
సాక్షి, న్యూఢిల్లీ: యావత్ భారత జాతినే తన వైపు తిప్పుకున్న ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పక్షిని కూడా ప్రభావితం చేస్తున్నారు. ఢిల్లీలోని తన నివాసంలో నెమళ్లతో కలిసి సేదతీరుతున్న వీడియోను సోషల్ మీడియాలో ఆదివారం షేర్ చేశారు. సాధారణంగా నెమళ్లు మచ్చిక జంతువులు కావు. కానీ అవి ఎంతో స్వేచ్ఛగా మోదీ ఇంట్లో కలియతిరుగుతున్నాయి. పురివిప్పి నాట్యమాడుతున్నాయి. వాటికి ఆయన చేతులతో స్వయంగా తినిపిస్తున్నారు. ప్రకృతి ప్రేమికుడైన ఆయన ఇంటి ప్రాంగణం పల్లె వాతావరణం ఉట్టిపడేలా ఉంది. (మహిళల వివాహ వయసు పెంపుపై కసరత్తు)
ప్రధాని మోదీ తన ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్తున్న సమయంలోనూ, అలాగే వాకింగ్ చేస్తున్న సమయంలోనూ నెమళ్లు స్వేచ్ఛగా నడుస్తున్నాయి. ఫొటోలు, వీడియోలు కలిపి రూపొందించిన ఈ స్పెషల్ వీడియో 1.47 నిమిషాల నిడివి ఉంది. ఇందులో సాధారణంగా పురుషులు ఇళ్లలో ఉన్న సమయంలో ఎలా ఉంటారో మోదీ కూడా అలాగే కనిపించారు. ఈ వీడియోలో ఆయన వివిధ రకాల డ్రెస్సులు ధరించారు. ఈ వీడియో ప్రస్తుతం అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది. (షాకింగ్ వీడియో: ‘నువ్వు నిజంగా మూర్ఖుడివి’)
Comments
Please login to add a commentAdd a comment