
తాగు నీరు లేక నెమళ్లు మృత్యువాత
జనగామ(వరంగల్): ఎండల ప్రభావంతో తాగేందుకు నీరు దొరక్క వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలం మన్‌సాన్‌పల్లి అటవీ ప్రాంతంలో రెండు నెమళ్లు చనిపోయాయి. బచ్చన్నపేట, చేర్యాల, మద్దూరు, నర్మెట, జనగామ అటవీ ప్రాంతాల్లో వేల సంఖ్యలో నెమళ్లు ఉన్నాయి. తీవ్రమైన ఎండలతో మన్‌సాన్‌పల్లిలో మృతిచెందిన రెండు నెమళ్లను స్థానికులు గుర్తించి అటవీ అధికారులకు శుక్రవారం సమాచారం ఇచ్చారు. చారు. అధికారులు మృతి చెందిన రెండు నెమళ్లను శవపంచనామా కోసం వరంగల్‌కు తీసుకువెళ్లారు.