
సఫారీలకు నమీబియా షాక్
అండర్ -19 వరల్డ్ కప్లో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణాఫ్రికాకు నమీబియా షాకిచ్చింది.
కాక్స్ బజార్(బంగ్లాదేశ్):అండర్ -19 వరల్డ్ కప్లో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణాఫ్రికాకు నమీబియా షాకిచ్చింది. గ్రూప్-ఏలో భాగంగా ఆదివారం ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో నమీబియా రెండు వికెట్ల తేడాతో గెలిచి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకుంది. టాస్ గెలిచి దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసి 50.0 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌటైంది. సఫారీ ఆటగాళ్లలో విల్లెమ్ లూడిక్(42) మినహా ఎవరూ రాణించకపోవడంతో సఫారీలు స్వల్ప స్కోరుకే పరిమితమయ్యారు. నమీబియా బౌలర్లలో వేన్ లిన్ జెన్ నాలుగు, కోట్జీ మూడు వికెట్లతో దక్షిణాఫ్రికా పతనాన్నిశాసించారు.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన నమీబియా 39.4 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. నమీబియాకు 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా.. లౌరెన్స్(58 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో మరోసారి టైటిల్ ను కైవసం చేసుకుందామనుకున్న సఫారీలకు లీగ్ దశలోనే గండి పడింది.