Asghar Afghan
-
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ కాదు.. ఫైనల్ ఆ రెండు జట్లే మధ్యే
టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా ఆక్టోబర్ 23న పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయంలో స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి కీలక పాత్ర పోషించాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరే జట్లను ఆఫ్గానిస్తాన్ మాజీ కెప్టెన్ అస్గర్ ఆఫ్ఘన్ అంచనా వేశాడు. ఈ మెగా ఈవెంట్ ఫైనల్లో భారత్-పాక్ జట్లు మరో సారి తలపడతాయి అని ఆఫ్ఘన్ జోస్యం చెప్పాడు. క్రిక్‌ట్రాకర్‌తో ఆఫ్గాన్ మాట్లాడుతూ.. "ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో హాట్ ఫేవరేట్ జట్లు అంటే టక్కున గుర్తుచ్చేది ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, భారత్. కానీ ఈ సారి ఫైనల్లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడతాయని నేను భావిస్తున్నాను. గ్రూపు-2 నుంచి టీమిండియా, పాకిస్తాన్‌కు ఫైనల్స్‌కు వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే గత మ్యాచ్‌లో సగం వరకు భారత్‌పై వరకు పాకిస్తాన్ పైచేయి సాధించింది. కానీ విరాట్ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్‌తో పాక్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. పాకిస్తాన్‌పై కోహ్లికి అద్భుతమైన రికార్డు ఉంది. ఒక వేళ ఈ మ్యాచ్‌లో కోహ్లిని ఔట్ చేసి ఉంటే కచ్చితంగా పాక్ విజయం సాధించేది అని అతడు పేర్కొన్నాడు. చదవండి: T20 World Cup 2022: నెదర్లాండ్స్‌తో భారత్ ఢీ.. కోహ్లి మళ్లీ మెరుస్తాడా? -
'టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌కు చేరే జట్లు ఇవే'
టీ20 ప్రపంచకప్-2022 తొలి రౌండ్ మ్యాచ్‌లు ఇప్పటికే ముగియగా.. ప్రస్తుతం సూపర్-12 సమరం మొదలైంది. సూపర్-12 తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సిడ్నీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 89 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మెగా ఈవెంట్లో సెమీ-ఫైనల్‌కు చేరుకునే నాలుగు జట్లను ఆఫ్ఘనిస్తాన్ మాజీ కెప్టెన్ అస్గర్ ఆఫ్ఘన్ అంచనా వేశాడు. ఈ ఏడాది ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు సెమీఫైనల్లో అడుగు పెడతాయని ఆఫ్గన్ జోస్యం చెప్పాడు. గతేడాది ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన న్యూజిలాండ్‌ను ఆఫ్గాన్ ఎంపికచేయకపోవడం గమనార్హం. కాగా ఆఫ్గాన్ పేర్కొన్న ఈ నాలు గు జట్లు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాయి. ఇంగ్లండ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ విజయంతో ఈ మెగా ఈవెంట్లో అడుగుపెట్టింది. అదే విధంగా భారత్ కూడా స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాను మట్టి కరిపించి ఈ టోర్నీలో బరిలోకి దిగనుంది. మరోవైపు పాకిస్తాన్ కూడా ట్రై సిరీస్‌లో విజయం సాధించి మంచి జోష్ మీద ఉంది. ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే.. ఓటమితో ఈ టోర్నీను ఆరంభించింది. చదవండి: NZ Vs Aus: డిఫెండింగ్ చాంపియన్.. కుప్పకూలిన టాపార్డర్.. మరీ ఇంత చెత్తగానా? వారెవ్వా కివీస్.. సూపర్! -
కోహ్లి, రోహిత్‌లను అవుట్ చేస్తే.. సగం జట్టు పెవిలియన్ చేరినట్లే! అలా అనుకుని..
Legends League Cricket 2022- Asghar Afghan- Team India- T20 World Cup 2022: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గురించి అఫ్గనిస్తాన్ మాజీ కెప్టెన్ అస్గర్ అఫ్గన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్‌తో మ్యాచ్‌లో ఈ ఇద్దరిని అవుట్ చేస్తే సగం జట్టును పెవిలియన్‌కు పంపినట్లే భావించేవాళ్లమని పేర్కొన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా వీరి సొంతమంటూ హిట్‌మ్యాన్ రోహిత్, రన్‌మెషీన్ కోహ్లిలను కొనియాడాడు. గంభీర్ సారథ్యంలో.. లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022లో అస్గర్ అఫ్గన్ ఇండియా క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సారథ్యంలో అతడు ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో ఇండియాకు వచ్చిన అస్గర్ హిందుస్థాన్ టైమ్స్‌తో ప్రత్యేకంగా ముచ్చటించాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆసియా కప్-2022లో టీమిండియా ప్రదర్శన, టీ20 ప్రపంచకప్-2022లో రోహిత్ సేన విజయావకాశాలపై తన అభిప్రాయాలు తెలిపాడు. టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా.. టీ20లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహాలు రచించేవాళ్లు అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఇండియాతో మ్యాచ్ అంటేనే.. మా మొదటి ప్రాధాన్యం.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వికెట్లే! కోహ్లిని ఆపడం కష్టం! వాళ్లిద్దరినీ అవుట్ చేస్తే సగం జట్టును అవుట్ చేసినట్లే అని అనుకునేవాళ్లం. ప్రపంచంలోని మేటి బ్యాటర్లు అయిన వీళ్లిద్దరి గురించే మా చర్చంతా! ఎందుకంటే ఒంటిచేత్తో వాళ్లు మ్యాచ్‌ను మలుపు తిప్పగలరు! అందుకే... ముందు రోహిత్, కోహ్లిలను అవుట్ చేస్తే చాలు అనుకునేవాళ్లం. లేదంటే.. టీమిండియాను ఎదుర్కోవడం మరింత కష్టతరంగా మారుతుందని మాకు తెలుసు. ముఖ్యంగా విరాట్ కోహ్లి.. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే తనని ఆపడం కష్టం. రోహిత్, కోహ్లిలను పెవిలియన్‌కు పంపితే వన్డేల్లో టీమిండియా స్కోరులో 100- 120... టీ20లలో 60- 70 పరుగులు తగ్గించవచ్చని భావించేవాళ్లం’’ అని అస్గర్ అఫ్గన్ చెప్పుకొచ్చాడు. ఆసియాకప్‌లో ఓటములకు అదే కారణం! అయితే.. ఇక ఆసియా కప్-2022లో రోహిత్ సేన సూపర్-4లో వరుస మ్యాచ్‌లు ఓడటానికి రవీంద్ర జడేజా లేకపోవడం కూడా ఒక కారణమని అస్గర్ అభిప్రాయపడ్డాడు. అయితే, ఈ టోర్నీలో ఓడినంత మాత్రాన టీమిండియాను తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న వరల్డ్‌కప్ రూపంలో వారికి మంచి అవకాశం వచ్చిందని.. కచ్చితంగా టీమిండియా ఈ ఛాన్స్‌ను ఉపయోగించుకుంటుందని చెప్పుకొచ్చాడు. ఇక గత కొంతకాలంగా నిలకడలేమి ఫామ్‌తో ఇబ్బంది పడిన విరాట్ కోహ్లి.. ఆసియాకప్‌లో అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో అజేయ శతకంతో రాణించి విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. గతేడాది మేలో కెప్టెన్సీ కోల్పోయిన అస్గర్ అఫ్గన్.. టీ20 ప్రపంచకప్ టోర్నీ-2021లో నమీబియాతో మ్యాచ్‌కు ముందు అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. చదవండి: T20 WC: ఇదే లాస్ట్ ఛాన్స్! అదే జరిగితే బాబర్ ఆజం కెప్టెన్సీ కోల్పోవడం ఖాయం! Ind Vs Aus: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా.. పూర్తి షెడ్యూల్, జట్లు.. ఇతర వివరాలు! -
చెలరేగిన ఆఫ్గాన్.. 4 ఫోర్లు,7 సిక్స్‌లు, కేవలం 28 బంతుల్లోనే
లెజెండ్స్ లీగ్ క్రికెటలో ఇండియా మహారాజాస్ మరో ఓటమి చవి చూసింది. అల్ అమెరట్ వేదికగా ఆసియా లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో పరాజాయం పాలైంది. 193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మహారాజాస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులకే పరిమితమైంది. మహారాజాస్ బ్యాటర్లలో వసీం జాఫర్(35),మన్‌ప్రీత్ గొనీ(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన ఆసియా లయన్స్ఆదిలోనే ఓపెనర్లు వికెట్ కోల్పోయింది. తరంగా, మహ్మద్ యూసఫ్ కలిసి ఇన్నింగ్ చక్కదిద్దారు. వీరిద్దరూ ఔటయ్యాక బ్యాటింగ్‌కు వచ్చిన అస్గర్ అఫ్గాన్ ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకు పడ్డాడు. కేవలం 29 బంతుల్లోనే 69 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు.. 7 సిక్స్‌లు ఉన్నాయి. తరంగా(72), అఫ్గాన్ (69) ఇన్నింగ్స్‌లతో ఆసియా లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కో్ల్పోయి 193 పరుగులు చేసింది. ఇక బౌలింగ్లోను రెండు వికెట్లు పడగొట్టి అఫ్గాన్ కీలక పాత్ర పోషించాడు. -
Asghar Afghan: 40 జట్లపై ఆడినవాడు.. అత్యధిక విజయాల కెప్టెన్..!
Asghar Afghan Retirement: అస్గర్ అఫ్గాన్... జాతీయ జట్టుకు సుదీర్ఘ కాలం సేవలందించిన సీనియర్ ఆటగాడు. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా అతను జట్టు భారాన్ని మోశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అఫ్గాన్ తొలి అడుగులు పడుతున్న సమయంలో కీలక సభ్యుడిగా నిలిచిన అతను 12 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికాడు. 2004లో అఫ్గాన్ అండర్–17 సభ్యుడిగా సత్తా చాటిన అనంతరం అతను సీనియర్ స్థాయికి ఎదిగాడు. అఫ్గాన్ తొలి ప్రధాన ఐసీసీ టోర్నీ అయిన 2010 టి20 ప్రపంచకప్‌లో సభ్యుడిగా ఉన్న అతను ఇప్పుడు టి20 ప్రపంచకప్‌తోనే ఆటకు గుడ్‌బై చెప్పాడు. ఒక టెస్టు జట్టుపై అఫ్గాన్ తొలి విజయంలో (2014లో బంగ్లాదేశ్‌పై) కూడా అతనిది కీలక పాత్ర.బ్యాట్స్మన్గాకంటే కూడా అస్గర్ కెప్టెన్‌గా జట్టుపై తనదైన ముద్ర వేశాడు. ప్రతికూలతలను అధిగమించి అఫ్గానిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్‌పై తమదైన ముద్ర వేయడంలో అతని పాత్ర ఎంతో ఉంది. అత్యధిక విజయాల కెప్టెన్ అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక విజయాల కెప్టెన్‌గా రికార్డు అతని పేరిటే ఉండటం విశేషం. 52 మ్యాచ్‌లలో జట్టుకు నాయకత్వం వహించిన అస్గర్ 42 మ్యాచ్‌లలో గెలిపించాడు. 114 వన్డేల్లో 2424 పరుగులు చేసిన అతను, 75 అంతర్జాతీయ టి20ల్లో 1382 పరుగులు సాధించాడు. అఫ్గాన్ తొలి టెస్టు (భారత్‌తో)కు కెప్టెన్న్గా ఉన్న అతను మొత్తం 6 టెస్టులు ఆడాడు. 40 టీమ్‌లను ఎదుర్కొన్నాడు.. అఫ్గానిస్తాన్ జట్టు ఇన్నేళ్లలో వరల్డ్ చాంపియన్‌షిప్ లీగ్ – డివిజన్ 5 పోటీల స్థాయినుంచి నెమ్మదిగా పెద్ద టోర్నీలు ఆడే రెగ్యులర్ జట్టుగా ఎదిగింది. దాంతో అస్గర్‌కు పెద్ద సంఖ్యలో వేర్వేరు ప్రత్యర్థులతో ఆడే అవకాశం దక్కింది. అఫ్గాన్ జట్టు సభ్యుడిగా అస్గర్ ఏకంగా 40 టీమ్‌లను ఎదుర్కోవడం విశేషం. ఇందులో బహ్రెయిన్, కువైట్, టాంజానియా, ఇటలీ, అర్జెంటీనా, భూటాన్, జపాన్ తదితర టీమ్‌లు ఉండటం విశేషం! ఇక టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా నమీబియాతో మ్యాచ్ సందర్భంగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు అస్గర్ అఫ్గాన్. ఈ సందర్భంగా అతడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. కన్నీటి పర్యంతమవుతూ జట్టుతో జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. పాకిస్తాన్‌తో ఓటమి బాధించిందని... రిటైర్మెంట్ ప్రకటించేలా తనను పురిగొల్పిందని పేర్కొన్నాడు. చదవండి: T20 World Cup 2021 Ind Vs NZ: టోర్నీ నుంచి నిష్క్రమించినట్లేనా.. ఇంకా అవకాశం ఉందా?! -
పాక్‌తో ఓడిపోవడం బాధ కలిగించింది.. అందుకే రిటైర్మెంట్
Asghar Afghan Reveals Reason Behind Sudden Retirement.. అఫ్గానిస్తాన్ వెటరన్ క్రికెటర్ అస్గర్ అఫ్గాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టి20 ప్రపంచకప్‌లో భాగంగా నమీబియాతో మ్యాచ్‌కు ముందు ఈ ప్రకటన చేసి అందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇక నమీబియాతో ఆఖరి మ్యాచ్ ఆడిన అస్గర్ అఫ్గాన్ 31 పరుగులు చేసి ఔటయ్యాడు. అంతకముందు అస్గర్ మైదానంలో అడుగుపెట్టే సమయంలో స్కాట్లాండ్ ఆటగాళ్లు గార్డ్ హాఫ్ ఆనర్ ఇచ్చి క్రీడాస్పూర్తిని చాటారు. అస్గర్ ఔటై పెవిలియన్ చేరిన తర్వాత డగౌట్లో కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంగా విరామ సమయంలో రిటైర్మెంట్పై స్టార్‌స్పోర్ట్స్ చానెల్‌తో జరిగిన ఇంటర్య్వూలో అస్గర్ స్పందించాడు. చదవండి: T20 WC 2021: అఫ్గాన్ స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. '' అప్గానిస్తాన్ క్రికెట్‌కు ఈరోజుతో నా సేవలు ముగిశాయి. ఇన్నేళ్లు అఫ్గన్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగిన నాకు మద్దతిచ్చిన ప్రతీ ఒక్కరికి కృతజ్థతలు. జట్టులో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే రిటైర్మెంట్ ప్రకటించా. అయితే టి20 ప్రపంచకప్ మధ్యలోనే వైదొలగడం బాధ కలిగిస్తున్నా.. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం కోసమే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నా. నా రిటైర్మెంట్ విషయంలో మరో కారణం కూడా ఉంది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడం మా జట్టును బాధించింది. బాబర్ అజమ్ సేన మాకంటే స్ట్రాంగ్ టీమ్‌గా ఉన్నప్పటికీ వారిని ఓడించాలని శతవిధాల ప్రయత్నించాం. ఆ మ్యాచ్‌లో మా కెప్టెన్ నబీతో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాను. కానీ మ్యాచ్ ఓడిపోవడం బాధ కలిగించింది. ఇక్కడే నా రిటైర్మెంట్కు అడుగు పడినట్లుగా అనిపిస్తుంది.'' అని చెప్పుకొచ్చాడు. ఇక అస్గర్ అఫ్గన్ అఫ్గానిస్థాన్ తరఫున 6 టెస్ట్‌లు, 115 వన్డేలు, 75 టీ20ల్లో 4000కు పైగా పరుగులు సాధించాడు. ఇందులో 2 శతకాలు, 19 అర్ధశతకాలు ఉన్నాయి. అస్గర్‌కు టీ20 కెప్టెన్సీలో ఘనమైన రికార్డు ఉంది. పొట్టి ఫార్మాట్లో అత్యధిక విజయాలు సాధించిన సారధిగా రికార్డు నెలకొల్పాడు. 2015-2021 మధ్యలో 52 టీ20ల్లో అఫ్గానిస్థాన్ జట్టుకు సారధిగా వ్యవహరించిన అస్గర్.. అత్యధికంగా 42 విజయాలు నమోదు చేశాడు. ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోని(72 మ్యాచ్‌ల్లో 41 విజయాలు) రెండో స్థానంలో ఉన్నాడు. Asghar Afghan's emotional swansong https://t.co/i9U6DdmjHR via @t20wc — Bhavana.Gunda (@GundaBhavana) October 31, 2021 -
అఫ్గాన్ స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం..
Asghar Afghan To Retire After Clash With Namibia In T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా ఆదివారం(అక్టోబర్ 31) నమీబియాతో జరగాల్సిన మ్యాచ్‌కు ముందు అఫ్గానిస్థాన్ స్టార్ ఆటగాడు, ఆ జట్టు మాజీ కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ సంచలన ప్రకటన చేశాడు. నమీబియాతో మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించాడు. దీంతో అస్గర్ అఫ్గాన్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలని అఫ్గాన్ ఆటగాళ్లు భావిస్తున్నారు. 33 ఏళ్ల అస్గర్ అఫ్గాన్.. అఫ్గానిస్థాన్ తరఫున 6 టెస్ట్‌లు, 115 వన్డేలు, 75 టీ20ల్లో 4000కు పైగా పరుగులు సాధించాడు. ఇందులో 2 శతకాలు, 19 అర్ధశతకాలు ఉన్నాయి. అస్గర్‌కు టీ20 కెప్టెన్సీలో ఘనమైన రికార్డు ఉంది. పొట్టి ఫార్మాట్లో అత్యధిక విజయాలు సాధించిన సారధిగా రికార్డు నెలకొల్పాడు. 2015-2021 మధ్యలో 52 టీ20ల్లో అఫ్గానిస్థాన్ జట్టుకు సారధిగా వ్యవహరించిన అస్గర్.. అత్యధికంగా 42 విజయాలు నమోదు చేశాడు. ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోని(72 మ్యాచ్‌ల్లో 41 విజయాలు) రెండో స్థానంలో ఉన్నాడు. చదవండి: భువనేశ్వర్‌ను తీసేయండి.. అతడిని తీసుకోండి