మేత కోసం అన్వేషణ
‘అనంత’పై కరువు పంజా విసిరింది. పొట్టకూటి కోసం ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. మూగజీవాలు, వన్యప్రాణులు అయితే మేత, నీటి కోసం విలవిలలాడుతున్నాయి. అడవిలో ఆహారం దొరక్కపోవడంతో మయూరాలు (నెమళ్లు) జనారణ్యంలోకి వస్తున్నాయి. పొలాలు, గ్రామ వీధుల్లో తిరుగుతూ కడుపు నింపుకుంటున్నాయి. గార్లదిన్నె మండలం యర్రగుంట్లలోకి పదుల సంఖ్యలో నెమళ్లు మేత కోసం అన్వేషిస్తూ ఉండటం కరువు తీవ్రతకు అద్దం పట్టింది.
- సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం