
Asghar Afghan Reveals Reason Behind Sudden Retirement.. అఫ్గానిస్తాన్ వెటరన్ క్రికెటర్ అస్గర్ అఫ్గాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టి20 ప్రపంచకప్‌లో భాగంగా నమీబియాతో మ్యాచ్‌కు ముందు ఈ ప్రకటన చేసి అందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇక నమీబియాతో ఆఖరి మ్యాచ్ ఆడిన అస్గర్ అఫ్గాన్ 31 పరుగులు చేసి ఔటయ్యాడు. అంతకముందు అస్గర్ మైదానంలో అడుగుపెట్టే సమయంలో స్కాట్లాండ్ ఆటగాళ్లు గార్డ్ హాఫ్ ఆనర్ ఇచ్చి క్రీడాస్పూర్తిని చాటారు. అస్గర్ ఔటై పెవిలియన్ చేరిన తర్వాత డగౌట్‌లో కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంగా విరామ సమయంలో రిటైర్మెంట్‌పై స్టార్‌స్పోర్ట్స్ చానెల్‌తో జరిగిన ఇంటర్య్వూలో అస్గర్ స్పందించాడు.
చదవండి: T20 WC 2021: అఫ్గాన్ స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం..
'' అప్గానిస్తాన్ క్రికెట్‌కు ఈరోజుతో నా సేవలు ముగిశాయి. ఇన్నేళ్లు అఫ్గన్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగిన నాకు మద్దతిచ్చిన ప్రతీ ఒక్కరికి కృతజ్థతలు. జట్టులో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే రిటైర్మెంట్ ప్రకటించా. అయితే టి20 ప్రపంచకప్ మధ్యలోనే వైదొలగడం బాధ కలిగిస్తున్నా.. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం కోసమే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నా. నా రిటైర్మెంట్ విషయంలో మరో కారణం కూడా ఉంది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడం మా జట్టును బాధించింది. బాబర్ అజమ్ సేన మాకంటే స్ట్రాంగ్ టీమ్‌గా ఉన్నప్పటికీ వారిని ఓడించాలని శతవిధాల ప్రయత్నించాం. ఆ మ్యాచ్‌లో మా కెప్టెన్ నబీతో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాను. కానీ మ్యాచ్ ఓడిపోవడం బాధ కలిగించింది. ఇక్కడే నా రిటైర్మెంట్‌కు అడుగు పడినట్లుగా అనిపిస్తుంది.'' అని చెప్పుకొచ్చాడు.
ఇక అస్గర్ అఫ్గన్ అఫ్గానిస్థాన్ తరఫున 6 టెస్ట్‌లు, 115 వన్డేలు, 75 టీ20ల్లో 4000కు పైగా పరుగులు సాధించాడు. ఇందులో 2 శతకాలు, 19 అర్ధశతకాలు ఉన్నాయి. అస్గర్‌కు టీ20 కెప్టెన్సీలో ఘనమైన రికార్డు ఉంది. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక విజయాలు సాధించిన సారధిగా రికార్డు నెలకొల్పాడు. 2015-2021 మధ్యలో 52 టీ20ల్లో అఫ్గానిస్థాన్ జట్టుకు సారధిగా వ్యవహరించిన అస్గర్.. అత్యధికంగా 42 విజయాలు నమోదు చేశాడు. ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోని(72 మ్యాచ్‌ల్లో 41 విజయాలు) రెండో స్థానంలో ఉన్నాడు.
Asghar Afghan's emotional swansong https://t.co/i9U6DdmjHR via @t20wc
— Bhavana.Gunda (@GundaBhavana) October 31, 2021
Comments
Please login to add a commentAdd a comment