అంతర్జాతీయ టీ20ల్లో పసికూన నమీబియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. పొట్టి ఫార్మాట్‌లో ఈ జట్టు వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. తాజాగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా మాజీ వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు సైతం సాధ్యంకాని తొమ్మిది వరస విజయాల రికార్డును సాధించింది. తద్వారా ప్రపంచ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన 18వ జట్టుగా రికార్డుల్లోకెక్కింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వరుస విజయాల రికార్డు మలేసియా పేరిట ఉంది. ఈ జట్టు జూన్ 2022-డిసెంబర్ 2022 మధ్యలో వరుసగా 13 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వరుస విజయాలు సాధించిన జట్లు..
- మలేసియా (13 వరుస విజయాలు)
- బెర్ముడా (13)
- ఆఫ్ఘనిస్తాన్ (12)
- రొమేనియా (12)
- ఇండియా (12)
- ఆఫ్ఘనిస్తాన్ (11)
- ఉగాండ (11)
- పపువా న్యూ గినియా (11)
- నైజీరియా (11)
- జెర్సీ (10)
- టాంజానియా (10)
- ఉగాండ (10)
- ఉగాండ (10)
- పాకిస్తాన్ (10)
- న్యూజిలాండ్ (10)
- పోర్చుగల్ (9)
- సౌదీ అరేబియా (9)
- నమీబియా (9*)
కాగా, ట్రై సిరీస్‌లో భాగంగా నేపాల్‌తో ఇవాళ (ఫిబ్రవరి 27) జరిగిన మ్యాచ్‌లో నమీబియా 20 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా.. లాఫ్టీ ఈటన్ (36 బంతుల్లో 101; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) ఫాస్టెస్ట్ సెంచరీతో (33 బంతుల్లో) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. నమీబియా ఇన్నింగ్స్‌లో ఈటన్‌తో పాటు మలాన్ క్రుగెర్ (59 నాటౌట్) రాణించాడు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్.. గెలుపు కోసం చివరి వరకు ప్రయత్నించినప్పటికీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఆ జట్టు 18.5 ఓవర్లలో 186 పరుగులకే పరిమితమై 20 పరగుల తేడాతో ఓటమిపాలైంది. రూబెన్ ట్రంపల్‌మెన్ (4/29) నేపాల్‌ను దెబ్బకొట్టాడు. నేపాల్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ పౌడెల్ (42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో రెండో మ్యాచ్ రేపు నేపాల్-నెదర్లాండ్స్ మధ్య జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment