
Mohammad Shahzad complete 2000 T20I Runs.. అప్గనిస్తాన్ క్రికెటర్ మహ్మద్ షెహజాద్ టి20 క్రికెట్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అఫ్గన్ తరపున టి20ల్లో రెండు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా నమీబియాతో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 11వ ఓవర్ తొలి బంతిని సిక్స్‌గా మలచడం ద్వారా ఈ ఘనతను అందుకున్నాడు. ఓవరాల్‌గా షెహజాద్ 33 బంతుల్లో 45 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు.. 2 సిక్సర్లు ఉన్నాయి.
మహ్మద్ షెహజాద్ ఆకారంలో లావుగా కనిపిస్తున్నప్పటికి ఆటలో మాత్రం క్లాస్ కనిపిస్తుంది. అఫ్గన్ ఓపెనర్‌గా షెహజాద్ ఇటీవలే మంచి ప్రదర్శన చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక 2009లో క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన షెహజాద్ వికెట్ కీపర్‌గా సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇక అఫ్గన్ తరపున షెహజాద్ 2 టెస్టుల్లో 69 పరుగులు.. 84 వన్డేల్లో 2,727 పరుగులు.. 66 టి20ల్లో 2011 పరుగులు సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment