Viral Video: Peacocks And Peahens Strolling In A Street In Dubai - Sakshi
Sakshi News home page

Viral Video: రోడ్లపై నెమళ్ల షికారు: మిస్మరైజింగ్‌ వైరల్‌ వీడియో!!

Published Sat, Jan 22 2022 9:37 PM | Last Updated on Sun, Jan 23 2022 8:27 AM

Viral Video: Peacocks And Peahens Strolling In A Street In Dubai  - Sakshi

Peacocks And Peahens Strolling In A Street In Dubai: ప్రకృతిలో అందమైన పక్షులు చూడాలంటే కచ్చితంగా గ్రామాలు లేదా పార్క్‌లు లేదా అడవుల్లోనో చూడగలం. అయినా అవి ఎప్పుడో గానీ సిటీల్లో కనువిందు చేయడం అత్యంత అరుదు. అలాంటిది ఏకంగా 50 నెమళ్లు రోడ్లపై షికారు చేస్తూ చూపురులకు కనువిందు కలిగిస్తున్నాయి.

అసలు విషయంలోకెళ్తే....దుబాయ్‌లోని రోడ్లపై  నెమళ్లు సందడి చేశాయి. ఒకటి రెండు కాదు ఏకంగా 50 నెమళ్లు సందడి చేశాయి. పైగా మనం ఆడ, మగ నెమళ్ల గుంపు ఒకేసారి చూడటం అత్యంత అరుదు. అలాంటిది రకరకాల రంగుల్లో ఉన్న నెమళ్లు కనివిందు చేస్తున్నాయి. అంతేకాదు అందులో ఒక నెమలి చాలా అందంగా పురివిప్పి నాట్యం చేస్తోంది. 

అయితే ఈ అందమైన నెమళ్ల వీడియోని బాలీవుడ్‌ టెలివిజన్‌ నటి  మినీ మాథుర్ " అపురూపమైన వీడియో" అనే క్యాప్షన్‌ని జోడించి ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు ''వావ్‌ అమేజింగ్‌ వీడియో'' అంటూ ట్వీట్స్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement