మధురై : తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. మదురై సమీపంలో గల మరుతకలం వద్ద విషాహారం తినడం వల్ల 43 నెమళ్లు మృతి చెందాయి. శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరణించిన వాటిలో 34 ఆడ, 9 మగ నెమళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నెమళ్లు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
రసాయనలు చల్లిన వరి గింజలను తినడం వల్లే నెమళ్లు మృతి చెందినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. మరుతకలంలోకి తోటల వద్దకు నెమళ్లు ప్రతి రోజూ వస్తాయని, ఆహారం తీసుకుని సాయంత్రానికి వెళ్లిపోతుంటాయని స్థానికులు తెలిపారు. ఎవరైన ఉద్దేశపూర్వకంగా నెమళ్లకు విషాహారం ఇచ్చారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment