![Man Beheaded On Road In Madurai Gruesome Act Recorded - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/16/Tmil.jpg.webp?itok=-9wme3XI)
చెన్నై: నడిరోడ్డుపై ఓ యువకుడిని దారుణంగా హతమార్చిందో గ్యాంగ్. అతడి తలను మొండెం నుంచి వేరుచేసి దూరంగా పడేసింది. ఈ పాశవిక ఘటన తమిళనాడులోని మధురైలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. ఊతంగడికి చెందిన మురుగానందం(22) తన స్నేహితుడితో కలిసి సెయింట్ మేరీస్ చర్చి గుండా వెళ్తున్నాడు. ఇంతలో కారులో వచ్చిన గుర్తుతెలియని దుండగులు వారిని అడ్డగించారు. మురుగానందం పారిపోయేందుకు ప్రయత్నించగా అతడిని వెంబడించి మరీ దారుణంగా హతమార్చారు. అనంతరం తల నరికి చర్చి ముందు పడేశారు.
ఇక ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన మురుగానందం స్నేహితుడు ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. కాగా ఈ హత్యకు సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. (చదవండి: హోటల్‌లో యువతిపై సామూహిక అత్యాచారం)
కర్ణాటకలో వ్యాపారిపై దాడి
గుర్తు తెలియని దుండగులు ఓ వ్యాపారిపై పాశవికంగా దాడి చేశారు. పని ముగించుకుని సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో మాటు వేసిన దుండగులు పదునైన ఆయుధాలతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలోతీవ్రగాయాలపాలైన ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కాగా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment