Asghar Afghan To Retire After Clash With Namibia In T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా ఆదివారం(అక్టోబర్ 31) నమీబియాతో జరగాల్సిన మ్యాచ్‌కు ముందు అఫ్గానిస్థాన్ స్టార్ ఆటగాడు, ఆ జట్టు మాజీ కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ సంచలన ప్రకటన చేశాడు. నమీబియాతో మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించాడు. దీంతో అస్గర్ అఫ్గాన్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలని అఫ్గాన్ ఆటగాళ్లు భావిస్తున్నారు.
33 ఏళ్ల అస్గర్ అఫ్గాన్.. అఫ్గానిస్థాన్ తరఫున 6 టెస్ట్‌లు, 115 వన్డేలు, 75 టీ20ల్లో 4000కు పైగా పరుగులు సాధించాడు. ఇందులో 2 శతకాలు, 19 అర్ధశతకాలు ఉన్నాయి. అస్గర్‌కు టీ20 కెప్టెన్సీలో ఘనమైన రికార్డు ఉంది. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక విజయాలు సాధించిన సారధిగా రికార్డు నెలకొల్పాడు. 2015-2021 మధ్యలో 52 టీ20ల్లో అఫ్గానిస్థాన్ జట్టుకు సారధిగా వ్యవహరించిన అస్గర్.. అత్యధికంగా 42 విజయాలు నమోదు చేశాడు. ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోని(72 మ్యాచ్‌ల్లో 41 విజయాలు) రెండో స్థానంలో ఉన్నాడు.
చదవండి: భువనేశ్వర్‌ను తీసేయండి.. అతడిని తీసుకోండి
Comments
Please login to add a commentAdd a comment