్చ రంగుల ఈకలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. పర్యాటకులను ఆకర్షించేలా స్క్రీనింగ్‌లో తోపాటు.. అటవీ శాఖ కూడా సెలవు దినాల్లో పర్యాటకులను ఆకర్షించేలా కార్యక్రమాలు, పిల్లలు ప్రకృతితో మమేకమయ్యేలా శిబిరాలు, స్క్రీనింగ్ ఏర్పాటు చేసి తన వంతుగా ఈ పార్క్ అభివృద్ధికి కృషి చేస్తోంది. ఆ పార్కులో నిర్వహించే కార్యక్రమంలో వివిధ రకాల పాము జాతులు, ఏడాదిలో వివిధ సమయాల్లో పార్కులో కనిపించే అనేక జాతుల పక్షులను ఎలా గుర్తించాలనే దాని తోపాటు పర్యావరణ పెంపుదలకు సంబంధించి చిన్న డాక్యుమెంటరీలను కూడా ప్రదర్శిస్తోంది. అంతేగాదు అటవీ శాఖ ప్రతి ఏటా డిసెంబర్ 3న పీకాక్ ఫెస్టివల్‌ని ఘనంగా నిర్వహిస్తోంది కూడా. ఈమేరకు అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ..జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం, ఆవాసాలను సంరక్షించడం అనేది ఇతర జీవుల అవసరాలను తీర్చడం తోపాటు మనకు వాటి గురించి తెలుసుకునే అవగాహన సామర్థ్యం పెరుగుతుంది. నెమలి వంటి అందమైన జాతుల గురించి మనం మరింతగా తెలుసుకున్నప్పుడు.. అవి నివసించే అడవులు, పొదలను సంరక్షించాలనే ప్రేరణ పొందుతాం. ఇక పార్క్‌లోని నెమళ్లు, ఇతర వృక్షజాలం, జంతుజాలం రక్షించబడేలా చూడటం మా బాధ్యత. ప్రకృతిని పరిరక్షించడం, సామరస్యంతో సహజీవనం చేయడం తదితరాలు జీవవైవిధ్యాన్ని పెంచడంలో ఉపకరిస్తుందని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. నాలాగే క్యాప్చర్ చేయడం చూశా.. ఈ క్రమంలో ఆ పార్క్‌కి తరచుగా వచ్చే ఓ ఔత్సహిక వాకర్ మాట్లాడుతూ..నా అనేక మార్నింగ్ వాక్‌లలో నెమళ్లతో పాటు నడవడం, వర్షాకాలంలో వాటి అద్భుతమైన నృత్యాన్ని చూడడం నాకు చాలా ఇష్టం. ఒకసారి నెమలి పూర్తి నిడివి గల నృత్యం ఎనిమిది నిమిషాల పాటు కొనసాగింది.అలాగే నాలా నెమలి అద్భుతమైన ప్రదర్శనను చాలా మంది వ్యక్తులు ఫోన్లో కాప్చర్ చేయడం చూశాను. నెమలి కొద్ది దూరం ఎగరడం చూసి ఆనందించాను. రచయిత : కవిత యార్లగడ్డ ఫోటోగ్రాఫర్ : గరిమా భాటియా (చదవండి: వెరైటీ వైద్యం.. ఆ రెండు పందులతో వాకింగ్ చేస్తే ఆనందం, ఆరోగ్యం!) -
జాతీయ పక్షి జాడేదీ?
అటవీప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ కనిపించే జాతీయ పక్షి నెమలి జాతి నానాటికి కనుమరుగవుతోంది. సుమారు 15 ఏళ్ల క్రితం వరకు ఏజన్సీలోని అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న ప్రధాన రహదారులు, పొలాలు, గ్రామశివారుల్లో కనిపించేవి. ఇప్పడు చూద్దామంటే మచ్చుకై నా వాటి జాడ కనిపించడం లేదు.ఎక్కడో లోతట్టు అటవీ ప్రాంతంలో తప్ప, మిగతా ప్రదేశాల్లో నెమలి అరుపులు వినిపించడం లేదు. వై.రామవరం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో నెమళ్ల జాడ కనిపించడం లేదు. ఒకప్పుడు 10 వేల వరకు వీటి సంతతి ఉండేది. ఇప్పుడు మూడు వేలకు లోపే ఉందని అటవీశాఖ అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇవి అంతరించి పోవడానికి వెనుక చాలా కారణాలు లేకపోలేదు. ► వేటగాళ్లు విచ్చలవిడిగా వేటాడుతున్నారు. కొంతమంది విద్యుత్ అమర్చడం వల్ల మృత్యువాతపడుతున్నాయి. ► పొలాలకు పిచికారీ చేసే క్రిమిసంహారక మందుల ప్రభావం కూడా నెమళ్ల సంతతిపై చూపుతోంది. ఆహార ధాన్యాలు తినేందుకు వస్తున్న నెమళ్లు పురుగు క్రిమిసంహారక మందుల అవశేషాలు కారణంగా మృత్యువాత పడుతున్నాయి. వై.రామవచం మండల సరిహద్దు గ్రామాలైన దబ్బపాలెం, నంగలకొండ, చాకిరేవులు తదితర గ్రామాల్లో పురుగుమందులు అవశేషాలున్న పంటలను తిని నెమళ్లు మృత్యువాత పడిన సందర్భాలు ఉన్నాయి. ► కొంతమంది అడవిలో నెమళ్లు పెట్టిన గుడ్లను, వాటి పిల్లలను తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ఈ కారణంగా కూడా వాటి సంతతి వృద్ధి చెందడం లేదు. ► మైదాన ప్రాంతానికి చెందిన వేటగాళ్లు ఏజెన్సీ ప్రాంతానికి వచ్చి ఆవుల సాయంతో నెమళ్లను వేటాడేవారు. ఆవుల చాటున మాటువేసి నెమళ్లను పట్టుకుని హతమార్చేవారు. లోతట్టు ప్రాంతాలైన జంగాలకోట, బురదకోట, రాములుకొండ పరిసరాల్లో ఈ రకం వేట ఎక్కువగా జరిగేది. అప్పటిలో మావోయిస్టులు ప్రభావం ఎక్కువగా ఉన్నందున అటవీసిబ్బంది ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు సాహసించలేకపోయేవారు. ► పోడు వ్యవసాయం పేరిట అడవులను విచ్చలవిడిగా నరికేస్తున్నారు. ఈ కారణంగా కూడా మరో ప్రాంతానికి వలసిపోయే అవకాశాలు ఉన్నాయి. ► వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అటవీశాఖ అధికారులు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా వాటి ప్రయోజనం కనిపించడం లేదు. విద్యుత్ కంచెకు ప్రాణాలు బలి నెమళ్లు, అడవి జంతువుల కోసం ఏర్పాటుచేస్తున్న విద్యుత్ కంచె ప్రాణనష్టం జరుగుతోంది. వై.రామవరం మండలంలో విద్యుత్ కంచెలో చిక్కుకుని గిరిజనులు మృత్యువాత పడిన సందర్భాలు ఉన్నాయి. పదేళ్లక్రితం చవిటిదిబ్బలు గ్రామానికి చెందిన కుర్రే వెంకటేశ్వర్లు, గిరిజనుడు విద్యుత్ కంచెకు బలయ్యాడు. గతేడాది మండలంలోని సింహాద్రిపాలేనికి చెందిన ఓ గిరిజనుడు మృత్యువాత పడ్డాడు. ప్రత్యేక విభాగం ఉన్నా.. వన్యప్రాణి సంరక్షణకు సంబంధించి అటవీశాఖలో ప్రత్యేక విభాగం ఉంది. రంపచోడవరం అటవీడివిజన్కు రాజమహేంద్రవరంలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. దీనికి డీఎఫ్‌వో స్థాయి అధికారి ఉంటారు. వన్యప్రాణుల వేటకు సంబంధించిన సమాచారం అందిస్తే తగిన రక్షణ చర్యలు చేపడతారు. చట్టపరమైన చర్యలుతీసుకుంటాం వన్యప్రాణులను వేటాడటం, హతమార్చడం చట్టరీత్యానేరం. ఎక్కడైనా వేటాడితే వెంటనే తమ సిబ్బందికి సమాచారం అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. వన్యప్రాణుల సంరక్షణ విభాగానికి తెలియజేస్తాం. – సత్యనారాయణ,డిప్యూటీ రేంజి అధికారి, వై.రామవరం -
నెమలీక.. ఆనంద జ్ఞాపిక
బంజారాహిల్స్: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో సహజ సిద్ధంగా నేలపై రాలిపోయిన నెమలీకలను చిన్నారులు తీసుకోవడానికి అభ్యంతరం చెప్పవద్దని మంత్రి కేటీఆర్ పార్కు నిర్వాహకులకు సూచించారు. అయిదేళ్ల బాలుడి తల్లి చేసిన ట్వీట్‌కు స్పందించిన ఆయన ఈ సూచన చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదివారం తన అయిదేళ్ల కొడుకు వేదాంతతో కలిసి ఓ మహిళ కేబీఆర్ పార్కుకు వెళ్లారు. ఆ సమయంలో చిన్నారి వేదాంత నెమలీకలను సేకరించి వాటితో ఆడుకుంటూ సంబరపడసాగాడు. ఈ దృశ్యం ఆమెకు ఎంతో ఆనందాన్నిచి్చంది. కానీ.. ఆ నెమలీకలను చిన్నారి వెంట తీసుకెళ్లడానికి పార్కు నిర్వాహకులు అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆమె మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. ఈ రోజు తన కొడుకుతో పాటు చాలా మంది పిల్లలు నెమలీకలు సేకరించి వాటితో సంబరపడుతూ వెళ్తుంటే నిర్వాహకులు అడ్డుకున్నారు అని ఆమె కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన కేటీఆర్.. పిల్లలు నెమలీకలను తీసుకోవడానికి పార్కు నిర్వాహకులు అనుమతి ఇవ్వాలని సూచించారు. చిన్నారుల ముఖంలో సంతోషం చూడాలన్నారు. ఆ తల్లి ట్వీట్ తనను కదిలించిందని పేర్కొన్నారు. (చదవండి: పాస్‌పార్ట్ కార్యాలయానికి గవర్నర్ తమిళ సై) -
రోడ్లపై నెమళ్ల షికారు: మిస్మరైజింగ్ వైరల్ వీడియో!!
Peacocks And Peahens Strolling In A Street In Dubai: ప్రకృతిలో అందమైన పక్షులు చూడాలంటే కచ్చితంగా గ్రామాలు లేదా పార్క్‌లు లేదా అడవుల్లోనో చూడగలం. అయినా అవి ఎప్పుడో గానీ సిటీల్లో కనువిందు చేయడం అత్యంత అరుదు. అలాంటిది ఏకంగా 50 నెమళ్లు రోడ్లపై షికారు చేస్తూ చూపురులకు కనువిందు కలిగిస్తున్నాయి. అసలు విషయంలోకెళ్తే....దుబాయ్‌లోని రోడ్లపై నెమళ్లు సందడి చేశాయి. ఒకటి రెండు కాదు ఏకంగా 50 నెమళ్లు సందడి చేశాయి. పైగా మనం ఆడ, మగ నెమళ్ల గుంపు ఒకేసారి చూడటం అత్యంత అరుదు. అలాంటిది రకరకాల రంగుల్లో ఉన్న నెమళ్లు కనివిందు చేస్తున్నాయి. అంతేకాదు అందులో ఒక నెమలి చాలా అందంగా పురివిప్పి నాట్యం చేస్తోంది. అయితే ఈ అందమైన నెమళ్ల వీడియోని బాలీవుడ్ టెలివిజన్ నటి మినీ మాథుర్ " అపురూపమైన వీడియో" అనే క్యాప్షన్‌ని జోడించి ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ''వావ్ అమేజింగ్ వీడియో'' అంటూ ట్వీట్స్ చేశారు. View this post on Instagram A post shared by Mini Mathur (@minimathur) -
మోదీ నివాసంలో నెమళ్ల నాట్యం
-
నెమళ్లతో ప్రధాని మోదీ కాలక్షేపం
సాక్షి, న్యూఢిల్లీ: యావత్ భారత జాతినే తన వైపు తిప్పుకున్న ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పక్షిని కూడా ప్రభావితం చేస్తున్నారు. ఢిల్లీలోని తన నివాసంలో నెమళ్లతో కలిసి సేదతీరుతున్న వీడియోను సోషల్ మీడియాలో ఆదివారం షేర్ చేశారు. సాధారణంగా నెమళ్లు మచ్చిక జంతువులు కావు. కానీ అవి ఎంతో స్వేచ్ఛగా మోదీ ఇంట్లో కలియతిరుగుతున్నాయి. పురివిప్పి నాట్యమాడుతున్నాయి. వాటికి ఆయన చేతులతో స్వయంగా తినిపిస్తున్నారు. ప్రకృతి ప్రేమికుడైన ఆయన ఇంటి ప్రాంగణం పల్లె వాతావరణం ఉట్టిపడేలా ఉంది. (మహిళల వివాహ వయసు పెంపుపై కసరత్తు) ప్రధాని మోదీ తన ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్తున్న సమయంలోనూ, అలాగే వాకింగ్ చేస్తున్న సమయంలోనూ నెమళ్లు స్వేచ్ఛగా నడుస్తున్నాయి. ఫొటోలు, వీడియోలు కలిపి రూపొందించిన ఈ స్పెషల్ వీడియో 1.47 నిమిషాల నిడివి ఉంది. ఇందులో సాధారణంగా పురుషులు ఇళ్లలో ఉన్న సమయంలో ఎలా ఉంటారో మోదీ కూడా అలాగే కనిపించారు. ఈ వీడియోలో ఆయన వివిధ రకాల డ్రెస్సులు ధరించారు. ఈ వీడియో ప్రస్తుతం అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది. (షాకింగ్ వీడియో: ‘నువ్వు నిజంగా మూర్ఖుడివి’) -
11 నెమళ్లకు విషం పెట్టి చంపేశారు
సాక్షి, తమిళనాడు : తిరుపూర్ జిల్లా తారాపురం సమీపంలో 11 నెమళ్లకు విషం పెట్టి చంపిన రైతును పోలీసులు అరెస్టు చేశారు. తిరపూర్జిల్లా తారాపురం సమీపం చిన్న పుత్తూర్ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో రైతులు తమ వ్యవసాయ పొలంలో కాయకూరలు, పండ్లు సాగు చేస్తున్నారు. వీటిని ఆ ప్రాంతంలోని నెమళ్లు తరచూ ధ్వంసం చేస్తున్నాయి. దీనిపై పలువురు రైతులు అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఓ పొలంలో 11 నెమళ్లు మృతి చెంది పడి ఉండడాన్ని స్థానిక రైతులు గుర్తించి వ్యవసాయ శాఖ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఈమేరకు వ్యవసాయ అధికారి తిరుమూర్తి, అటవీశాఖ ఉద్యోగి మణివన్నన్ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన రైతు ముత్తుస్వామి కుమారుడు శ్యామ్లయ్యాన్ విషం పెట్టి ఆ నెమళ్లను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తన పంటను నెమళ్లు నాశనం చేయడంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పట్టుకో చూద్దాం...
లాక్డౌన్ ఉండటంతో రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి. దీంతో ఓ నెమలి కేబీఆర్ పార్కులోంచి బయటకు వచ్చింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కుక్క నెమలిని చూసి వెంటపడింది. ఇది గమనించి నెమలి నేను.. దొరకనుపో అన్నట్లు పార్కులోకి ఎగిరి వెళ్లిపోయింది. (మనుషులు కనిపించగానే వెర్రెత్తినట్లు దూకుడు) -
ఘోరం : 45 నెమళ్లు మృతి
-
ఘోరం : 43 నెమళ్లు మృతి
మధురై : తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. మదురై సమీపంలో గల మరుతకలం వద్ద విషాహారం తినడం వల్ల 43 నెమళ్లు మృతి చెందాయి. శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరణించిన వాటిలో 34 ఆడ, 9 మగ నెమళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నెమళ్లు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. రసాయనలు చల్లిన వరి గింజలను తినడం వల్లే నెమళ్లు మృతి చెందినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. మరుతకలంలోకి తోటల వద్దకు నెమళ్లు ప్రతి రోజూ వస్తాయని, ఆహారం తీసుకుని సాయంత్రానికి వెళ్లిపోతుంటాయని స్థానికులు తెలిపారు. ఎవరైన ఉద్దేశపూర్వకంగా నెమళ్లకు విషాహారం ఇచ్చారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మేత కోసం అన్వేషణ
‘అనంత’పై కరువు పంజా విసిరింది. పొట్టకూటి కోసం ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. మూగజీవాలు, వన్యప్రాణులు అయితే మేత, నీటి కోసం విలవిలలాడుతున్నాయి. అడవిలో ఆహారం దొరక్కపోవడంతో మయూరాలు (నెమళ్లు) జనారణ్యంలోకి వస్తున్నాయి. పొలాలు, గ్రామ వీధుల్లో తిరుగుతూ కడుపు నింపుకుంటున్నాయి. గార్లదిన్నె మండలం యర్రగుంట్లలోకి పదుల సంఖ్యలో నెమళ్లు మేత కోసం అన్వేషిస్తూ ఉండటం కరువు తీవ్రతకు అద్దం పట్టింది. - సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
మూగజీవాల మృత్యువాత
► మండుతున్న ఎండలతో కరువైన తాగునీరుl ► ప్రమాదకరంగా మారిన పశుపక్ష్యాదుల మనుగడ ► రక్షణ చర్యలు చేపట్టని అటవీశాఖ అధికారులు మంచాల(ఇబ్రహీంపట్నం): ఎండల తీవ్రతకు మనుషులే కాదు మూగజీవాలు సైతం ఉక్కిబిక్కిరవుతున్నాయి. అడవుల్లో వాటి మనుగడ కష్టంగా మారింది. మేతతోపాటు చుక్క నీరు కూడా దొరక్కపోవడంతో మృత్యువాత పడుతున్నాయి. మండలంలోని నోముల, ఆగాపల్లి, రంగాపూర్, చీదేడ్, దాద్‌పల్లి, ఆరుట్ల, మంచాల, జాపాల, గున్గల్, నల్లవెల్లి అటవీ ప్రాంతాల్లో నెమళ్లు, అడవి పందులు, కుందేళ్లు అధికంగా ఉన్నాయి. గత ఏడాది సెప్టెంబర్ నెలలో 142.2 మి.మీ. వర్షపాతం నమోదయింది. తిరిగి మళ్లీ వర్షాల జాడే లేకుండాపోయింది. ఇటీవల గాలులతో కూడి వర్షం కురిసినా ఎక్కడా నీరు నిల్వలేదు. అడవుల్లో ఉన్న చెరువులు , కుంటలు పూర్తిగా అడుగంటిపోయాయి. దీంతో పశుపక్ష్యాదులకు తాగునీటి తీవ్రత నెలకొంది. అధిక ఎండలతో పక్షులు భారీగా చనిపోతున్నాయి. వీటి రక్షణకు అటవీశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. ప్రధానంగా జాతీయ పక్షులు నెమళ్లు నీరు దొరక్కపోవడంతో వడ దెబ్బకు గురై మృత్యువాత పడుతున్నాయి. ఇటీవల లింగంపల్లి గేట్ వద్ద ఓ నెమలి చనిపోయింది. ఇటీవల జాపాల అడవిలో నెమళ్లు మృత్యువాతకు గురయ్యాయి. అడవుల్లో మూగజీవులు చనిపోతున్నాయని, వాటినిని కాపాడుకోవల్సిన బాధ్యత అటవీ అధికారులు గుర్తెరగాలని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆగాపల్లి, పెద్దతుండ్ల వంటి అటవీ ప్రాంతాల్లో జంతువులకు తాగునీటి కోసం కుండీలు ఏర్పాటు చేశారు. ఏ ఒక్క రోజు కూడా వాటిలో నీళ్లు పోసిన పాపాన పోలేదు. ఎండలు మండుతున్నాయి.. గ్రామాల్లో పశువులకు, అడవుల్లో జంతువులకు తాగునీటి సదుపాయాలు కల్పించాలని ఇటీవల నిర్వహించిన మంచాల మండల సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఆ సమయంలో సరేనన్న అటవీ అధికారులు మరుసటి రోజు ఆ విషయమే మరిచారు. రోజుకో చోట నెమలి నేల రాలుతున్నా తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో ప్రజలు ఫిర్యాదు చేసినా మూగజీవాల రక్షణపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు మూగజీవాలకు అడవుల్లో తాగునీటి సదుపాయం కల్పించి వాటి ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
అనుమానాస్పద స్థితిలో 4 నెమళ్లు మృతి
రంగారెడ్డి: శంషాబాద్‌లోని గగన్‌పహాడ్ మెట్రో ప్రైవేట్ వెంచర్లో నాలుగు నెమళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. ఇది గుర్తించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. విషాహారం తిని మృతి చెందాయా లేక ఎవరైనా హతమార్చారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
నగరంలో అందాలు
సాక్షి,సిటీబ్యూరో: కాంక్రీట్ జంగిల్లో తిరుగాడే మనుషులకు కాస్త పచ్చదనం కనిపిస్తే మనసు ఆగిపోతుంది. అక్కడే ఉండాలనిపిస్తుంది. మరి ప్రకృతిలో పుట్టిపెరిగే పక్షులు ఎంత ఆనందిస్తాయో..! నగరం నాలుగు దిశలా విస్తరిస్తున్న వెలస్తున్న ఆకాశ హర్మా్యలు బతుకును దుర్భరం చేస్తున్నాయి. అక్కడక్కడా ఉన్న తోటలు పక్షులకు ఆవాసం కల్పిస్తున్నాయి. అలాంటి వాటిలో కుత్బుల్లాపూర్ హెచ్ఎంటీ ప్రాంతం ఒకటి. చిన్నపాటి అడవిని తలపించే ఈ ప్రాంతంలో రకరకాల పక్షుల కిలకిల రావాలు పలుకుతున్నాయి. నెమళ్లు, గువ్వలు, కింగ్ ఫిషర్, టిట్లక్ పిట్ట, గుడ్లగూబ, గోరింకలు.. కొన్ని విదేశీ పక్షలు సైతం ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకుని సందడి చేస్తున్నాయి. బుధవారం ‘సాక్షి’ కెమెరాకు చిక్కిన దృశ్యాలివి. -
మయూరాలపై వీకెండ్ ‘వయలెన్స్’!
⇒విషం పెట్టి చంపుతున్న గుర్తు తెలియని దుండగులు ⇒రాయదుర్గం పాన్‌మక్తా గుట్టల్లో వారాంతాల్లోనే వరుసగా ఘటనలు ⇒తెల్లారేసరికి మాయమవుతున్న నెమలి కళేబరాలు ⇒తాజాగా శనివారం రాత్రి ఆరు మయూరాలు మృత్యువాత ⇒ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు, జంతు ప్రేమికులు రాయదుర్గం: సైబరాబాద్ కమిషనరేట్‌కు కూతవేటు దూరంలో వారాంతాల్లో నెమళ్లు అంతమవుతున్నాయి. ఈ జాతీయ పక్షికి గుర్తుతెలియని విషం పెట్టి చంపేస్తున్నారు. శనివారం రాత్రి ఏకంగా ఆరు మయూరాలు చనిపోయాయి. వీటిలో నాలుగింటి కళేబరాలు లభించగా... మరో రెండింటికి చెందిన ఈకలు మాత్రమే పడి ఉన్నాయి. రాయదుర్గం పాక్మక్తా గుట్టల్లో వరుసగా నాలుగైదు వారాలుగా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. కొన్ని ఉదంతాల్లో నెమలీకలు మాత్రమే మిగులుతుండగా... శనివారం రాత్రి నాలుగు నెమళ్ళ కళేబరాలూ కనిపించాయి. మనుషులపై ప్రభావం చూపని విషం పెట్టి మయూరాలను చంపేస్తున్న దుండగులు ఆనక వాటి మాంసాన్ని తీసుకువెళ్తున్నారని స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనలపై ఇటు అటవీ శాఖ అధికారులు, అటు పోలీసులు పట్టించుకోట్లేదని ఆరోపిస్తున్నారు. ఆ ప్రాంతం నెమళ్లకు ఆలవాలం... గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయానికి సమీపంలో ఉన్న రాయదుర్గం పాన్‌మక్తా శివారులోని దుర్గం చెరువు గుట్టల్లో ఏళ్ళుగా వందలాది నెమళ్లు నివసిస్తున్నాయి. ప్రతినిత్యం కనీసం 20 నుంచి 50 దాకా మయూరాలు గుంపులుగా నడుచుకుంటూ గుట్ట శివారు ప్రాంతాల్లో కలియ దిరగడంతో పాటు గుట్టలపై పురివిప్పి ఆడుతూ చుట్టుపక్కల వారితో పాటు ఆ మార్గంలో వెళ్లే వారికీ ఆహ్లాదాన్ని పంచుతుంటాయి. ఆ ప్రాంతంలో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలోని పశువుల కొట్టం ఈ నెమళ్లకు సుపరిచితం. అక్కడ పశువులున్నప్పటికీ నిర్భయంగా నడుచుకుంటూ వచ్చి నీళ్ళు తాగడం, పశువుల కోసం పెట్టిన దాణా తినడం చేసి తమ దారిన వెనక్కు వెళ్లిపోతుంటాయి. నెల్లాళ్ళుగా వరుస ఘటనలు... పాన్‌మక్తా శివారు గుట్టల్లో ఉండే నెమళ్లు నెల రోజులుగా మృత్యువాత పడటం స్థానికుల్ని కలిచి వేస్తోంది. ఈ ఘటనలు వరుసగా వీకెం డ్స్లోనే చోటు చేసుకుంటున్నాయని వారు చెప్తున్నారు. శునివారం ఓ నెమలి నురుగులు కక్కుతూ, ఎగురలేక స్థితిలో నెమ్మదిగా నడచి వెళ్ళడాన్ని గుట్టల్లో పశువులు మేపుకునే ఓ కాపరి గమనించాడు. దాన్ని దగ్గరకు తీసుకుని నీళ్ళు పట్టించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. కొద్దిసేపటికే అవి చనిపోవడంతో స్థానికులకు విషయం చెప్పారు. ఆది వారం గుట్టల్లోకి వెళ్లిన స్థానికులు, భజరంగ్‌దళ్ నాయకులు నాలుగు నెమళ్ల కళేబరాలను గుర్తించారు. దీనికి సమీపంలోనే ముళ్ళ పొద ల్లో మరో రెండు నెమళ్ళకు సంబంధించిన ఈకలు పడి ఉండటాన్ని గమనించారు. వేటాడుతున్నారనే అనుమానాలు... మయూరాలకు సంబంధించి వరుసగా చోటు చేసుకున్న ఘటనల్ని గమనించిన స్థానికులు వేటగాళ్ల పనిగా అనుమానిస్తున్నారు. ప్రధానంగా వారాంతాల్లోనే ఈ ఘటనలు చోటు చేసుకోవడంతో తమ అనుమానాలు బలపడుతున్నామయని వ్యాఖ్యానిస్తున్నారు. మనుషులపై ప్రభావం చూపని గుర్తుతెలియని విషాన్ని వేటగాళ్లు వినియోగిస్తున్నట్లు అనుమానాలున్నాయి. దీని ప్రభావంతో చనిపోయిన నెమళ్ళను సేకరిస్తున్న వేటగాళ్ళు మాంసం కోసం వాటిని తీసుకువెళ్తున్నట్లు ఆరోపిస్తున్నారు. రెండు వారాలుగా నెమళ్ళు సాయంత్రం కనబడినా మరుసటి రోజుకు మాయం అవుతున్నాయని, ఈ నేపథ్యంలోనే వేటగాళ్ల పనిగా అనుమానిస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. ఈ ఘటనలపై విచారణ చేపట్టాలి: భజరంగ్‌దళ్ నాయకుల డిమాండ్ రాయదుర్గం శివారు గుట్టల్లో ఉండే నెమళ్లు నెల రోజులుగా మృత్యువాత పడుతున్నాయని భజరంగ్‌దళ్ జిల్లా ప్రముఖ్ వినోద్ ఆవేదన వ్యక్తం చేశారు. రాయదుర్గంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘జాతీయ పక్షి అయిన నెమళ్లు వీకెండ్స్‌లో చనిపోవడంపై పూర్తి స్థాయి విచారణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెమలి అందమైన పక్షి అని, స్వేచ్ఛగా జీవనం సాగించేలా చేయాల్సింది పోయి చంపడమేమిటని ఆయన ప్రశ్నించారు. నెమళ్ళైపై కొందరు విషప్రయోగం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తూ ఈ విషయంలో నిజానిజాలు వెలికి తీసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జింకలకు కుక్కల భయం... నగర శివార్లలో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణం జింకలకు ఆలవాలం. అక్కడ ఉన్న కుక్కలు వీటిని విచ్చలవిడిగా చంపేస్తుంటాయి. జనవరి 9న హెచ్‌సీయూ మశ్రుంరాక్ వద్ద కొలనులో నీరు తాగేందుకు వచ్చిన జింక పిల్ల, జనవరి 20న హ్యుమానిటీస్ ప్రాంగణంలో, ఫిబ్రవరి 11న గోపన్‌పల్లి గేట్ వద్ద మేత కోసం సంచరిస్తున్న జింకలపై వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. ఈ ఏడాది జనవరి 3న హెచ్‌సీయూలో జింక వేట ఘటన కలకలం సృష్టించింది. -
దాహార్తితో ఐదు నెమళ్లు మృతి
వేల్పూర్: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని మర్సుకుంట శివారులో నీరు లభించక శుక్రవారం ఐదు నెమళ్లు చనిపోయాయి. చెరువు పక్కన పొలాల్లో నెమళ్ల కళేబరాలను గ్రామస్తులు గుర్తించారు. సమీపంలోని పంటభూముల్లో తిరిగే నెమళ్లు నీళ్లకోసం చెరువు వైపు వచ్చి, నీరు దొరకకపోవడంతో చనిపోయి ఉంటాయని భావిస్తున్నారు. కమ్మర్పల్లి ఫారెస్టు సెక్షన్ అధికారి శ్రీనివాస్, బీట్ ఆఫీసర్ గణేష్‌లు వచ్చి నెమళ్ల కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు. -
తాగు నీరు లేక నెమళ్లు మృత్యువాత
జనగామ(వరంగల్): ఎండల ప్రభావంతో తాగేందుకు నీరు దొరక్క వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలం మన్సాన్పల్లి అటవీ ప్రాంతంలో రెండు నెమళ్లు చనిపోయాయి. బచ్చన్నపేట, చేర్యాల, మద్దూరు, నర్మెట, జనగామ అటవీ ప్రాంతాల్లో వేల సంఖ్యలో నెమళ్లు ఉన్నాయి. తీవ్రమైన ఎండలతో మన్సాన్పల్లిలో మృతిచెందిన రెండు నెమళ్లను స్థానికులు గుర్తించి అటవీ అధికారులకు శుక్రవారం సమాచారం ఇచ్చారు. చారు. అధికారులు మృతి చెందిన రెండు నెమళ్లను శవపంచనామా కోసం వరంగల్‌కు తీసుకువెళ్లారు. -
జాతీయ పక్షులను చంపితే జైలుకే...
జగిత్యాల : జాతీయపక్షి నెమలిని చంపిన కేసులో ఇద్దరికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమాన విధిస్తూ కరీంనగర్ జిల్లా జగిత్యాల మొదటి అదనపు జుడీషియల్ మేజిస్ట్రేట్ రమేష్ సోమవారం తీర్పునిచ్చారు. జాతీయ వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద జిల్లాలో జైలుశిక్ష విధించడం ఇదే తొలిసారి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జ్యోతిరెడ్డి తెలిపిన వివరాలు.. జగిత్యాల మండలం తారకరామనగర్‌కు చెందిన వనం రవి, కుంభం పోచయ్య కూలీలు. వీరు మల్యాల మండలం రాజారాం గ్రామ సమీపంలోని రామస్వామి గుట్టపై వన్యప్రాణుల కోసం వలలు ఏర్పాటు చేశారు. 2011 ఆగస్టు 19 వలల్లో రెండు నెమళ్లు చిక్కాయి. రవి, పోచయ్య ఆ నెమళ్ల ఈకలు పీకి, అమ్మేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సమ్మిరెడ్డి, వెల్దుర్తి బీట్ ఆఫీసర్ రఘుపతి వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఇది పసిగట్టిన రవి, పోచయ్య నెమళ్లను వదిలేసి పారిపోయూరు. అటవీ అధికారులు నెమళ్లను స్వాధీనం చేసుకుని వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసేలోపే అవి మృతి చెందాయి. చనిపోయిన నెమళ్లకు పోస్టుమార్టం నిర్వహించి, రవి, పోచయ్యపై జాతీయ వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం వారిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో తొమ్మిది మంది సాక్షులను విచారించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో రవి, పోచయ్యలకు శిక్ష విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆర్నెల్లు సాధారణ జైలుశిక్ష అనుభవించాలని తీర్పు చెప్పారు. -
విష గుళికలు తిని నెమళ్లు మృతి
చేర్యాల : విష గుళికలు తిని పది నుంచి పన్నెండు నెమళ్లు అనుమానాస్పంగా మృతిచెందిన సంఘటన మండల కేంద్రం శివారు పల్లె కర్షకనగర్ సమీపంలో బుధవారం వెలుగుచూసింది. పల్లె కర్షకనగర్ సమీపంలోని దర్గా వద్ద పది నుంచి 12 నెమళ్లు అనుమానాస్పదంగా మృతిచెందగా.. అందులో ఆరు నెమళ్ల కళేబరాలు మాత్రమే ఉన్నారు. గుర్తు తెలియని వ్యక్తు లు విషపూరితమైన మొక్కజొన్న గింజలను పోయడంతో వాటిని తిని నెమళ్లు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సయ్యద్ హుస్సే న్ సంఘటన స్థలానికి చేరుకొని నెమళ్ల కళేబరాలకు వైద్యులతో పోస్టుమార్టం చేరుుంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెమళ్ల మృతిపై విచారణ జరిపించి, నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని చెప్పారు. -
వరంగల్ జిల్లాలో 45 నెమళ్లు మృతి
వరంగల్ : వేటగాళ్ల ఉచ్చుకు జాతీయ పక్షులు బలి అవుతున్నాయి. గత నాలుగు రోజులుగా కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో నెమళ్లు మృత్యువాత పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా వరంగల్ జిల్లా లింగాల ఘన్పూర్ మండలం చీటూరు గ్రామ శివారులో విషాహారం తిని 45మంది నెమళ్లు మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేటగాళ్లు నెమళ్లను విక్రయించేందుకు విషాహారం పెట్టినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలాన్ని బట్టి చూస్తే వేటగాళ్ళ పనే అని అనుమానం వ్యక్తమవుతోంది. ఈ సంఘటనపై గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.