
New Zeland Enters Semifinal Knock Out AFG And IND.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ చేతులెత్తేసింది. 125 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ను ఆలౌట్ చేయడంలో అఫ్గాన్ బౌలర్లు విఫలమయ్యారు. 18.1 ఓవర్లలోనే న్యూజిలాండ్ లక్ష్యాన్ని చేధించడంతో అఫ్గానిస్తాన్ ఇంటిబాట పట్టింది. పోతూపోత టీమిండియాను కూడా ఇంటికి తీసుకెళ్లనుంది. ఇక సోమవారం(నవంబర్ 8న) నమీబియాతో జరగనున్న మ్యాచ్ టీమిండియాకు నామమాత్రంగా మారింది.
టీమిండియా సెమీస్ ఆశలన్నీ అఫ్గాన్ బౌలర్లపైనే ఉన్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. నజీబుల్లా జర్దన్ 73 పరుగులతో రాణించడంతో అఫ్గాన్ ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. ఇక టీమిండియా సెమీస్ చేరాలంటే అఫ్గాన్ బౌలర్లు మెరుగ్గా రాణించాల్సి ఉంటుంది. ఇక అఫ్గాన్ కివీస్‌ను 81 అంతకంటే తక్కువ పరుగులకు ఆలౌట్ చేస్తే మెరుగైన రన్‌రేట్‌తో సెమీస్‌కు ప్రవేశిస్తుంది. మరి అఫ్గాన్ బౌలర్లు ఏం చేస్తారో చూడాలి.
చదవండి: Chris Gayle: నేనింకా రిటైర్ కాలేదు.. ఆ హడావుడి అంతా అందుకే..!
Comments
Please login to add a commentAdd a comment