Kasu Brahmananda Reddy
-
అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు
-
నగరానికి మణిహారం ఆ పార్కు..అక్కడ అవే ప్రధాన ఆకర్షణ!
హైదరాబాద్ నగరానికి కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ ఉద్యానవనం(కేబీఆర్ పార్కు) ప్రకృతి మణిహారంగా ఉంది. ఈ ఉద్యానవనం 352 ఎకరాల విస్తీర్ణంలో పచ్చని వృక్షజాలం నడుమ వివిధ రకాల జంతుజాలలతో విస్తరించి ఉంది. ఇది రెగ్యులర్ వాకర్స్, రన్నర్లు, ఫిట్నెస్ ఔత్సాహికులు, కుటుంబాలు, తదితర వర్గాల ప్రజలను ఆకర్షిస్తుంది, ఇది అనేక నెమళ్లకు స్వర్గధామంగా ఉంటుంది. అంతేగాదు నెమళ్లు నడిచేవారిని వాటి చేష్టలతో ఆకర్షిస్తాయి. ఈ పార్కులో నెమళ్ళు, 133 జాతుల పక్షులు, 20 జాతుల సీతాకోకచిలుకలు గుడ్లగూబ, పిట్టలు, పాట్రిడ్జ్లు, రస్సెల్ వైపర్, నాగుపాము, కొండచిలువ, కుందేళ్ళు, పందికొక్కులు, అడవి పిల్లులు, పాంగోలిన్లు తదితర వన్యప్రాణులు ఉన్నాయి. వాటిని పరిరక్షించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 03, 1998లో దీనిన జాతీయ పార్క్‌గా ప్రకటిస్తూ నోటిఫై చేసింది. సాధారణంగా ఈ పార్కులో నడిచేవారు చాలా అరుదుగా సరీసృపాలు, కుందేళ్ళు, పందికొక్కులు పాంగోలిన్లను చూడటం కుదురుతుంది. ఐతే వాటిలో నెమళ్ళు అన్నింటికంటే స్నేహపూర్వకంగా ఉంటాయి. తరచుగా నడిచేవారితో పాటు నడుస్తూ చెట్ల పై నుంచి వంగి చూస్తూ పలకరిస్తున్నట్లుగా కనిపిస్తాయి. నెమళ్ల సంఖ్య పెరగడానికి కారణం.. ఇటీవలి సర్వే ప్రకారం ఈ పార్క్‌లో 512 నెమళ్లు, పీహాన్లు ఉన్నాయి. అటవీ ప్రాంతం చాలావరకు పొదలతో సరైన ఫెన్సింగ్ రక్షణ ఉంటుంది,. పార్క్ ప్రారంభమైనప్పటి నుంచి నెమళ్లకు నిలయంగా ఉంది. నీటి వనరుల ఉనికి, వేటాడే జంతువులు లేకపోవడం నెమళ్ల సంఖ్య పెరగడానికి సహాయపడింది. ఆ పార్క్‌లో ఉదయం నెమళ్ల అరుపులు, కేకలతో ప్రతిధ్వనిస్తుంది. అయితే నెమళ్లను తాకడానికి లేదా ఆహారం తినిపించడానికి ఎవరికి అనుమతి ఉండదు. అలాగే నెమలి ఈకలు కూడా తీయకూడదు. ఇక నెమలి సగటు జీవిత కాలం 10 నుంచి 25 సంవత్సారాల మధ్య ఉంటుంది. భారతీయ వన్యప్రాణి చట్టం 1972 ప్రకారం దీన్ని రక్షించడం జరుగుతోంది. అంతేగాదు ఈ నెమళ్లను ఈకలు, వాటి కొవ్వు, మాంసం కోసం వేటాడి పలు ఉదంతాలు కూడా ఉన్నాయి. భారతదేశం జాతీయ పక్షిగా, నెమలి భారతీయ కళల్లో, హిందూ మత సంస్కృతిలో భాగమవ్వడమే గాక హిందూ దేవుళ్ళకు సంబంధించినంత వరకు దానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వాటిలో అందరూ ఇష్టపడేవి, అత్యంత ప్రజాదరణ పొందిన నెమళ్ళు మగ నెమళ్ళు. వాటికి ఉండే నీలం, ఆకుపచ్చ రంగుల ఈకలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. పర్యాటకులను ఆకర్షించేలా స్క్రీనింగ్‌లో తోపాటు.. అటవీ శాఖ కూడా సెలవు దినాల్లో పర్యాటకులను ఆకర్షించేలా కార్యక్రమాలు, పిల్లలు ప్రకృతితో మమేకమయ్యేలా శిబిరాలు, స్క్రీనింగ్ ఏర్పాటు చేసి తన వంతుగా ఈ పార్క్ అభివృద్ధికి కృషి చేస్తోంది. ఆ పార్కులో నిర్వహించే కార్యక్రమంలో వివిధ రకాల పాము జాతులు, ఏడాదిలో వివిధ సమయాల్లో పార్కులో కనిపించే అనేక జాతుల పక్షులను ఎలా గుర్తించాలనే దాని తోపాటు పర్యావరణ పెంపుదలకు సంబంధించి చిన్న డాక్యుమెంటరీలను కూడా ప్రదర్శిస్తోంది. అంతేగాదు అటవీ శాఖ ప్రతి ఏటా డిసెంబర్ 3న పీకాక్ ఫెస్టివల్‌ని ఘనంగా నిర్వహిస్తోంది కూడా. ఈమేరకు అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ..జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం, ఆవాసాలను సంరక్షించడం అనేది ఇతర జీవుల అవసరాలను తీర్చడం తోపాటు మనకు వాటి గురించి తెలుసుకునే అవగాహన సామర్థ్యం పెరుగుతుంది. నెమలి వంటి అందమైన జాతుల గురించి మనం మరింతగా తెలుసుకున్నప్పుడు.. అవి నివసించే అడవులు, పొదలను సంరక్షించాలనే ప్రేరణ పొందుతాం. ఇక పార్క్‌లోని నెమళ్లు, ఇతర వృక్షజాలం, జంతుజాలం రక్షించబడేలా చూడటం మా బాధ్యత. ప్రకృతిని పరిరక్షించడం, సామరస్యంతో సహజీవనం చేయడం తదితరాలు జీవవైవిధ్యాన్ని పెంచడంలో ఉపకరిస్తుందని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. నాలాగే క్యాప్చర్ చేయడం చూశా.. ఈ క్రమంలో ఆ పార్క్‌కి తరచుగా వచ్చే ఓ ఔత్సహిక వాకర్ మాట్లాడుతూ..నా అనేక మార్నింగ్ వాక్‌లలో నెమళ్లతో పాటు నడవడం, వర్షాకాలంలో వాటి అద్భుతమైన నృత్యాన్ని చూడడం నాకు చాలా ఇష్టం. ఒకసారి నెమలి పూర్తి నిడివి గల నృత్యం ఎనిమిది నిమిషాల పాటు కొనసాగింది.అలాగే నాలా నెమలి అద్భుతమైన ప్రదర్శనను చాలా మంది వ్యక్తులు ఫోన్లో కాప్చర్ చేయడం చూశాను. నెమలి కొద్ది దూరం ఎగరడం చూసి ఆనందించాను. రచయిత : కవిత యార్లగడ్డ ఫోటోగ్రాఫర్ : గరిమా భాటియా (చదవండి: వెరైటీ వైద్యం.. ఆ రెండు పందులతో వాకింగ్ చేస్తే ఆనందం, ఆరోగ్యం!) -
అద్దంకి–నార్కెట్‌పల్లి హైవే ఇకపై.. కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్‌ప్రెస్ వే
దాచేపల్లి: పల్నాడు ప్రాంతానికి చెందిన రాజకీయ యోధుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత కాసు బ్రహ్మానందరెడ్డి పేరు చిరస్మరణీయంగా నిలిచేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బ్రహ్మానందరెడ్డి చేసిన సేవలు, ఆయన చేసిన అభివృద్ధిని గుర్తించిన ప్రభుత్వం హైదరాబాద్–విజయవాడ హైవే, విజయవాడ–చెన్నై హైవేలను కలుపుతూ పల్నాడు ప్రాంతంలోని అద్దంకి–నార్కెట్‌పల్లి ప్రధాన రహదారికి కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్‌ప్రెస్ వేగా నామకరణం చేస్తూ గురువారం ఉత్తర్వులిచ్చింది. సుమారుగా 200 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారికి కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్‌ప్రెస్ వేగా నామకరణం చేయడంపై పల్నాడు ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రహదారికి తన తాత పేరు పెట్టడంపై గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్ హయాంలో ఈ హైవే నిర్మాణాన్ని చేపట్టారు. -
మాజీ సీఎం ‘కాసు’ సతీమణి కన్నుమూత
హైదరాబాద్/సాక్షి, అమరావతి/నాదెండ్ల (చిలకలూరిపేట): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత కాసు బ్రహ్మానందరెడ్డి సతీమణి రాఘవమ్మ (97) వృద్ధాప్య సమస్యలతో ఆదివారం ఉదయం సోమాజిగూడలోని ఆమె స్వగృహంలో కన్నుమూశారు. ఆమె మృతితో స్వగ్రామమైన ఏపీలోని గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె అంత్యక్రియలు సోమవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని మహా ప్రస్థానంలో జరుగుతాయని మనవడు శివానందరెడ్డి వెల్లడించారు. 1964 నుంచి 1971 వరకు ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేసిన కాసు బ్రహ్మానందరెడ్డి.. 1994 మే 20న దివంగతులయ్యారు. వీరికి సంతానం లేకపోవడంతో బ్రహ్మానందరెడ్డి చెల్లెలి కుమారుడిని దత్తత తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. రెండు నెలల క్రితం రాఘవమ్మ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అదే రోజు ఆమె ఆరోగ్యం కుదుటపడటంతో ఇంటికి తీసుకొచ్చారు. ప్రజాసేవలోనూ మేటి.. చిరుమామిళ్ళలో రాఘవమ్మ, బ్రహ్మానందరెడ్డి ప్రాథమిక పాఠశాల, మాచర్ల, నరసరావుపేటల్లో కాసు రాఘవమ్మ, బ్రహ్మానందరెడ్డి కళాశాలలు నెలకొల్పి ప్రజలకు విద్యాసేవలందించారు. రా«ఘవమ్మ ప్రోద్బలంతో రాష్ట్రచరిత్రలో తొలిసారి నాటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి తూబాడులో పేదలకు ఐదు సెంట్లు చొప్పున నివేశన స్థలాలను అందించారు. దివంగత మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి సతీమణి రాఘవమ్మ మృతిపట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం ప్రకటించారు. కాసు బ్రహ్మానందరెడ్డితో రాఘవమ్మ (ఫైల్) చదవండి: ఆరోగ్య సిబ్బంది వైద్య ఖర్చుల బాధ్యత ప్రభుత్వానిదే.. ఫ్రంట్‌లైన్ సిబ్బందికి సీఎం అండ -
ఆదర్శప్రాయుడు ‘కాసు’
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీహెచ్ఈఎల్, ఐడీపీఎల్, ఈసీఐఎల్, బీడీఎల్, హిందుస్థాన్ కేబుల్స్, విశాఖ ఉక్కు కర్మాగారం తదితర దిగ్గజ సంస్థల ఆవిర్భావంలో ప్రధాన పాత్ర పోషించి రాష్ట్రం పారిశ్రామికంగా సుసంపన్నం కావడానికి దోహదపడిన మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి 110వ జయంతి నేడు. ‘నాలుగు కోట్ల ఆంధ్రుల మనఃఫల కంబుల కాసు వంశ భూపాలుని పేరు ముద్రపడి భాసిల్లుచున్నది తెల్గురాణి...’ అంటూ నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా చేసిన ప్రశంసకు ఆయన అన్నివిధాలా అర్హులు. తెలుగుజాతికి చేసిన సేవలు అటువంటివి మరి. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలోని చిరుమామిళ్లలో వెంకటకృష్ణారెడ్డి, శాయమ్మ దంపతులకు 1909 జూలై 28న జన్మించిన బ్రహ్మానందరెడ్డి తిరువనంతపురం వర్సిటీలో న్యాయశాస్త్ర పట్టభద్రుడై ఆ వృత్తిలోకి ప్రవేశించారు. అచిర కాలంలోనే పేరు ప్రఖ్యాతులు సాధించారు. జిల్లా బోర్డుకు 1936లో జరిగిన ఎన్నికల్లో జస్టిస్ పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించడం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. స్వాతం త్రోద్యమంలో చురుగ్గా పాల్గొని పలుమార్లు అరెస్టయ్యారు. లాఠీ దెబ్బలు తిన్నారు. మహాత్మా గాంధీని స్వయంగా కలుసుకున్నాక ఆయన స్ఫూర్తితో ఖద్దరు వస్త్రధారణకు మారారు. 1964 ఫిబ్రవరి 21న సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక రాష్ట్రాన్ని బహుముఖ రంగాల్లో తీర్చిదిద్దారు. బాలికా విద్యకు అగ్ర ప్రాధాన్యమిచ్చారు. వారికి సెకండరీ స్థాయి వరకూ ఉచిత విద్యా సౌకర్యం కల్పించారు. అంతేకాదు... బాలికల కోసం విస్తృతంగా ప్రత్యేక పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటుచేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడమే కాదు... జిల్లా పరిషత్తులకు సంపూర్ణ అధికారాలిచ్చారు. బీసీల రిజర్వేషన్లు అమలుచేసి, మున్నూరు కాపుల్ని ఆ జాబితాలోకి తీసుకొచ్చారు. ఎస్టీ వర్గాల పురోగాభివృద్ధికి కృషిచేశారు. ఆ రోజుల్లో రూ.10 కోట్లు ఎల్ఐసీ రుణంతో బలహీన వర్గాలకు తొలిసారి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. స్వయానా క్రీడాకారుడైన ఆయన సీఎంగా క్రీడలకు ప్రాధాన్యమిచ్చారు. హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియం ఆయన హయాంలోనే నిర్మాణమైంది. బ్రహ్మానందరెడ్డి 1964 మొదలుకొని 1971 వరకూ ఏడేళ్లపాటు సీఎంగా పని చేశారు. తెలంగాణ ఉద్యమ తీవ్రత కారణంగా పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఆరో ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా, కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. ఎమర్జెన్సీ ఎత్తివేశాక 1977లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఇందిరాగాంధీ రాజీనామా చేసినప్పుడు బ్రహ్మానంద రెడ్డి అధ్యక్షుడయ్యారు. ఆ మరుసటి ఏడాది ఆయనతో ఇందిరాగాంధీకి విభేదాలు తలెత్తి ఇందిరా కాంగ్రెస్ పేరుతో వేరు కుంపటి పెట్టుకున్నారు. అయితే 1980లో తన నాయకత్వంలోని కాంగ్రెస్‌ను ఆయన ఇందిరా కాంగ్రెస్‌లో విలీనం చేశారు. రాజీవ్‌గాంధీ హయాంలో మహారాష్ట్ర గవర్నర్‌గా పని చేశారు. 1994 మే నెలలో కన్ను మూసిన బ్రహ్మానందరెడ్డి చివరివరకూ విలువలకు కట్టుబడి జీవించారు. ఆ మహనీయుడి సేవలకు గుర్తింపుగా స్మృతివనం ఏర్పాటుచేస్తే సముచిత నివాళి అర్పించి నట్టవుతుంది. -వందవాసి అవంతి, గుంటూరు -
ఉద్దండుల కోట.. నరసరావుపేట
సాక్షి,నరసరావుపేట: నరసరావుపేట అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలు మొదటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి ఉద్దండులనే అందించాయనడంలో ఎటువంటి అతిశయోక్తిలేదు. పలనాడు ముఖద్వారంగా ఉన్న నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం, గుంటూరు–ప్రకాశం జిల్లాలతో పాటు కలిసి కొన్నేళ్లపాటు కొనసాగిన నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం మొదటి నుంచి విలక్షమైనవే. ఈ నియోజకవర్గాల నుంచి పోటీచేసిన వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక పాత్ర పోషించడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన నల్లపాటి వెంకటరామయ్యచౌదరి ఉమ్మడి ఆంధ్రరాష్ట్ర తొలిస్పీకర్‌గా 1953 నుంచి 1955 వరకు బాధ్యతలను నిర్వహించిచారు. 1967లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన కాసు బ్రహ్మానందరెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏడేళ్ల పాటు కొనసాగారు. కాసు కృష్ణారెడ్డి సైతం మూడుసార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించి మంత్రి పదవులను చేపట్టారు. డాక్టర్ కోడెల అత్యధికంగా నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి వరుసుగా ఐదుమార్లు విజయం సాధించి, 12ఏళ్ల పాటు మంత్రివర్గంలో వివిధ శాఖలు నిర్వహించారు. పార్లమెంట్ సీటు రూటే సెపరేటు.. 1952లో నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా సీఆర్ చౌదరి ఇండిపెండెంట్‌గా గెలుపొందారు. ఆ తర్వాత 1967, 71 ఎన్నికల్లో మద్ది సుదర్శనం రెండుసార్లు గెలుపొందగా, 1977, 1980లో కాసు బ్రహ్మానందరెడ్డికి ప్రజలు పట్టం కట్టారు. ఈ క్రమంలోనే ఆయన కేంద్ర హోంశాఖమంత్రిగా అత్యున్నత పదవిని చేపట్టారు. ఆయనతో పాటు కాసు వెంకటకృష్ణారెడ్డి సైతం రెండుసార్లు ఎంపీగా విజయాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే 1999లో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థనరెడ్డి, 1998లో మరో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య, 2004లో మేకపాటి రాజమోహన్‌రెడ్డి, 2009లో మోదుగుల వేణుగోపాలరెడ్డి, 2014లో రాయపాటి శంభశివరావు ఎంపీలుగా ఇక్కడి నుంచి గెలిచినవారే. -
యువరానర్..కాదు కాదు.. అధ్యక్షా..!
సాక్షి, గుంటూరు: న్యాయ శాస్త్రం చదివి కోర్టులో కేసులు వాదించాల్సిన జిల్లాకు చెందిన అనేక మంది న్యాయవాదులు రాజకీయాల్లో ప్రవేశించి చక్కగా రాణిస్తూ రాష్ట్ర, దేశ రాజకీయాల్లో తమదైన గుర్తింపు పొందారు. జిల్లాకు చెందిన సుమారు 20 మంది న్యాయవాదులు రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా రాష్ట్ర, కేంద్ర మంత్రులుగా, ముఖ్యమంత్రిగా పదవులు అలంకరించి జిల్లా, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందారు. 20 మందిలో ఏడుగురు ఎంపీలుగా గెలిచారు. వీరిలో ఒకరిద్దరు కేంద్ర మంత్రులుగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. మిగతా 14 మంది ఎమ్మెల్యేలుగా... వీరిలో కొందరు రాష్ట్ర మంత్రులుగా కూడా పని చేశారు. - నరసరావుపేట నియోజకవర్గానికి చెందిన కాసు బ్రహ్మానందరెడ్డి లా చదివి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ మొట్టమొదటిసారిగా ఫిరంగిపురం నుంచి ఎమ్మెల్యేగా రెండు దఫాలు ఎన్నికయ్యారు. అనంతరం నరసరావుపేట అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఏడేళ్లపాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగారు. రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన ఈయన కేంద్ర హోం శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత స్థానమైన ఏఐసీసీ అధ్యక్షునిగా కూడా పని చేసి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. - బాపట్ల నియోజకవర్గానికి చెందిన గాదె వెంకటరెడ్డి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొంది వైఎస్సార్ క్యాబినెట్లో మంత్రిగా పని చేశారు. ఈయన న్యాయవాది వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారే. - మరో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాదరావు కూడా గురజాల కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ రాజకీయాల్లోకి వచ్చి 2004, 2009 ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం వైఎస్సార్ క్యాబినెట్లో మంత్రిగా చేశారు. - టీడీపీకి చెందిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ న్యాయవాద వృత్తి నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొంది చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా చేశారు. - దుగ్గిరాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది అనంతరం మంత్రిగా పనిచేసిన ఆలపాటి ధర్మారావు సైతం న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారే. - వేమూరు నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా యడ్లపాటి వెంకట్రావు మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా పని చేశారు. ఈయనా న్యాయవాద వృత్తి నుంచి వచ్చినవారే. - బాపట్ల నియోజకవర్గానికి చెందిన కోన ప్రభాకరరావు న్యాయవాద వృత్తి నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్రమంత్రిగా, శాసనసభ స్పీకర్‌గా, మూడు రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేశారు. - కొత్త రఘురామయ్య గుంటూరులో న్యాయవాదిగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి వరుసగా ఆరుసార్లు ఎంపీగా గెలుపొంది కేంద్ర మంత్రివర్గంలో అనేక శాఖల్లో మంత్రిగా పనిచేశారు. దేశ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్నారు. - సలగల బెంజిమెన్, సింగం బసవపున్నయ్య, ఎస్.వి.ఎల్.నరసింహారావు, ముప్పలనేని శేషగిరిరావు, నిశ్శంకరరావు వెంకటరత్నం, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి న్యాయవాద వృత్తి నుంచి ఎంపీలుగా గెలుపొంది నియోజకవర్గాల్లో వారి ప్రాబల్యాన్ని కనబర్చారు. - జిల్లాకు చెందిన గాదె వీరాంజనేయశర్మ, గంగినేని వెంకటేశ్వరరావు, నల్లపాటి వెంకటరామయ్య, అంబటి రాంబాబు, నక్కా ఆనందబాబు, మర్రి రాజశేఖర్ కూడా న్యాయవాదులుగా కొనసాగుతూ రాజకీయాల్లో చేరి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. -
రణజ్వాల.. గురజాల
సాక్షి, గురజాల : చాపకూటి సిద్ధాంతంలాంటి సమానత్వాన్ని చాటుకున్న చోటే.. ఫ్యాక్షన్ రక్తపు మరకల్లో తడిచి ముద్దయిన ప్రాంతం పల్నాడు. నాయకురాలు నాగమ్మ పౌరుషాలను పుణికిపుచ్చుకుని.. బ్రహ్మనాయుడు వంటి సౌమ్య గుణాన్ని కలిగిన ఈ ప్రాంతంలో గురజాల నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. నాగార్జున సాగర్ జలాలతో సిరుల పంటలిచ్చిన భూములు.. ఐదేళ్లలో కాలంలో మళ్లీ బీడువారాయి. ఫ్యాక్షన్ హత్యలను పక్కన పెట్టి విద్యా, వ్యాపారాల్లో ముద్ర వేస్తున్న ఈ ప్రాంత ప్రజలు రాజకీయ చైతన్యం చూపిస్తున్నారు.పల్నాడు ప్రాంతానికి ఘనమైన చరిత్ర ఉంది. బాలచంద్రుడు, కన్నమదాసు, నాయకురాలు నాగమ్మ, బ్రహ్మనాయుడు ఆ రోజుల్లోనే చాపకూటి సిద్ధాంతాన్ని అమలు చేసి సమానత్వాన్ని చాటారు. తరువాత కాలనుగుణంగా పల్నాడు ప్రాంతం కక్ష్యలు, కార్పణ్యాలతో రగిలిపోయింది. అనంతరం గ్రామాల్లో అక్షరాస్యత శాతం పెరగడంతో ప్రశాంత వాతావరణం నెలకొని శాంతి కపోతాలు ఎగురుతున్నాయి. గురజాల విశిష్టత గురజాల మండలం పులిపాడు, దైద, తేలుకుట్ల గ్రామాల్లో ఫ్యాక్షన్ ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం ఈ గ్రామాలు ఫ్యాక్షన్ విడిచిపెట్టి వ్యాపారాలపై మక్కువ చూపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం వ్యవసాయంపై ఆధారపడి ఉంది. వరి, పత్తి, మిరప పంటలు సాగవుతున్నాయి. నాగార్జున సాగర్ నుంచి కాలువలకు నీరు రాకపోవడంతో వరి సాగు తగ్గి పత్తి, మిరప వైపు రైతాంగం మళ్లింది. ప్రస్తుతం బోర్లు, చెరువులు కింద మాత్రమే వరి సాగవుతోంది. నాగార్జున సాగర్ రాకముందు ఈ ప్రాంతం బీడుగా మారింది. 1967లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మించారు. అప్పటి నుంచి పలనాట సిరుల పంటలు పండుతున్నాయి. ఎన్నికల విజేతలు 1952లో కాసు బ్రహ్మానందరెడ్డి (కాంగ్రెస్)పై కోలా సుబ్బారెడ్డి(సీపీఐ) 11,673 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1955లో కోలా సుబ్బారెడ్డి (సీపీఐ)పై మండవ బాపయ్య చౌదరి (కేఎల్పీ) 6,907 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1962లో కోలా సుబ్బారెడ్డి(సీపీఐ)పై కొత్త వెంకటేశ్వర్లు(కాంగ్రెస్) 4,624 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1967లో గడిపూడి మల్లికార్జునరావు(ఇండిపెండెంట్)పై కొత్త వెంకటేశ్వర్లు(కాంగ్రెస్) 7,167 ఓట్ల మెజార్టీ తెచ్చుకున్నారు. 1972లో కొత్త వెంకటేశ్వర్లు(కాంగ్రెస్)పై మందపాటి నాగిరెడ్డి (సీపీఐ) 8,377 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1978లో మందపాటి నాగిరెడ్డి(సీపీఐ)పై గడిపూడి మల్లికార్జునరావు(కాంగ్రెస్) 23,248 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1983లో కాసు వెంకట కృష్ణారెడ్డి(కాంగ్రెస్)పై జూలకంటి నాగిరెడ్డి (ఇండిపెండెంట్) 12,722 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1985లో కాయితి వెంకట నర్సిరెడ్డి(కాంగ్రెస్)పై అంకిరెడ్డి ముత్యం (టీడీపీ) 3,603 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1989లో రాచమడుగు సాంబశివరావు (టీడీపీ)పై కాయితీ వెంకట నర్సిరెడ్డి(కాంగ్రెస్) 8,145 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 1994లో కనకం రమేష్ చంద్రదత్తుపై యరపతినేని శ్రీనివాసరావు 23,967 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1999లో యరపతినేని శ్రీనివాసరావుపై జంగా కృష్ణమూర్తి 131 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2004లో యరపతినేని శ్రీనివాసరావుపై జంగా కృష్ణమూర్తి 7,126 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2009లో ఆలా వెంకటేశ్వర్లుపై యరపతినేని శ్రీనివాసరావు 10,565 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2014లో జంగా కృష్ణమూర్తిపై యరపతినేని శ్రీనివాసరావు 7,896 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మార్పు– కూర్పు పునర్విభజన కాక ముందు గురజాల నియోజకవర్గంలో 5 మండలాలు ఉండేవి (గురజాల, రెంటచింతల, మాచవరం, దాచేపల్లి, పిడుగురాళ్ల) మండలాలు కలిసి ఉండేవి. రెంటచింతల మండలాన్ని మాచర్ల నియోజకవర్గంలో కలిపారు. విద్యా రంగం గురజాల మండల పరిధిలోని జంగమహేశ్వరపురం వద్ద ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఉంది. ఇంటర్మీడియెట్ కళాశాలతోపాటు ప్రైవేట్ కళాశాలలు–2, డిగ్రీ కళాశాల ఒకటి కలవు. బీఎడ్, బీఈడీ ప్రైవేట్ ళాశాలలు ఉన్నాయి. దాచేపల్లి మండలంలో ఇంటర్మీడియెట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వైఎస్ హయాంలో.. గురజాల మండలం మాడుగుల–శ్యామరాజుపురం గ్రామాల మధ్య బుగ్గవాగు రిజర్వాయర్ నుంచి పలు గ్రామాలకు మంచినీటిని అందించాలనే లక్ష్యంతో పైపు లైన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఈ పథకం కింద వేల ఎకరాల వరి పంటలు సాగవుతున్నాయి. దాచేపల్లిలోని దండివాగు ఎత్తిపోతల పథకానికి విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మించారు. శ్రీనగర్‌లో రూ.1.50 కోట్ల వ్యయంతో సబ్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. శ్రీనగర్ నుంచి దాచేపల్లికి మంచినీటి ఇరిగేషన్ ఏర్పాటు చేసి అనేక గ్రామాల దాహార్తి తీర్చారు. పొందుగుల–దాచేపల్లికి వాటర్ పైప్‌లైన్ నిర్మించి ప్రతి ఇంటికి కృష్ణా జలాలను అందించారు. మాచవరం మండలంలోని మోర్జంపాడు లిప్టు ఇరిగేషన్ ఏర్పాటు చేసి సుమారుగా 5 వేల ఎకరాలను సస్యశ్యామంలం చేశారు. పిడుగురాళ్ల పట్టణ ప్రజలకు గోవిందాపురం జలాలను అందించేందుకు రూ.37 కోట్ల నిధులతో పైపు లైన్లు నిర్మించారు. పిడుగురాళ్లలో ట్రాఫిక్ సమస్యలు అధిగమించేందుకు అద్దంకి–నార్కెట్‌పల్లి రహదారిని పట్టణం గుండా వెళ్లేలా చేశారు. -
ఆమడ దూరంలో!
సాక్షి, పెద్దపల్లి : రామగుండం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ప్రభుత్వాలు మారినా.. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో పట్టణవాసులు మా పరిస్థితి ఇంతేనా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీ-థర్మల్ పరిరక్షణతో పాటు నూతన విద్యుత్కేంద్రం ఏర్పాటు, బీపీఎల్ భూముల సమస్య, రామునిగుండాలను పర్యాటక కేంద్రంగా మార్చడం, పెద్ద చెరువును మినీట్యాంక్ బండ్‌గా చేయడం.. అంతర్గాం టెక్స్టైల్ కార్మికుల సమస్యలు ఏళ్లకు ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోవడంలేదు. విస్తరణకు నోచుకోని బీథర్మల్.. రామగుండం థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ)ను అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి 1965 జూలై 19న శంఖుస్థాపన చేశారు. అప్పుడు రూ. 14.8 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత దీనిని జవహర్లాల్ నెహ్రూ థర్మల్ విద్యుత్తు కేంద్రంగా నామకరణం చేశారు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎగిసిపడడంతో ఆంధ్రాలోనూ థర్మల్ విద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేయాలని తలిచి విజయవాడ సమీపంలో నిర్మించతలపెట్టారు. దీంతో రామగుండం బి-థర్మల్ను 62.5 మెగావాట్లకు సరిపెట్టారు. ఆ తర్వాత బిథర్మల్ కేంద్రం విస్తరణకు నోచుకోలేదు. నేటి పాలకులు రామగుండంను విద్యుత్ హబ్‌గా మార్చుతామన్న హామీ కార్యరూపం దాల్చలేదు. నిరుపయోగంగా వేలాది ఎకరాలు.. 1994లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం బెంగళూరుకు చెందిన మారుబెని, తోషీబా, ఎలక్ట్రిక్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (జపాన్)లకు దశలవారీగా పనులు చేపట్టేందుకు ప్రాజెక్టును కట్టబెట్టారు. స్థానికంగా ఉన్న ఏపవర్‌హౌస్ స్థలం 750 ఎకరాలతో పాటు మరిన్ని అవసరాల నిమిత్తం మరో 1,050 ఎకరాలను రైతుల నుంచి భూసేకరణ చేశారు. 520 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో రూ.2813.9 కోట్ల వ్యయంతో అంచనా రూపొందించి రూ. 150 కోట్ల వ్యయమంతో ప్రహరీ నిర్మాణాలు ఎకరాల విలువైన భూములు నిరుపయోగంగా ఉన్నాయి. ఎవరికీ పట్టని రాముని గుండాలు.. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా గుర్తింపు పొందిన రామగుండం సమీపంలోని రామునిగుండాలను పర్యాటక కేంద్రంగా గుర్తించి అభివృద్ధి చేపట్టాల్సిన అవసరం ఉంది. స్థానికంగా రామునిగుండాలు ఉండడం, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు నిలయం కావడంతోనే ప్రపంచ దేశ, రాష్ట్ర చిత్రపటాలలో రామగుండంకు ప్రత్యేక పేరుంది. రామునిగుండాలలో రామలక్ష్మణుడు సంచరించినట్లు ఆనవాళ్లుఉన్నాయి. కొండపై 108 గుండాలున్నాయి. గుట్టపై 200 ఫీట్ల లోతు, 50 ఫీట్ల వెడల్పుతో ఓలోయ ఉంది. లోయకు పైభాగాన ఉన్న బావిలో సీతాదేవి స్నానమాచరించిందని ప్రతీతి. రాముడు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు పాదముద్రికల స్థానంలో ఏర్పడిన గుంతలు గుండాలుగా మారి రామగుండంగా పేరువచ్చింది. 108 గుండాలలో అన్ని కాలాల్లో నీరు సమృద్ధిగా ఉండడం విశేషం. దీనిని ఆధ్యాత్మికంతో పాటు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవికూడా నాలుగు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఆమడదూరం పెద్ద చెరువు.. పట్టణంలోని 210 ఎకరాల విస్తీర్ణంలో నియోజకవర్గ పరిధిలోనే పెద్దచెరువు. ఇందులోకి ఎన్టీపీసీకి చెందిన బూడిద నీరు చేరుతుండడంతో పిచ్చి మొక్కలు, గుర్రపు డెక్క పెరగడంతో పాటు కార్పొరేషన్‌లోని వివిధ డివిజన్లలో సేకరించిన చెత్తను ఇందులో వేయడంతో చెరువు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయి కలుషితమవుతుంది. దీని కింద సుమారు రెండు వేల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనిని గడిచిన పాలకవర్గం మినీ ట్యాంకుబండ్‌గా ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ రాజకీయ వర్గ విభేధాలతో మరో చెరువును ఎంపిక చేశారు. దీంతో అభివృద్ధికి పుల్‌స్టాప్ పడింది. -
ఆదేశాల్లోపదనిసలు..!
నాగార్జునసాగర్ డ్యామ్ నిర్మాణ పనులను పరిశీలించడం ప్రధానమంత్రి నెహ్రూకు ఎంతో ఇష్టం అని చెప్పుకున్నాం కదా. కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఒకసారి నెహ్రూ డ్యామ్ చూడడానికి వచ్చారు. ‘కండలను కరగదీస్తూ బండలను విసురుతున్న’ శ్రామికులను పారవశ్యంగా చూస్తున్నారు. ‘మీ దినసరి కూలీ ఎంత?’ అని అడిగారు. ‘ముప్పావలా’ అని చెప్పారు. ‘మంచి మొత్తమే’ అన్నారట బ్రహ్మానందరెడ్డి. ఆ మాటకు నొచ్చుకున్న శ్రామికులు ముఖ్యమంత్రి మీద కలబడ్డంత పని చేశారట. రోజు కూలీని రూపాయి పావలా చేయమని నెహ్రూ ఆదేశించడంతో కార్మికులు ‘బ్రహ్మానంద’పడ్డారట! అప్పట్లో పాలకుల తీరు ఇప్పుడు హాస్యంగా అన్పించడం సహజం. ఇప్పుడు సాధారణంగా భావిస్తోన్న అంశాలు భవిష్యత్తులో నవ్వు తెప్పిస్తాయేమో! ఈ నేపథ్యంలో నిజాంల హయాంలో కొన్ని ఆదేశాలను గుర్తు చేసుకుందాం! తప్పు చేసిన మేలు! నిజాం హయాంలో కూడా ఉపాధి కోరుకునేవారి పేర్లను నమోదు చేసుకునే విధానం ఉండేది. అలా నమోదు చేసుకున్న వారు రేపటి ఉద్యోగాలకు ‘అభ్యర్థులు’! వీళ్లకు పని చెప్పే వారు. జీతం గీతం ఉండేది కాదు. ఉద్యోగం ఖాళీ కాగానే ఇచ్చేవారు. అభ్యర్థుల్లో ఒకరు రాసిన ‘నోట్ ఫైల్’ అపార్థానికి దారితీసేదిగా తప్పుల తడకగా ఉండడాన్ని మొదటి సాలార్జంగ్ గమనించారు. సదరు ‘రచయిత’కు పది రూపాయల జరిమానా విధిస్తూ, జీతంలోంచి మినహాయించుకోవాలని ‘నోట్ ఫైల్’పై ఆదేశించారు. ‘అభ్యర్థి’కి జీతభత్యాలు లేనందువలన జీతంలో మినహాయించుకోలేమని సాలార్‌జంగ్‌కు తిరుగు టపాలో ఆ తప్పుల తడక చేరింది! ‘అయితే వాడిని ఏదో ఒక ఉద్యోగంలో నియమించి జరిమానా వసూలు చేయండి’ అని మరొక ఆదేశం జారీ అయింది! కాదనేందుకు నిజాం ఎవరు?! ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నివసించిన ఆరవ నిజాం మహబూబ్ అలీఖాన్ మహా ఉదారుడు! వృద్ధుడైన ఆయన వ్యక్తిగత సేవకుడు తన అనారోగ్యాన్ని, ఈతి బాధలను ప్రభువుకు చెప్పుకున్నాడు. ఇతడికి నెలకు ఎనిమిది రూపాయల పెన్షన్‌ను జీవితాంతం ఇవ్వండి అని ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు ఉత్తర్వు సిద్ధమైంది. నిజాం సంతకం చేయడమే తరువాయి. ఎనిమిది అనే సంఖ్య దగ్గర లేఖకుని పొరపాటు వలన సున్నా చేరి ‘80’గా మారింది. క్లర్క్ క్షమాపణలు చెప్పాడు. మరో కాపీ తెస్తానన్నాడు. ‘విశ్వాసుడైన ఆ సేవకునికి రూ.80 ఇవ్వాలని రాసిపెట్టి ఉంటే కాదనడానికి మనమెవ్వరం?’ అన్నాడు నిజాం! ఆ సేవకుడు జీవితాంతం రాజభోగాలు అనుభవించాడు! పోలీసు కమిషనర్‌కు ఫైన్! ఆరవ నిజాం దగ్గర నవాబ్ సహాబ్ జంగ్ హోం మంత్రి. అక్బర్జంగ్ సిటీ పోలీస్ కమిషనర్. ఏదో విషయమై సిటీ పోలీస్ కమిషనర్ హోం మంత్రితో వాదులాడాడు. నీ పని ఇలా ఉందా అనుకున్నాడేమో ఒక రూపాయి జరిమానా విధించాడు. అక్బర్జంగ్ సహజంగానే అప్సెట్ అయ్యాడు. తనకు విధించిన శిక్ష గురించి నిజాంకు మొరపెట్టుకున్నాడు. మరుసటి రోజు సహాబ్ జంగ్ నిజాం సందర్శనకు వె ళ్లినపుడు ‘కమిషనర్ నా విశ్వాసపాత్రుడు, హితైషుడు. అటువంటి వ్యక్తికి జరిమానా విధిస్తారా’ అన్నాడు. అయ్యో అలాగా అని నిజాంకు క్షమాపణ చెప్పాడు సహాబ్ జంగ్. తన నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తాన ని అన్నాడు. ఆఫీసుకు వచ్చి సంబంధిత ఫైల్ తెప్పించుకున్నాడు. జరిమానాలో సగం చెల్లింపు జరిగింది. సంబంధిత వ్యక్తిని అర్ధరూపాయి చెల్లించనివ్వండి’ అని రాశారు! ‘బల్లె’ ఇంక్రిమెంట్! ఆరవ నిజాం మహబూబ్ అలీఖాన్ (1866-1911) ఉదారుడు. విద్యాధికుడు. వేటగాడు. అశ్వికుడు. ఆయన స్థాపించిన ‘నిజాం స్కాలర్షిప్ ట్రస్ట్’ సహాయంతో కవికోకిల సరోజినీ నాయుడు ఇంగ్లండ్‌లో చదువుకున్నారు. అదలా ఉంచితే.. ఆరవ నిజాం సైన్యాధికారి నవాబ్ అఫ్సర్ జంగ్. ఈయన కింద ‘రిసాల్దార్ మేజర్’గా రెహమాన్‌ఖాన్ అనే వ్యక్తి బల్లెపు పోటుగాళ్ల మూడవ దళంలో పనిచేసేవాడు. పురానీ హవేలీలో నివసించే ఆరవ నిజాంను సందర్శించేందుకు వెళ్లే అఫ్సర్జంగ్కు అశ్వికుడైన రెహమాన్‌ఖాన్ పైలట్! ఓ పర్యాయం నిజాం నివసించే ప్యాలెస్ ప్రాంగణంలో రెహమాన్‌ఖాన్ గుర్రంపై స్వారీచేస్తున్నాడు, వాయువేగంగా! గుర్రపు వేగానికి పొడవాటి తెల్లటి గడ్డం గాలిలో నైరూప్య చిత్రాలను చూపుతోంది! ‘సెలయేళ్లుగా ప్రవహిస్తోన్న తెల్లటి గడ్డా’న్ని నిజాం తన భవంతి నుంచి చూసి అబ్బురపడ్డాడు! రెహమాన్‌ఖాన్ గడ్డం పోషణకు ఆజీవన పర్యంతం నెలకు పదిరూపాయల ఇంక్రిమెంట్‌ను మంజూరు చేస్తూ ఉత్తర్వు జారీ చేశారు! రెహమాన్‌ఖాన్ తన గడ్డాన్ని ప్రేమగా నిమురుకున్నాడు, చివరి శ్వాస వరకూ! ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి