T20 World Cup 2021: Najib Zardan Creates Highest Individual Score In T20 History - Sakshi
Sakshi News home page

Najib Zadran: టి20 ప్రపంచకప్‌లో అఫ్గాన్‌ తరపున తొలి బ్యాటర్‌గా

Published Sun, Nov 7 2021 5:55 PM | Last Updated on Mon, Nov 8 2021 11:25 AM

T20 World Cup 2021: Nazib Zardan Become Highest Individual Score AFG T20 WC - Sakshi

Najib Zadran Highest Individual Score T20 Wc History.. టి20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ బ్యాటర్‌ నజీబ్‌ జర్దన్‌ అరుదైన రికార్డు సాధించాడు. టి20 ప్రపంచకప్‌లో అఫ్గాన్‌ తరపున అత్యధిక స్కోరు సాధించిన జాబితాలో నజీబ్‌ జర్దన్‌ తొలి స్థానంలో నిలిచాడు. కివీస్‌తో మ్యాచ్‌లో అఫ్గాన్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన దశలో నజీబ్‌ తన ఇన్నింగ్స్‌తో అఫ్గాన్‌ గౌరవప్రదమైన స్కోరు చేసేందుకు సహకరించాడు.

48 బంతుల్లో 73 పరుగులు సాధించిన నజీబ్‌ జర్దన్‌ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు.. 3 సిక్సర్లు ఉన్నాయి. ఇక అహ్మద్‌ షెహజాద్‌ టి20 ప్రపంచకప్‌లో రెండుసార్లు అఫ్గాన్‌ తరపున అత్యధిక స్కోరు నమోదు చేశాడు. 2014 టి20 ప్రపంచకప్‌లో హాంకాంగ్‌పై 68 పరుగులు.. 2016 టి20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌పై 61 పరుగులు సాధించాడు. ఇక మాజీ ఆటగాడు అస్గర్‌ అఫ్గాన్‌ 2016 టి20 ప్రపంచకప్‌లో శ్రీలంకపై 62 పరుగులు చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement