టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా ఆక్టోబర్ 23న పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయంలో స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి కీలక పాత్ర పోషించాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరే జట్లను ఆఫ్గానిస్తాన్ మాజీ కెప్టెన్ అస్గర్ ఆఫ్ఘన్ అంచనా వేశాడు.
ఈ మెగా ఈవెంట్ ఫైనల్లో భారత్-పాక్ జట్లు మరో సారి తలపడతాయి అని ఆఫ్ఘన్ జోస్యం చెప్పాడు. క్రిక్‌ట్రాకర్‌తో ఆఫ్గాన్ మాట్లాడుతూ.. "ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో హాట్ ఫేవరేట్ జట్లు అంటే టక్కున గుర్తుచ్చేది ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, భారత్. కానీ ఈ సారి ఫైనల్లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడతాయని నేను భావిస్తున్నాను.
గ్రూపు-2 నుంచి టీమిండియా, పాకిస్తాన్‌కు ఫైనల్స్‌కు వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే గత మ్యాచ్‌లో సగం వరకు భారత్‌పై వరకు పాకిస్తాన్ పైచేయి సాధించింది. కానీ విరాట్ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్‌తో పాక్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. పాకిస్తాన్‌పై కోహ్లికి అద్భుతమైన రికార్డు ఉంది. ఒక వేళ ఈ మ్యాచ్‌లో కోహ్లిని ఔట్ చేసి ఉంటే కచ్చితంగా పాక్ విజయం సాధించేది అని అతడు పేర్కొన్నాడు.
చదవండి: T20 World Cup 2022: నెదర్లాండ్స్‌తో భారత్ ఢీ.. కోహ్లి మళ్లీ మెరుస్తాడా?
Comments
Please login to add a commentAdd a comment