టీ20 ప్రపంచకప్-2022 తొలి రౌండ్ మ్యాచ్‌లు ఇప్పటికే ముగియగా.. ప్రస్తుతం సూపర్-12 సమరం మొదలైంది. సూపర్-12 తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సిడ్నీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 89 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మెగా ఈవెంట్‌లో సెమీ-ఫైనల్‌కు చేరుకునే నాలుగు జట్లను ఆఫ్ఘనిస్తాన్ మాజీ కెప్టెన్ అస్గర్ ఆఫ్ఘన్ అంచనా వేశాడు. ఈ ఏడాది ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు సెమీఫైనల్లో అడుగు పెడతాయని ఆఫ్గన్ జోస్యం చెప్పాడు. గతేడాది ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన న్యూజిలాండ్‌ను ఆఫ్గాన్ ఎంపికచేయకపోవడం గమనార్హం.
కాగా ఆఫ్గాన్ పేర్కొన్న ఈ నాలు గు జట్లు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాయి. ఇంగ్లండ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ విజయంతో ఈ మెగా ఈవెంట్‌లో అడుగుపెట్టింది. అదే విధంగా భారత్ కూడా స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాను మట్టి కరిపించి ఈ టోర్నీలో బరిలోకి దిగనుంది. మరోవైపు పాకిస్తాన్ కూడా ట్రై సిరీస్‌లో విజయం సాధించి మంచి జోష్ మీద ఉంది. ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే.. ఓటమితో ఈ టోర్నీను ఆరంభించింది.
చదవండి: NZ Vs Aus: డిఫెండింగ్ చాంపియన్.. కుప్పకూలిన టాపార్డర్.. మరీ ఇంత చెత్తగానా? వారెవ్వా కివీస్.. సూపర్!
Comments
Please login to add a commentAdd a comment