11 నెమళ్లకు విషం పెట్టి చంపేశారు | Eliminate By Poisoning 11 Peacocks In Tamil Nadu | Sakshi
Sakshi News home page

11 నెమళ్లకు విషం పెట్టిన రైతు అరెస్టు

Published Wed, Jun 10 2020 7:00 AM | Last Updated on Wed, Jun 10 2020 7:02 AM

Eliminate By Poisoning 11 Peacocks In Tamil Nadu - Sakshi

నెమళ్ల కళేబరాలను పరిశీలిస్తున్న అధికారులు(ఇన్‌సెట్‌) రైతు ముత్తుస్వామి

సాక్షి, తమిళనాడు : తిరుపూర్‌ జిల్లా తారాపురం సమీపంలో 11 నెమళ్లకు విషం పెట్టి చంపిన రైతును పోలీసులు అరెస్టు చేశారు.  తిరపూర్జిల్లా తారాపురం సమీపం చిన్న పుత్తూర్‌ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో రైతులు తమ వ్యవసాయ పొలంలో కాయకూరలు, పండ్లు సాగు చేస్తున్నారు. వీటిని ఆ ప్రాంతంలోని నెమళ్లు తరచూ ధ్వంసం చేస్తున్నాయి. దీనిపై పలువురు రైతులు అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో సోమవారం ఉదయం ఓ పొలంలో 11 నెమళ్లు మృతి చెంది పడి ఉండడాన్ని స్థానిక రైతులు గుర్తించి వ్యవసాయ శాఖ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఈమేరకు వ్యవసాయ అధికారి తిరుమూర్తి, అటవీశాఖ ఉద్యోగి మణివన్నన్‌ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన రైతు ముత్తుస్వామి కుమారుడు శ్యామ్లయ్యాన్‌ విషం పెట్టి ఆ నెమళ్లను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తన పంటను నెమళ్లు నాశనం చేయడంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement