టి20 ప్రపంచకప్‌లో గ్రూఫ్ ఏ2 క్వాలిఫయర్‌గా నమీబియా సూపర్ 12 దశకు అర్హత సాధించింది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నమీబియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. గెర్హాడ్ ఎరాస్మస్ (53 పరుగులు నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. డేవిడ్ వీస్ (14 బంతుల్లో 28 పరుగులు, 1 ఫోర్, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విజయంతో నమీబియా ఏ-2 క్వాలిఫయర్‌గా సూపర్ 12 దశకు అర్హత సాధించింది. కాగా ఇంతకముందు ఏ-1గా శ్రీలంక సూపర్ 12కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. అంతకముందు ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఐర్లాండ్ బ్యాటింగ్‌లో పాల్ స్టిర్లింగ్ 38 పరుగులు చేయగా.. కెవిన్ ఒబ్రెన్ 25 పరుగులు, ఆండ్రూ బాల్బిరిన్ 21 పరుగులు చేశాడు. నమీబియా బౌలర్లలో జాన్ ఫ్రింక్చ్ 3, డేవిడ్ వీస్ 2 వికెట్లు తీశాడు.
13 ఓవర్లలో నమీబియా 71/1
12 ఓవర్లు ముగిసేసరికి నమీబియా వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. గ్రీన్ 22, ఎరాస్మస్ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా నమీబియా విజయానికి 42 బంతుల్లో 55 పరుగులు కావాలి.
6 ఓవర్లలో నమీబియా 27/1
126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది. జానే గ్రీన్ 13, ఎరాస్మస్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు క్రెయిగ్ విలియమ్స్ 15 పరుగుల వద్ద క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
ఐర్లాండ్ 125.. నమీబియా టార్గెట్ 126
నమీబియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఐర్లాండ్ బ్యాటింగ్‌లో పాల్ స్టిర్లింగ్ 38 పరుగులు చేయగా.. కెవిన్ ఒబ్రెన్ 25 పరుగులు, ఆండ్రూ బాల్బిరిన్ 21 పరుగులు చేశాడు. నమీబియా బౌలర్లలో జాన్ ఫ్రింక్చ్ 3, డేవిడ్ వీస్ 2 వికెట్లు తీశాడు.
రెండో వికెట్ కోల్పోయిన ఐర్లాండ్.. 10 ఓవర్లలో 71/2
నమీబియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఐర్లాండ్ స్వల్ప వ్యవధిలో ఓపెనర్లిద్దరి వికెట్లు కోల్పోయింది. తొలుత 38 పరుగులు చేసిన పాల్ స్టిర్లింగ్ స్కాట్జ్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ 9వ ఓవర్లో కెవిన్ ఒబ్రెన్ 25 పరుగుల వద్ద జాన్ ఫ్రిలింక్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ప్రస్తుతం 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది.
6 ఓవర్లలో ఐర్లాండ్ 55/0
నమీబియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఐర్లాండ్ ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్(36), కెవిన్ ఒబ్రెన్(20) చెలరేగి ఆడుతున్నారు.
షార్జా: టి20 ప్రపంచకప్‌లో గ్రూఫ్-ఏ క్వాలిఫయర్‌లో భాగంగా నమీబియా, ఐర్లాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ఐర్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే శ్రీలంక గ్రూఫ్ ఏ నుంచి సూపర్ 12 దశకు అర్హత సాధించింది. ఇక ఆడిన రెండు మ్యాచ్‌ల్లో చెరో విజయంతో ఉన్న నమీబియా, ఐర్లాండ్‌లకు మ్యాచ్ కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వాళ్లు సూపర్ 12కు అర్హత సాధిస్తారు.
నమీబియా : జేన్ గ్రీన్ (వికెట్ కీపర్), క్రెయిగ్ విలియమ్స్, మైఖేల్ వాన్ లింగెన్, గెర్హార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), డేవిడ్ వైస్, జెజె స్మిట్, జాన్ ఫ్రిలింక్, పిక్కీ యా ఫ్రాన్స్, జాన్ నికోల్ లోఫ్టీ-ఈటన్, రూబెన్ ట్రంపెల్‌మన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్
ఐర్లాండ్ : పాల్ స్టిర్లింగ్, కెవిన్ ఓ బ్రియాన్, ఆండ్రూ బాల్‌బిర్నీ (కెప్టెన్), గారెత్ డెలానీ, కర్టిస్ క్యాంపర్, హ్యారీ టెక్టర్, నీల్ రాక్ (వికెట్ కీపర్), మార్క్ అడైర్, సిమి సింగ్, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్
Comments
Please login to add a commentAdd a comment